Breaking News
Join This Site
నదీ స్నానం ఎలా చేయాలి?

నదీ స్నానం ఎలా చేయాలి?


నగ్నంగా స్నానం (పుష్కరాలు, పండుగలు, మిగతా రోజులలో) చేయకూడదు.
నదీ స్నానం పుష్కర సమయంలోనే కాకుండా ఇతర సమయాలలో కూడా అంగవస్త్రం (డ్రాయర్ తో) స్నానం చేయరాదు. పంచెతో చేయడం ఉత్తమం.
నదులలో సబ్బుతో స్నానం చేయకూడదు. నదీలో ఉన్న ఇసుకను ఒంటికి రాసుకొని చేస్తే ఆరోగ్యం కూడా వస్తుంది.
పరాయి స్త్రీ వ్యామోహంతో స్నానం చేయకూడదు.
నిక్కర్లు, షార్ట్స్ వేసుకొని స్నానం చేయకూడదు.
రతి సౌఖ్యం తరువాత ఏ సమయంలో (పుష్కరాలు, పండుగలు, మిగతా రోజులలో) కూడా స్నానం చేయకూడదు.
దేవతలను మనం ఎంత పవిత్రంగా చూస్తామో! అంతే పవిత్రంగా నదులను కూడా చూడాలి. నదీ స్నానానికి వెళ్ళే ముందు స్నానం చేసి వెళ్ళడం ఉత్తమం.
స్నానానంతరం స్నానం చేసిన వస్త్రాలను ఇతరుల మీద పడేలా విదిలించకూడదు. ఇది దోషం.
అంగ వస్త్రాలను నదులలో ఉతకడం, జాడించడం చేయరాదు.
నదులలో స్నానానంతరం కూడా స్నానం చేసి విడిచినవి కూడా నదులలో జాడించకూడదు.
నదులలో ఉమ్మడం, మూత్ర విసర్జన చేయడం దోషం.
సంకల్ప పూర్వకంగా స్నానం చేయడం వలన ఫలితం ఎక్కువగా ఉంటుంది.
భక్తి లేకుండా నదులలో మునగడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇంట్లో స్నానం చేసినట్లే ఫలితం ఉండదు.

ఇలాంటి నిబంధనలు పాటిస్తే శుభం కలుగుతుంది. అంతేకాని శాస్త్ర ప్రమాణం లేకుండా ఎవరు ఏదిపడితే అది చెబితే దానిని నమ్మేసి స్నానం మానేయకండి. అలాగే పుష్కర సంకల్పం చెప్పుకొని, తెలియకపోతే అక్కడే ఉన్న బ్రాహ్మణులతో సంకల్పం చెప్పించుకొని స్నానం చేయండి.

పుష్కర సమయంలో వరలక్ష్మి వ్రతం చేయకూడదు అంటారు కొందఱు, పుష్కర సమయంలో వివాహానికి లగ్గాలు పెట్టుకున్న తరువాత పుష్కర స్నానం చేయకూడదు అంటారు కొందరు. ఇలాంటి మాటలు నమ్మకండి. పుష్కర స్నానం అంటే పరమపవిత్రం. ఆ సమయంలో దేవతలు నిత్యం స్నానమాచరిస్తారు. ఆనీటికి పరమ పవిత్రత వస్తుంది. అలాంటి పుష్కరాలలో స్నానం చేయొద్దు అని చెప్పినా, వారి మాటలు విని చేయకపోయినా నష్టపోయేది మీరే. ఏ శాస్త్రంలో కూడా ఫలానావారు స్నానం చేయొద్దు అని చెప్పలేదు. కానీ కొన్ని నిబంధనలు ఉన్నాయి.
శ్రీ గురుభ్యోనమః 
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు)
అడ్మిన్
శ్రీకృష్ణ 
Post a Comment