Breaking News
Join This Site
కాబోయే భర్తలకూ.. భార్యా బాధితులకు.. ఓర్పూ నేర్పూ శిక్షణ.."__ చిట్కాలు ఉచితం. (హాస్యపు కథ)

కాబోయే భర్తలకూ.. భార్యా బాధితులకు.. ఓర్పూ నేర్పూ శిక్షణ.."__ చిట్కాలు ఉచితం. (హాస్యపు కథ)
సుబ్బారావు కాంతం భార్యాభర్తలు. వారికి పెళ్ళై నాలుగు సంవత్సరాలు కావస్తుంది. ఇద్దరు పిల్లలు. రోజూ ఉదయం లేవగానే ఇల్లూ గట్రా ఊడ్చేసి కాఫీలు టిఫిన్లు రెడీ చేసెయ్యడం సుబ్బారావు దినచర్య.  తరువాత భార్యాభర్తలిరువురూ అన్యోన్యంగా కలిసి కూర్చొని టిఫిన్లు లాగిస్తారు. ఒకరోజు ఫూటుగా టిఫిన్ తిని మేడ మెట్లెక్కుతున్న కాంతం కాలుజారి కిందపడింది. బెడ్డురెస్ట్ అన్నాడు డాక్టర్.. ఇంకేముంది.. సాగితే రోగమంత భోగం లేదన్నట్టు... కాంతానికి సుఖం దరిద్రం పట్టినట్టు పట్టేసింది. పాపం సుబ్బారావు రోజూ చేసే పనికి తోడు పిల్లల పనులూ బట్టలుతకడాలూ అదనంగా చేయవలసి వస్తుంది. పనులన్నీ చేసి ఆఫీసుకి లేటుగా వెళ్తే ఆఫీసరు ఛీవాట్లూ... అవి దులిపేసుకుని పని మొదలు పెడితే కునికిపాట్లూ..! 

ఏదో ఒక పరిష్కారం కోసం ఆలోచించగా సుబ్బారావుకి ఒక ఆలోచన తట్టింది. వంటలూ వగైరా అంటే అలవాటైపోయిన పనే కాబట్టి పెద్ద కష్టమేమీ కాదు. బట్టలుతకడానికి పనిమనిషిని పెట్టుకుందాం అనుకున్నాడు సుబ్బారావు. అనుకున్నదే తడవుగా పనిమనిషి వేటలో మునిగిపోయాడు. ఎట్టకేలకు కష్టపడి శ్రమపడి ఒక పనమ్మాయిని కుదుర్చుకున్నాడు సవాలక్ష ఆంక్షలతో... !! ఉదయం రాగానే కాఫీ.. టిఫిను.. తిరుగు టపాలో టీ.. రెండు నెలల అడ్వాన్సూ.. ఇవీ షరతులు. అన్నిటికీ తలొగ్గేసి పనికి పెట్టేసుకున్నాడు. పాపం సుబ్బారావుకి.. పెళ్ళాం పిల్లలకి వండి పెట్టేది కాక పనమ్మాయికి కూడా టిఫిన్లు టీ అందించడం ప్రాణం మీదకి వస్తుంది. కాలువిరిగిన కాంతం సోఫా కూర్చుని టీవీ చూస్తూ తినడానికి స్నాక్స్ రెడీ చెయడం మరొక అదనపు పని. రోగభోగాన్ని ఎంజాయ్ చేస్తున్న కాంతానికివేమి పట్టడం లేదు . పాపం కాంతారావు అటు ఆఫీసులోనూ.. ఇటు ఇంట్లోనూ సమయాన్ని మరియు శక్తినీ సమన్వయం చేస్కోలేక చిక్కి శల్యమయ్యాడు. విసిగి వేసారిన సుబ్బారావు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. 

ఆ మర్నాడు కాంతంని ట్రీట్ చేస్తున్న డాక్టరు గారు ఒక భయంకరమైన నిజాన్ని కాంతానికీ.. సుబ్బారావుకీ తెలియజేసారు. అదేమంటే కాంతం ఇక చక్రాల కుర్చీకే పరిమితమని.. జీవితంలో నడవలేదనీ.. కాలు క్రింద పెడితే ప్రాణానికే ప్రమాదమని.. ! భార్యా భర్తలిద్దరూ భయభ్రాంతులకు గురయ్యారు. కాంతాన్ని తొలిచేస్తున్నదొకటే ప్రశ్న. లేని నొప్పిని నేను నటిస్తుంటే.. డాక్టరేంటి ఇలా చెప్తాడూ అని. కాంతం భయంతో పైకి లేచి చకచకా నడవడం మొదలు పెట్టింది. డాక్టరూ సుబ్బారావు ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు.  
   ఉద్యోగం మానేసి ట్రైనింగ్ సెంటర్ పెట్టుకున్నాడు. అత్తెసరు జీతంతో బ్రతికే వాడు లక్షాధికారి అయ్యాడు. అతని ట్రైనింగ్ సెంటర్ పేరు.. " కాబోయే భర్తలకూ.. భార్యా బాధితులకు.. ఓర్పూ నేర్పూ శిక్షణ.."__ చిట్కాలు ఉచితం.

Post a Comment