Breaking News
Join This Site
బంధాలను తేలికగా తెంచుకోవడానికి ఇవే ముఖ్య కారణాలు..

బంధాలను తేలికగా తెంచుకోవడానికి ఇవే ముఖ్య కారణాలు..


1. పిల్లల మీద తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం.
2. సోషల్ మీడియాలో అమ్మాయి పేరు కనబడితే చాలు స్నేహ అభ్యర్థనలు పంపి విలువలు తెలియని వారిని గొప్పగా ఊహించుకొని వారికోసం ఆరాటపడి చివరికి అందరిని చెడ్డవారేమో అనే భ్రమలో పడిపోవడం.
3. ఇంట్లో తాతలు బామ్మలు లేక మంచి చెడు చెప్పేవారు లేకపోవడం..
4. ప్రేమ విషయంలో ప్రేమికులు చేతిలో ఉన్నపని, చేయాల్సిన పని, చదువు, సంధ్య వదిలేసి అదేపనిగా మాట్లాడుకోవడం వలన పెళ్లి సమయానికి అభిప్రాయ బేధాలు వచ్చి విడిపోతున్నారు.
5. కొందరు పెళ్లి కుదిరిన వెంటనే అదేపనిగా మొబైల్ చాటింగ్స్ లో గంటలు తరబడి మాట్లాడుకొని పోట్లాడుకొని పెళ్లయ్యాక ఊసులు ఏమి లేకపోవడంతో గొడవలకి దారితీసి విడిపోతున్నారు.
6. పెళ్లి అయిన వెంటనే విడికాపురం పెట్టి ఒకరి ముఖంలో మరొకరు ముఖం పెట్టడం, 24గంటలు మాట్లాడేసుకోవడం వలన తొందర్లోనే ఆ బంధం విచ్చిన్నమ్ అయిపోతుంది.
7. ఈ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎవరు ఎవరితో ఎందుకు మాట్లాడుతున్నారో ఏమి మాట్లాడుతున్నారో తెలీక ఎదో ఒకటి మాట్లాడేసి శత్రుత్వమ్ పెంచుకొని శత్రువులుగా మారిపోయి ఆ అలవాటులో అందరిని మంచివారు కాదేమో అనే ఫీలింగ్ లో మంచివారు ఎవరో, చెడ్డవారు ఎవరో తెలుసుకోలేక అపార్థాలు చేసుకుంటూ మంచివారిని పోగొట్టుకుంటున్నారు.
8. వాటికి తోడు అర్థంపర్థం లేని చదువులు.
9. అర్హత గాని, జ్ఞానం గాని, విలువలు కాని లేని ఉపాధ్యాయులు.
10. ఏమీ తెలియని తల్లిదండ్రులు కొందఱు,
11. విచ్చలవిడి శృంగారం ఉన్న అనేక అంతర్జాల పుటలు అందుబాటులో ఉండడం,


12. పిల్లలని చూసుకోవడానికి కూడా సమయం లేని తల్లిదండ్రులు కొందఱు.
13. బిడ్డల్ని పెంచి గాలికి వదిలేసిన తల్లిదండ్రులు మరికొందరు.
14. పెద్దల సరైన పర్యవేక్షణ లేక నియంత్రణ లేని జీవితం సాగించడం,
15. చిన్ననాటి నుండి గారాభంగా పెంచి అడిగినదల్లా తెచ్చి ఇచ్చి సోమరిపోతుల్లా పెంచి అహకారం పెరిగే వాతావరణం కల్పించడం,
16. ప్రేమించింది మొదలు అతి ప్రేమ చూపడం.
17. అతిప్రేమతో గారాబంగా పెంచడం. అతి ప్రేమ, అతి గారాబం ఇప్పుడు మీకు బావుంటుందేమో కానీ రేపటి రోజు ఇలా పెంచిన మీఇంటి అడపిల్లని చేసుకున్నవాడి ఇంటిల్లిపాదికి భారం అవుతుంది.
18. బంధాలని లెక్కచేయని, విలువలు తెలియని వారితో స్నేహం చేయడం కూడా ప్రమాదమే! (పొతే పోనివ్, అది/ఆడు కాకాపొతే మరొకరు అనుకునే రకం వాళ్లతో స్నేహం మంచిది కాదు. మీరు బంధాలని ఎంత ప్రేమించినా వీరి స్నేహం వలన నాస్తికవాదం మీలోకూడా నాటుకొని లెక్కలేని తనం అలవడుతుంది. ఫలితం బంధాలని కోల్పోవలసి వస్తుంది.)
19. అర్హత లేనివారు, నాస్తికులు, లోకం పోకడ తెలియనివారు ఉపాధ్యాయులుగా, గురువులుగా ఉండడం. వీరి మాటలు విన్న పిల్లలు విలువలు తెలుసుకోలేరు. ఉన్న విలువలు పోగొట్టుకుంటారు. పోగొడతారు.
20. తీరిక లేని ఉద్యోగాలు.
21. డబ్బే మనిషిని నడిపిస్తుందని నమ్మడం.

22. మనిషిని మనిషిగా చూడలేని కులాలు, అతిగా చదివి తెచ్చుకున్న తెలివితేటలు.
23. ప్రేమించేవారు కూడా అతి ప్రేమ చూపడం. మీ అతిప్రేమ మీ మెడకె ఉరితాడై తగులుకుని జీవితాలని సర్వనాశనం చేస్తుంది.
24. ఉన్నది లేనిది ఉన్నదని చెప్పుకొని లేని ఆడంబరం చూపించి నమ్మించడం.
25. ఒక వ్యక్తి మీద ఏవేవో ఊహించుకొని అవి వారి దగ్గర దొరకక విడిపోయేవారు కొందరు. ఊహలకి తెరదించింది. ఎంత గొప్ప వ్యక్తయినా ఒక తల్లికి కొడుకే! ఒక ప్రేయసికి ప్రియుడే! ఒక భార్యకి భర్తే! అతని బంధాలు అతనికి ఉంటాయి. అందరి దగ్గరా కాకపోయినా కొందరు అంతరంగికుల దగ్గర చనువు చూపిస్తారు. అతని భావాలు కూడా పంచుకోవడానికి కొందరు ఉండాలి కదా! చనువు ప్రదర్శించాడు అంటే మీకు దగ్గర అయ్యాడని అర్థం. అంతేకాని తక్కువ అయ్యాడని కాదు.

26. మరో పెద్ద కారణం సోషల్ మీడియా. ఒక బంధం నిలుపుకోవాలంటే దానికి సంబంధించినవారు జరిగిన తప్పుల్ని పరిశీలించాలి. కానీ ఈ షోషల్ మీడియా వచ్చాక ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు గుడ్ మార్నింగ్ తో మొదలై గుడ్ నైట్ వరకు ఎవరో ఒకరు మాట్లాడిస్తూనే ఉంటున్నారు. ఓ ప్రక్కన పనులు పోతున్నాయి. మరో ప్రక్కన బంధాలు సన్నగిల్లుతున్నాయి. అయినా సరే చాటింగ్ చాటింగ్ చాటింగ్.. కొంచం చనువుగా మాట్లాడితే ప్రేమ దోమ చివరికి అదో పెద్దకర్మ.. బంధాలు లేవు బాధలు లేవు. బాధపడే లోపు మరొకరు రెడీ.. ముఖ్యముగా చాలామంది అమ్మాయిల విషయంలో ఇలానే ఉంది.

27. ప్రేమ అనేది మనిషి ఎదుగుదలకి, మానసిక పరివర్తనకు ఉపయోగపడాలే తప్ప మరొకరికి ప్రాణ సంకటం కాకూడదు. ప్రేమ చూపించండి. స్వర్గం దించి కాళ్ళ ముందు పడేయండి. అడిగింది చేసిపెట్టండి తప్పేమి కాదు. కానీ తప్పుడు ఆలోచనలు చేసినప్పుడు, తప్పు పనులు చేస్తున్నప్పుడు నిరోధించండి. పోనీలే అని ఒకసారి వదిలేస్తే పదేపదే చేసే అవకాశమే ఎక్కువ. ప్రేమించడం ఎంత ముఖ్యమో తప్పుని తప్పు అని చెప్పడం అంతకంటే ముఖ్యం. దానిని అపార్థం చేసుకొని నన్ను పొద్దాక తిడుతున్నారు, నేనంటే ప్రేమలేదు. ఇలా నెగిటివ్ ఆలోచనలు చేస్తే అది వాళ్ళ పొరబాటు. అపార్థం చేసుకున్నా సరే! తప్పుని తప్పు అని చెప్పాల్సిందే. ప్రేమ ఎంత వరకు ఉండాలి? తప్పు చేసినా క్షమించేలా ఉండకూడదు ప్రేమంటే! అవసరమైతే తెలియజెప్పాలి. దీనిని తప్పుగా భవిస్తారేమో  అని, విడిపోతుందేమో అని భయపడుతూ ప్రేమ కొనసాగిస్తే పెళ్లయ్యాక సుఖం మాట దేవుడెరుగు క్షణక్షణం నరకమ్లో ఉండాల్సిందే.


ఇవి ప్రస్తుత మానవ సంబంధాలను బంధాలను ప్రభావితం చేస్తున్న కొన్ని అంశాలు. కొన్ని మాత్రమే! ఇంకా ఎన్నో ఉన్నాయి.ఆస్తి, అందం, పెళ్లయ్యాక అందం తిరిగిందని ఒకడు, మనసులు కలవలేదని కొందఱు, మాటలు కలవలేదని కొందఱు, ఒకడు సుఖంగా ఉంటె ఓర్చుకోలేక విడగొట్టడానికి చూసేవారు, ఇలా ఎన్నో చిన్నచిన్న కారణాలకే విడిపోతున్నారు. బాధపడుతూ అయినా విడిపోవడానికి సిద్ధపడుతున్నారు తప్ప ఒక్కమాట మాట్లాడి బంధాన్ని దృఢ పరుచుకుందాం అని అలోచించకపోవడం బాధాకరం. ఇది భావితరాల మీద ప్రభావం చూపిస్తుంది అనేది పచ్చినిజం.


Post a Comment