Breaking News
Join This Site
క్రుతఘ్నుడి మాంసం కుక్కలు కూడా ముట్టవవు. నడిజంగుడి కథ..

క్రుతఘ్నుడి మాంసం కుక్కలు కూడా ముట్టవవు. నడిజంగుడి కథ..     పడవ మీద ఒడ్డు దాటించినందుకు గుహుడుని గుర్తుపెట్టుకున్నాడు శ్రీరాముడు. నాలుగు రేగిఫలములు పెట్టినందుకు శబరిని గుర్తుపెట్టుకుని చరిత్రలో నిలిపాడు రాముడు.  అందుకే అయ్యాడు దేవుడు.  చేసిన చిన్న మేలు కూడా మరచిపోని వాడు నిజంగా దేవుడే. ఎంత పెద్ద ప్రయోజనం పొందినా గుర్తుపెట్టుకోకుండా దేప్పేవాడు నీచ్యుడు! అధముడు! దీనంత పాపం ఇంకొకటిలేదు. దీనికంటే పెద్దపాపం నమ్మకద్రోహం. వీరిద్దరికీ యమలోకంలోనే కాకుండా జీవితంలో కూడా చాల భాధలు పడతారు. భార్య రూపంలో, పిల్లల రూపంలో ఇంకా ఏ రూపంలో అయినా కావచ్చు. అని ధర్మశాస్త్రం చెబుతుంది. 


      పూర్వం గౌతముడు అనే బ్రాహాణోత్తముడు తన వృత్తిని వదిలి ఒక బోయ స్త్రీని వివాహం చేసుకొని విచ్చలవిడిగా ప్రవర్తించాడు. సంపద మీద ఆశతో దొంగతనాలు కూడా మొదలు పెట్టాడు. ఎంతో దోచుకున్నాడు. అయినా ఇంకా ఏదో సంపాదించాలి అనే ఆశతో కొందరు వ్యాపారాలు తమ వ్యాపారం కోసం దేశాలు తిరుగుతుంటే ఈ బ్రాహ్మణుడు కూడా వాళ్ళతోపాటు బయలుదేరాడు. అలా కొంత దూరం వెళ్ళిన తరువాతఒక మదించిన ఏనుగు వీళ్ళ మీదకి ఉరికి కొందరిని తొక్కేసింది. అది చూసి ఎవరికి తోచిన దారిలో వారు పారిపోయారు. ఈ బ్రాహ్మణుడు కూడా అలా కొంత దూరం పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి అటు ఇటు చూస్తుంటే పెద్ద వృక్షం ఒకటి కనిపించింది. వెళ్లి దానికింద విశ్రాంతి తీసుకున్నాడు. ఆచెట్టు మీద నాడిజంగుడు అనే కొంగ నివాసం ఉంటుంది. ఆ కొంగ ఇతనిని చూసి మిత్రమా ఎవరు నువ్వు? ఎక్కడికి నీ ప్రయాణం? ఎందుకోసం? దానికి సమాధానంగా తన సంగతి అంతా వివరించి చెప్పాడు. నేను ఒక బ్రాహ్మణుడిని, నాకులవృత్తి వదిలి సంపద మీద వ్యామోహంతో చేయరాని పనులన్నీ చేశాను. వ్యాపారం చేయాలని ఆశతో వ్యాపారులతో కలిసి వెళ్తుండగా ఏనుగు కొందరిని తొక్కేసి చంపేసింది. నేను భయపడి ఇలా పారిపోయి వచ్చాను. అని తన ఆవేదనని విన్నవించుకొన్నాడు. అది విన్న నాడిజంగుడు మిత్రమా బంగారం, వెండి, స్నేహితుడు, ధర్మం ఈనాలుగు మానవుడి అభివృద్దికి తోడ్పతాయని ధర్మ శాస్త్రం, ధర్మవేత్తలు ఏకగ్రీవంగా ఒక్కానిస్తున్నారు. ఈ నాలుగింటిలో స్నేహితుడు అత్యుత్తమమైన వాడని ప్రతీతి. నువ్వు నా గృహానికి వచ్చావు కాబట్టి నాతో ఏడు మాటలు మాట్లాడవు కనుక నువ్వు నామిత్రుడివి సందేహంలేదు. కాబట్టి నేను ఇచ్చిన ఆతిద్యం స్వీకరించి ఈ రాత్రికి విశ్రాంతి తీసుకో. ఉదయం కర్తవ్యం ఆలోచిద్దాం. అని తనగూటికి తను వెళ్ళిపోయింది! బ్రాహ్మణుడు ఆతిద్యమిచ్చిన తీయతీయని ఫలములు, కందమూలాలు, తేట నీరు, స్వీకరించి నిద్రపోయాడు.

తెల్లారిన తరువాత నడిజంగుడు వచ్చి బ్రాహ్మణుడితో ఇక్కడికి దగ్గరలో న మిత్రుడు విరూపాక్షుడు అనే రాక్షస రాజు ఉన్నాడు. అతను ఎంతో ఉత్తముడు, నియమ నిష్టలతో యజ్ఞ యగాదులతో, దానధర్మలలో ఆయనకి ఆయనే సాటి!! ప్రతి కార్తిక పౌర్ణమి నాడు వచ్చిన బ్రాహ్మణులందరికీ బంగారపు కంచాల్లో భోజనాలు పెడతాడు. మళ్లి అతిధి సత్కారాలు ఆచరిస్తాడు. నాకు మంచి మిత్రుడు. నేను పంపానని చెప్పు. నిన్ను గౌరవించి సత్కరించి పంపుతాడు. వాటితో నువ్వు హాయిగా బ్రతకొచ్చు. ఇదిగో ఈ దారిలో వెళ్ళు అని దారి కూడా చూపించింది! ఆ మర్గంగుండా చాల దూరం వెళ్ళాక నాడిజంగుడు చెప్పిన విరుపాక్షుడు రాజ్యం వచ్చింది. ఆ రాజ్యంలోకి ప్రవేసిస్తుండగానే విరుపాక్షుడు ఇతడి రూపం చూసి ఇతడిని చుస్తే ఏదో కొంత కుటిల స్వభావం కలిగినవాడు అని సందేహం కలుగుతుంది! విషయం ఏంటో తెలుసుకుని రమ్మని భటుడిని పంపించాడు. భటుడికి నాడిజంగుడు పంపిన విషయం చెప్పగానే ఈ వార్త విరుపక్షుడికి చెప్తాడు. విరూపాక్షుడునాడిజంగుడు పంపించడా? అయితే ఎంతటి పనికిమాలినవాడు అయిన పర్వాలేదు ప్రవేశపెట్టు అన్నాడు. బ్రాహ్మణుడు రాగానే ఎవరు నువ్వు ఏమిటి నీ చరిత్ర. దానికి ఆ బ్రాహ్మణుడు నాపేరు గౌతముడు! పరమ పవిత్రమైన గౌతమ మహర్షి వంశంలో పుట్టిన నీచుడిని. నాకు లేని వ్యసనం లేదు తాగుడు, స్త్రీ వ్యామోహం, పొగ పీల్చడం, ఇలా అన్ని వ్యసనాలు ఉన్నాయి అని జరిగింది చెప్పి వచ్చిన విషయం కూడా చెప్పాడు. విరుపాక్షుడు కనుబొమ్మలు విరిచి సరే నువ్వు ఎవరివైన కావచ్చు నాడిజంగుడు పంపించావ్ కనుక నిన్ను సత్కరించాలి. అని వచ్చిన బ్రాహ్మణులతో పాటు ఇతనికి కూడా భోజనం పెట్టి పెట్టిన పళ్ళెంతో సహా మోయలేనంత వెండి, బంగారం, ధనం ఇచ్చాడు. దానికి గౌతముడు ఎంతో సంతోషించి ఆ మూటలన్నీ మోపు మీద పెట్టుకొని మోయలేక మోయలేక నాడిజంగుడు ఉన్న వృక్షం దగ్గరికి చేరుకున్నాడు. నాడిజంగుడు అలసిన మిత్రుడిని చూసి తన రెక్కలతో సేదతీర్చి అతిధి సత్కారం చేసి తన గూటికి వెళ్లి నిద్రించింది.
గౌతముడు మాత్రం నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉండగా ఒక దిక్కుమాలిన ఆలోచన వచ్చింది. రేపు ఉదయం బయలుదేరాలి! మద్యలో ఆహారం లేదు. ఈ కొంగతో నాపని అయిపొయింది. కాబట్టి దీన్ని చంపి ఆ మాంసంతో నా ఆకలి తీర్చుకుంటే బాగుంటుంది. దీనికి తోడు ఇది బాగా కొవ్వేక్కిన కొంగ మంసంకుడా బాగా ఉంటుంది అని దొడ్డుకర్ర ఒకటి తీసుకొని చప్పుడు కాకుండా అది నిద్రిస్తున్న గూటిదగ్గరికి వెళ్లి దాని మెడ మీద టపి టపి మని చచ్చేవరకు కొట్టి దాని రెక్కలు ఊర్చి ఎముకలు పోగుపెట్టి మాంసం మూట కట్టి , హాయిగా నిద్రపోయి తెల్లారిన తరువాత బయలుదేరాడు.ఈ సంఘటన జరిగిన రాత్రి విరూపక్షుడికి కలలో నాడిజంగుడి ఈకలు,  ఎముకల పోగు కనిపించేసరికి భయపడి ఆ దుర్మార్గుడు గౌతముడు న్న స్నేహితుడిని ఎం చేశాడో అనుకుంటూ నిద్రపోయాడు. తెల్లారేసరికి నాదిజంగుడు రాకపోయేసరికి అనుమానం వచ్చి (ప్రతిరోజూ సూర్యోదయం అయ్యేసరికి నాడిజంగుడు విరుపాక్షుడి దగ్గరకి వచ్చి ధర్మ సూక్ష్మాలు గురించి చర్చించేవాడు) కొందరి బటులని ఆ వృక్షం దగ్గరకి పంపి ఎం జరిగిందో చూసి రమ్మన్నాడు.

     సరేనని రాజుగారికి దగ్గర నుండి బయలుదేరి నాడిజంఘుడు ఉండవలసిన చెట్టు వద్దకి వెళ్లి చూడగా అక్కడ ఈకలు ఎముకలు పోగు పడి ఉండడం చూసి ఆవిషయాన్ని భటులు మహారాజు వెళ్లి వివరించి చెప్పేసరికి విరూపాక్షుడు ఒరేయ్! వాడు ఎంతో దూరం వెళ్లి ఉండడు. వెంటనే వెళ్లి వాడిని పట్టుకొని పెడరెక్కలు విరిచి కట్టి తీసుకురండి అన్నాడు. భటులు వెంటనే మహావేగంతో వెళ్లి గౌతముడిని వెతికి పట్టుకొని తీసుకొస్తుంటే విరూపాక్షుడు వారిని చూసి అంత దూరంలోనే వాడిని ఇక్కడికి తీసుకురాకండి. వాడిని చూస్తేనే పంచమహ పాతకాలు చుట్టుకుంటాయి. అక్కడే వాడిని చంపి ముక్కలు చేసి మీరు తినేయండి అన్నాడు.

     ఆ మాట విని రాజ! మేము ఎంత రాక్షసులం అయిన ఈ కృతఘ్నుడి మాంసం తింటే వీడి లక్షణాలు మాకు వస్తాయి. మేము తినం అన్నారు. సరే ఐతే ఆ ముక్కలు కుక్కలకి వేయండి అన్నాడు. అలాగేనని వాడిని చంపి ముక్కలు చేసి కుక్కలకి వేశారు. ఆ మాంసం అక్కడే తిరిగితున్న రెండురోజుల నుండి తిండిలేక అలమటిస్తూ ఉన్న కుక్కలు కూడా వాడి మాంసం కనీసం వాసన కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్లి పోయాయి! విరూపాక్షుడుమిత్రుడిని తలచుకొని బాధ పడుతుంటే ఇంతలో అక్కడికి ఇంద్రుడు వచ్చాడు! విరూపాక్ష ఎం జరిగింది ? ఎందుకు అల బాధపడుతున్నావ్? విరూపాక్షుడున మిత్రుడు నాదిజంగుడు మరణం నన్ను తీవ్రంగా వేదిస్తుంది. న మిత్రుడుని ఎలాగైనా బ్రతికించు అన్నాడు. విరూపాక్ష  నువ్వేమి భాదపడకు దీని వెనుక ఒక కారణం ఉన్నది. నీ మిత్రుడు బ్రహ్మకి కూడా మిత్రుడు. ఇతడు పరమ పూజ్యుడైన ఋషి! అనేక శాస్త్రాలు తెలుసుకున్న జ్ఞాని. ఒకప్పుడు బ్రహ్మలోకంలో కొద్దిగా అహంకారించాడు. దానివల్ల భూలోకంలో కొంగై పుట్టాడు. పుట్టినా ఆ మహిమ పోలేదు. ఎంతైనా ఋషి, వేదాలు తెలిసినవాడు. అందుకని బ్రహ్మ తరచుగా నాడిజంగుడిని పిలిచి వేదాలు మీద చర్చ చేస్తుండేవారు. కానీ ఈమధ్య కొన్నాళ్ళ పాటు బ్రహ్మలోకానికి వెళ్ళకపోతే బ్రహ్మకి నీ మిత్రుడిని చూడాలనిపించి ఆ దౌర్భాగ్యుడికి ఆ దుర్భుద్ది పుట్టించి చంపించాడు. కాబట్టి బ్రహ్మలోకాని వెళ్ళకపోవడం అనే అపచారం వాళ్ళ దుర్మరణం పాలయ్యాడు. విరూపాక్షుడు అయ్యో అని భాదపడుతుండగా బ్రహ్మ ప్రత్యక్షమై నీకేమి కావాలి కోరుకో అన్నాడు. విరూపాక్షుడు నా మిత్రుడి ప్రాణం కావాలి అన్నాడు. భాదపడకు నువ్వు ఇంతకు ముందు నీ స్నేహితుడికి ఆచరించిన ధనకాండ సమయంలో ఒక గోవు ఆ చితికి దగ్గరలో దూడకి పాలు ఇస్తుంది. అప్పుడు వచ్చిన పెనుగాలి వల్ల ఆ పాల నురగ ఆ చితిమీద పడటం వల్ల నీ మిత్రుడికి ప్రాణం వచ్చింది. ఇంకొద్ది సమయంలో అది వచ్చేస్తుంది!అనగానే రివ్వుమని నాడిజంగుడు అక్కడికి వచ్చేశాడు. విరూపాక్షుడు తన మిత్రుడిని చూసి ఆనందంతో పులకించిపోయాడు. వెంటనే నాడిజంగుడు విరూపాక్షుడతో మిత్రమా నా మిత్రుడు గౌతముడు కుశలమేనాఅని అడిగాడు. విరూపాక్షుడు వాడిని కత్తికొ కండగా నరికి కుక్కలకి వేశాను అన్నాడు! అప్పుడు ఇంద్రుడు కుడా వాడు చచ్చాడయ్యా. వాడిని భయంకర యాతన దేహంలో ప్రవేశపెట్టి యమలోకానికి ఈడ్చుకుపోతున్నారు. అక్కడ పరమ భయంకరమైన యమదండన లు అనుభవిస్తాడు అన్నాడు ఇంద్రుడు! వెంటనే నాడిజంగుడు బ్రహ్మ కాళ్ళు పట్టుకొని అయ్యా నాకోసం వాడిని క్షమించండి. వాడు పదికాలాల పాటు సుఖంగా ఉంటాడని బంగారం, మణులు ఇప్పించాను! వాడికేదో దుర్భుద్ది ఆ సమయంలో పుట్టింది. ఆ దుర్భుద్ది కూడా వాడిది కాదు. నేను బ్రహ్మకి చేసిన అపచారం వాల్ల పుట్టింది అని నాకు అనిపిస్తుంది. ఏమైనా ఆ పుణ్యాత్ముడు సుఖం గా ఉంటే చూడాలని నాకోరిక, నాకోసం బ్రతికించండి అనగానే ఇంద్రుడు తెల్లబోయాడు. అసలు నీలాంటి ఉత్తములు ఉంటారా? అసలు ప్రాణం తీసిన వాడిని బ్రతికించు అంటున్నావ్. సర్లే అని వాడి ప్రాణం వాడికి ఇచ్చాడు. గౌతముడు బ్రతికి  లేచాడో లేదో ఆ మూటలన్నీ మోపు మీద పెట్టుకొని మళ్లి లాక్కుంటారు ఏమో అని ముందుకి వెనక్కి చూసుకుంటూ పరుగులు పెట్టుకుంటూ అడవి మార్గం గుండా వెళిపోయాడు.ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకుడదో తెలుసుకోవాలి. ఎంతటి ధర్మతుడైన నిచ్యులని చేరదీస్తే ప్రమాదం వస్తుంది! కష్టాలపాలయినా అనుక్షణం జాగరూకులై ఉండాలి. ఇందులో లోతు పరిశీలిస్తే చాల ధర్మాలు ఉన్నాయి. ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి ఇది కథే కదా అని తీసేయకండి. దీని నుంచి నేర్చుకోవలసింది చాల ఉంది.

Post a Comment