Breaking News
Join This Site
పుణ్య పాపాలు అనుభవించే కాలం ఎలా ఉంటుంది?

పుణ్య పాపాలు అనుభవించే కాలం ఎలా ఉంటుంది?

పట్టిందల్లా బంగారం. చేసిన ప్రతి పనిలో విజయం : దీనివలన్ కొందరిలో అహంకారం పెరుగుతుంది. తనలో ఉన్న నీచ్య గుణాలు బయటికి వస్తాయి. ప్రతి పనిలో విజయం సాధిస్తూ ఉంటే సామాన్య మానవులలో ఉండే లక్షణమే ఇది. అహంకారం పెరిగిపోవడం. ఎవరు ఎన్ని చెప్పినా తలకెక్కదు. ఎవరైనా ఏదైనా చెబితే నువ్వు నాకు చెప్పేదేంటి? అని ఎదుటివారిని చులకనగా చూస్తారు.

తిరుగులేని మాట : కొందరు మాటలు చెప్పి బ్రతికేస్తూ ఉంటారు. కొందరు మాటలతో బురిడీ కొట్టిస్తారు. కొందరి మాట పలకడమే ఆలస్యం నిజమైపోతూ ఉంటుంది. వీరందరూ కూడా గొప్పవాళ్ళే కాని వారిలో ఉన్న గొప్పతనం వారికి తెలీదు. తెలుసుకునే అవసరం కూడా లేదు. ఎందుకంటే అనుకున్నది చెప్పగలుగుతున్నారు. తన మాటతో ఇతరులని ఒప్పించగలుగుతున్నాడు. పదిమందిలో మాటకి విలువ ఉంది. ఈ కారణాల చేత తెలుసుకునే వీలున్నా తెలుసుకోరు. ఆదిశగా కూడా ఆలోచించరు.

ఆర్ధికంగా స్థిరంగా అంతకంతకూ ఎదుగుతూ ఉంటారు. దేనికీ లోటు ఉండదు. కొందరు పుట్టుకతో ధనవంతులుగా పుడితే! మరికొందరు రాత్రికి రాత్రే ఎదుగుతారు. పుణ్యకాలం ప్రారంభం అయ్యేనాటికి మరికొందరు పేదవారిగా పుట్టినా క్రమంగా ఎదుగుతూ ఉంటారు.

పుణ్యం అంటే దేనికీ లోటు లేకపోవడమే! దేనికీ అంటే! అన్నం, గృహం, వస్త్రం, భార్య బిడ్డలు, సిరి సంపదలు. వీటిలో దేనికీ లోటు లేకపోవడమే! అంతేతప్ప కోరి కష్టం తెచ్చుకుంటే ఎన్ని ఉన్నా ఏమి లేనట్లే ఉంటుంది. కోర్కెలకు అడ్డుకట్ట వేయకపోతే కష్టాల కడలిలో ఈడటమే తప్ప బయటకి వచ్చి పుణ్యాన్ని అనుభవించలేరు. పైగా పాపకర్మలు ఎక్కువ చేసి లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టు కుంటారు.

పాపం అనుభవించే సమయం ఎలా ఉంటుంది?
కోటీశ్వరుడు బికారిగా మారిపోతాడు. అప్పటి వరకు తనతో ఉన్న స్నేహితులు, బంధువులు భార్య బిడ్డలు సైతం విడిపోతారు. ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి. చేసే ప్రతి పనిలో అపజయమే. మోసపోవడం, ఒంటరితనం, పిచ్చి, మూగ, చెవుడు, అంగవైకల్యం, గ్రుడ్డితనం, ఎదో ఒక రోగం వెంటాడడం, తాగుడు, వాగుడు, లేనిపోని అలవాట్లు ఒకటి రెండు కాదు నానారకాల వ్యసనాలు, నిత్యం కలహాలు, మనశ్శాంతి కరువు. అన్నీ ఉన్నా ఏమి లేనట్లు ఎదో తెలియని వెలితి. ఎవరి పద్దతీ నచ్చదు. ఇలాంటి అన్నీ పాపాత్ములు మనిషి రూపంలో పుట్టినవారికి, పాపం అనుభవించే సమయంలో పడే బాధల పడేవారికి కలుగుతూ ఉంటాయి.

ఇంట్లో భర్త తాగితే భార్య పిల్లలు ఇబ్బంది పడుతున్నరుగా అంటారు. వాళ్ళు బాధలు పడాలి కనుకే వాడు తాగుతున్నాడు, తంతున్నాడు. నరకానికి దగ్గరగా తీసుకెళుతున్నాడు. అంతేతప్ప వీడు పాపాత్ముడు వీడి మూలంగా మేము బాధలు పడుతున్నాం కాదు.. పడాలి కనుక పాపాత్ముడి చేతిలో పడ్డారు.అది విధి వ్రాత.. ఎవడి వలనో మోసపోయాం, ఎవడో అన్యాయం చేశాడు ఇవన్నీ మనకి పైకి చెప్పుకునే కారణాలు మాత్రమే. నువ్వు పూర్వం చేసిన కర్మలకి ఇప్పుడు ఈ రూపంలో అనుభావిస్తున్నావు. "బుద్దే కర్మనుసారే" అంటే! నువ్వు పూర్వం చేసిన కర్మలని బట్టే నీ బుద్ధి నిన్ను ప్రేరేపిస్తుంది. నీ కర్మే నిన్ను నమ్మేలా చేస్తుంది. మోసపోయేలా చేస్తుంది. నీకర్మే నిన్ను ప్రోత్సహించేలా చేస్తుంది.

నువ్వు మునుపు చేసుకున్న కర్మలే నీ సుఖాలకి బాధలకి కారణం అవుతున్నాయి తప్ప నిన్ను ఎవడూ ఏమి చేయడంలేదు. చేయలేడు. 100 మంది త్రాగుబోతులు నీ చుట్టూ ఉన్నా నువ్వు త్రాగలేవు. ఎందఱో పుణ్యాత్ములు నీ చుట్టూ ఉన్నా నువ్వు దుర్వ్యసనాలకి బానిసై పోవలసిందే. ఇదే కర్మ.. నువ్వు ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితాలే వస్తాయి తప్ప గొప్పగొప్ప ఫలాలు ఏమి ఇవ్వవు.

పుణ్యం కలిసి వచ్చినప్పుడు ఏది చేసిన కలిసొస్తుందని చేస్తే పుణ్యం హరించి పోయాక అనుభవించే సమయంలో తెలుస్తుంది. చేసిన కర్మలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో! ATM లో డబ్బులు ఉన్నాయి కదా! అని డబ్బులు వేయకుండా డ్రా చేస్తూ వెళితే ATM ఎలా ఖాళి అవుతుందో పుణ్య కర్మలు ఆచరించకుండా కలిసొస్తుందని ఏదిపడితే అది చేస్తే అనుభవించే సమయానికి అన్ని అవిరైపోతాయి.

సుఖం అనుభవిస్తున్నా, కష్టం అనుభవిస్తున్నా పుణ్య కర్మలు చేయాల్సిందే. రేపటి రోజు సుఖంగా ఉండాలంటే ఈరోజు పొదుపు మంత్రం పాటించవలసిందే.. అలాగే కర్మలు నశించాలి అంటే పుణ్యకర్మలు చేస్తూ ఉండాల్సిందే.

అడ్మిన్

శ్రీకృష్ణ..
Post a Comment