నీ పై పిచ్చికాక మరేవిటి!
కన్నీళ్లే జ్ఞాపకాలు
విడిచి వెళ్ళావ్ కదా
నీ జ్ఞాపకమంత నా దుఃఖం మారి
తరగకుండా మరువకుండా
చెట్టు ఆకుల్లో పూల కలల్లా
మాటల్లో పరిమళాల బాటల్లో
గుర్తొస్తూ మదిన గుచ్చేస్తూ..
అపుడెపుడో...
బుగ్గల పై తారాడే కలల నీడలతో ...
నేను
నీ మాటలకి పాటలకి పదాలేరుకుoటూ
తలపుల్లో మునుగుతూ...
తలుపులు తడుతూ
పిలిచే నీవు
తలచి తలచి అలిసిపోయిన
ఆ మధుర క్షణాలు
గాలిలో గంధమై తాకే నీ గురుతులు
కార్తీక మాసపు తులసికోటoత
స్వచ్ఛంగా.. కదిలిస్తూ..
ఇపుడేందుకో ఇలా గుర్తొస్తూ..
గుండె సంద్రమౌతూ
సన్నజాజి కొమ్మ చాటుగా
కిటికీ తలుపుల నుండి
చిరుగాలి వ్రాసిన
రాగ రాగిణీవెన్నెల్లో
మెరిసే నీ కన్నులు
నీకు పోటీగా జాబిలిని
చూస్తూ నేను
పిలుపుల తాకిడికి
ఉక్కిరి బిక్కిరి అవుతూ
పరుగెత్తుతూ వచ్చే నేను...
సంధ్య...