Breaking News
Join This Site
యుగధర్మం మారవచ్చు కాని ధర్మ స్వరూపం మారదు.

యుగధర్మం మారవచ్చు కాని ధర్మ స్వరూపం మారదు.
తప్పు చేసినవాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే. ఇది ధర్మం.

సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాలలో ఆయా యుగధర్మాలు మారుతూ ఉంటాయి. ఇది కేవలం మానవులకి మాత్రమే!
యుగధర్మం ఎలా ఉన్నా ధర్మం నశిస్తున్న సమయంలో దైవం ఎప్పుడూ ఎదో ఒక రూపంలో వచ్చి ధర్మాన్ని కాపాడుతూనే ఉంటాడు. కొన్ని కొన్నిసార్లు ప్రభుత్వం ద్వారా, కొన్నిసార్లు సంతానం ద్వారా, కొన్ని సార్లు అపరిచితుల ద్వారా, స్నేహితులు, సన్నిహితులు, బంధువుల ద్వారా, ప్రకృతి ద్వారా, క్రూర మృగముల ద్వారా ధర్మం తప్పు చేసినవాడికి శిక్ష విదిస్తూనే ఉంటుంది.
కాకపోతే మూర్ఖులు కొందరు తెలుసుకోలేరు. తెలిసినా వినని మూర్ఖులు కొందరు. అసలు ధర్మస్వరూపం ఎరుగలేని మూర్ఖులు మరికొందరు. ప్రతిదీ కంటికి కనిపిస్తేనే నమ్ముతాము అనే మూర్ఖులు కొందరు. 

ధర్మస్వరూపం ఇలా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పలేము కాని సామాన్య ధర్మాలు కూడా ఆచరించక శిక్షలు పొందేవారు ఎక్కువగా ఉన్నారు.

తల్లిదండ్రులని చూడని వారు, తమ సంతానం మాత్రం తమని పువ్వుల్లో పెట్టుకొని చూస్తుంది అనుకుంటారు. ఇది అసలు ధర్మమేనా? 

పిల్లలు మా మాట వినడంలేదు అనేది ఈ వర్గం వారె. అంతే కాదు ఏళ్ళు వచ్చినా జ్ఞానశూన్యులు అయినవారికి కూడా ఇదే గతి.
దొంగతనాలు దోపిడీలు, అక్రమాలు చేసినవారికి ప్రభుత్వం శిక్షలు వేస్తూనే ఉంది అది ధర్మం కనుక.
తప్పు చేసిన సంతానాన్ని తల్లిదండ్రులు శిక్షిస్తూనే ఉన్నారు. పిల్లలు తప్పుదారి పడతారేమో అని. తప్పుదారి పట్టడం అధర్మం కనుక.

వేల కోట్లు దొంగలించి దర్జాగా తిరిగేవారు చివరికి ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలకుండా పోతున్నారు. రాజే తప్పు చేస్తే శిక్షించే అధికారం ప్రజలకి సాధ్యం కావడంలేదు కనుక ప్రకృతి భాద్యత తీసుకుంటుంది . ధర్మం కనుక. అక్రమంగా కూడబెట్టిన ఆస్తి ప్రభుత్వం ద్వారాగాని, దొంగల ద్వారాగాని నాశనం చెందుతుంది. అక్రమ సంపాదనతో సంతానాన్ని ఇష్టం వచ్చినట్లు పెంచడం వలన ఆ సంతానం చిన్నవయస్సులోనే ప్రమాదంలో కన్నుమూస్తుంది. దురాశతో తానూ తినక ఇతరులకు పెట్టకపోవడం వలన రోగాల పాలు, దొంగలపాలు. రాక్షసులు పెరిగినప్పుడు దైవం ఎప్పుడూ సంహరిస్తూనే ఉంది. ధర్మస్థాపన జరగాలి కనుక.

ధర్మస్వరూపం ఏ యుగమైన ఒకేలా ఉంటుంది.
కృతయుగంలో తల్లిదండ్రులను పూజించాలి, త్రేతాయుగంలో తల్లిదండ్రులని పూజించాలి, ద్వాపర కలియుగాలలో కూడా తల్లిదండ్రులకు మించిన దైవంలేదు.

ఏ యుగమైన భార్య భర్తను అనుసరించాల్సిందే, పిల్లలు తప్పుత్రోవ పట్టకుండా యుగమేదైనా తల్లిదండ్రులు శిక్షించాలి.
యుగమేదైనా సకల జీవరాశులు శ్వాస తీసుకోవడం, తినడం, త్రాగడం, నిద్రించడం, సంభోగం, స్నానం, అన్నీ చేయాల్సిందే, వీటిలో ఏది మారదు. ఇలా మారనివి ఎన్నో ఉన్నాయి. అదే ధర్మ స్వరూపం. ఇవి ఎప్పుడూ మారవు.. కాని మానవుడు మాత్రం క్రోధ, లోభ, మోహ, మద, మాట్సర్యాలతో అంతకంతకీ పతనం అవ్వడమే కాకుండా ఇతరుల బ్రతుకులు కూడా పతనావస్థలో పడేస్తున్నారు.

దోచుకోవడం దాచుకోవడం., తినడం, తిరగడం, ఇది కాదు ధర్మం..
తల్లిదండ్రులని, భార్యని, పిల్లలని, బంధు జనాలని, దేవతల్ని, పితృ దేవతలని, పశు పక్ష్యాదులను, ఆదరించాలి. చేతనైన సాయం చేయాలి. సక్రమంగా సంపాదించి దానిని కూడా సక్రమంగా ఖర్చు చేయాలి. కన్నుమిన్ను కానక ఖర్చులు చేస్తే రేపటిరోజు కష్టాల పాలౌతారు.

ఇవన్నీ మన ఎరుకలోకి రావాలంటే! ఆ భగవతీ నామం జపించాలి.. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం ఆ అమ్మవారి మాయకు లోనై అవతారాలు దాల్చుతున్నవారే! ఇక సామాన్యులమైన మనసంగతి చెప్పేదేముంది?
ఆ పరాశక్తి పరాకృతి, పరమాత్మ, నిత్య కళ్యాణి, నిత్యమంగళ, సర్వ శుభంకరి, శంకరి అయిన ఆ మహాదేవిని నమ్మినవాడు కొలిచినవాడు మాయకు అతీతుడై జన్మరాహిత్యం పొందుతాడు..

కనుక యుగధర్మం వంకతో డొంకల్లో తిరిగి వంకర పనులు చేస్తే ధర్మం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది..
Post a Comment