Breaking News
Join This Site
ముంబై: రిలయన్స్ జియో ప్రపంచ రికార్డు సృష్టించింది.

ముంబై: రిలయన్స్ జియో ప్రపంచ రికార్డు సృష్టించింది.ముంబై: రిలయన్స్ జియో ప్రపంచ రికార్డు సృష్టించింది. జియో సేవలు ప్రారంభమైన ఒక్క నెలలోనే ఏకంగా 1.60కోట్ల వినియోగదారులను సొంతం చేసుకుంది. తద్వారా అత్యంత వేగవంతంగా ఎక్కువమంది వినియోగదారులను చేర్చుకున్న సంస్థగా అవతరించినట్టు రిలయన్స్ పేర్కొంది. సెప్టెంబరులో 4జీ మార్కెట్లోకి అడుగుపెట్టిన రిలయన్స్ జియో సంచలన ఆఫర్లతో ఇతర నెట్‌వర్క్ సంస్థల గుండెల్లో గుబులు పుట్టించిన సంగతి తెలిసిందే. కాగా సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, స్కైప్ వినియోగదారుల కన్నా కూడా ఈ సంఖ్య ఎక్కువని సంస్థ తెలిపింది. వినియోగదారుల నుంచి జియోకు లభించిన అపూర్వ ఆదరణతో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు రిలయన్స్ సంస్థల చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు.
Post a Comment