Breaking News
Join This Site
వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలు

వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలు






ఏసీ ఉందికదా అని అదేపని వాడకండి. ఎక్కువగా ఏసీ వాడడం వలన బయటికి వచ్చినప్పుడు డీహైడ్రేషన్ కి గురయ్యే ప్రమాదం ఉంది. వంటికి చెమట ఎంత పడితే అంత ఆరోగ్యంగా ఉంటారు.



వేసవి కాలంలో రాగి బిందేలలోని, చెంబులలోని నీరు త్రాగాకండి. అలా త్రాగడం వలన వేడి చేస్తుంది. చల్లగా ఉన్నాయి కదా ఫ్రిజ్ లో నీరు అసలే త్రాగొద్దు. ఇవి వేడి చేస్తాయి. కుండలో నీరు మాత్రమే త్రాగండి. చలువ చేస్తుంది.

 

సృష్టిలో జీవులని కాపాడాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పక్షులకోసం మట్టి బౌల్స్ లో నీరు పెట్టండి. ఆవుల కోసం, కుక్కల కోసం ఇంటిబయట చిన్న తొట్టెలు ఏర్పాటు చేయండి.


వేసవిలో ఎక్కువగా కాటన్ దుస్తుల్ని మాత్రమే వాడండి. సిల్క్ వంటి దుస్తులు చిరాకును, వంటిపై మంటను కలిగిస్తాయి. బిగుతుగా ఉండే దుస్తులు వాడకండి. గాలి ఆడక ఇన్ఫెక్షన్ వస్తుంది.

చిన్నపిల్లల్ని ఉదయం ఎండల్లో తిరగనివ్వకండి. సాయంత్రం పూట కనీసం ఒక గంటపాటు బయట తిరగనివ్వండి. ఆడుకోనివ్వండి.ఆడవాళ్లు గొడుగులు వాడండి. అసలు గొడుగు సృష్టించింది ఎండ నుండి కాపాడుకోవడానికి మాత్రమే! మనం వర్షానికి వాడుతున్నాం.
ఎండల్లో తిరిగేటప్పుడు సన్ స్కీన్ లోషన్ వాడండి. దీనివలన అతి నీల లోహిత కిరణాల నుండి శరీరాన్ని కాపాడుతుంది.

మజ్జిగా, కొబ్బరిబోండాలు, సబ్జా గింజలు నానబెట్టి ఆనీరు త్రాగండి. చాలా చలువ చేస్తాయి. ఎక్కడ తిరిగి వచ్చినా వీటిని మాత్రం తప్పకుండా త్రాగండి. ఈ నీటిలో కొద్దిగ పళ్ళు నిమ్మకాయ రసం కలిపి త్రాగితే ఇంకా మంచిది. డీహైడ్రేషన్ క్షణాలలో తగ్గిపోతుంది. ఎక్కువగా వేడి చేసే మాంసాహారం తినకండి.