Breaking News
Join This Site
నరకములు - శిక్షలు - వర్ణములు.. ఏ పనులు చేస్తే ఏమౌతుంది?

నరకములు - శిక్షలు - వర్ణములు.. ఏ పనులు చేస్తే ఏమౌతుంది?నారాయణుడు నారదుడితో చెప్పెను. నారదా! నరకములు కొందరు ఇరువది అయిదు అని, ఇరువది ఎనిమిది అని అందురు. నరకములు మొత్తం ఇరువది ఎనిమిది కలవు. అవి..

తామిశ్రము, అందతామిశ్రము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, అసిపత్రారణ్యము, శూకరముఖము, అంధకూపము, క్రిమిభోజనము, సందంశము, తప్తమూర్తి వజ్రకంటకం, శాల్మలి వైతరణి, పుయోదము, ప్రాణరోధము, విశసనము, లాలాభాక్షణము, సారమేయాదనము, అవీచి అయఃపానము, క్షారాకర్దమము, రక్షోగణము, సంభోజము, శూలసోత్రము, దందశూకము, వటారోధము, పర్యావర్తనము, సూచీముఖము..

ఏ దుష్టుడు పరభార్యలను, ధనమును, సంతటినీ హరించునో ఆ దుష్టుడు యమదూతల బారి చిక్కును. యముని భీకరమైన కాలపాశాములకి బద్ధుడై అనేక యాతనలు కలిగించు తామిస్ర నరకమున త్రోయబడును.అచ్చటి యమభటులు పాశము చేత వానిని పట్టి కట్టి కొట్టి తిట్టి భయపెట్టి పలురకముల ఇక్కట్లు పెట్టుదురు. అప్పుడు ఆ నారకుడు మూర్చిల్లును.

ఒక విటుడు మరొకరిని మోసగించి వాడు ఇంటలేని సమయములో వాని పెండ్లమును, ధనమును విడువక అనుభవించును. అటువంటివాడిని యమభటులు అంధతామిస్రము అనే నరకములో త్రోయుదురు. వాడు ఘోర యమయాతనలు పడును. మతి చూపులు చెడినవాడై మొదలంట నరకబడిన చెట్టువలె కూలును.

నేను, ఇది నాది, అను అహంకృతితో ఒకడు ప్రాణులకు ద్రోహము తలపెట్టును. అతడు ప్రతిదినము కార్యనిమగ్నుడై స్వార్థముతో తన కుటుంబమును మాత్రమే పోషించుకొనును. అట్టివాడు తనవన్నియు ఇచ్చటనే వదిలిపెట్టి తన కర్మఫలములు పొందును. అతడు ఎల్లరికీ భీతిగొలుపు నట్టి రౌరవమున కూలును.

(మానవజన్మ ఇచ్చింది సాటి జీవులకి సహాయపడమని. కాని మనం మన స్వార్థం చూసుకుంటూ ఇతరులను నానా బాధలు పెడుతున్నాము. ఇతరులు కూడా కాదు. కన్నతల్లిదండ్రులని కూడా ఇంట్లో నుండి గెంటేస్తున్నారు. భర్త/భార్య అనే గౌరవాలు లేవు. పిల్లలనే మమకారం పోతుంది. పెద్దలకి నమస్కరించాలి అనే సంస్కారం భూతద్దం పెట్టి వెదికినా ఎక్కడా కనబడడంలేదు. ప్రస్తుతం అందరికీ కావలసింది డబ్బు, కామం.. ఇవే ముఖ్యం అనుకోని బ్రతికేస్తున్నారు. ఇలాంటివారు దేహం వదిలిన తరువాత ఎలాంటి నరకాలు అనుభావిస్తారో? )


ఈ లోకములో కొందరు ఎల్లరు ప్రాణులను హింసించును. (చీటికీమాటికీ దెప్పడం, అనవసరంగా కొట్టడం, తిట్టడం, సందర్భం లేకుండా ప్రాణులను (కోళ్ళు, మేకలు, గొర్రెలు, పందులు, దున్నలు, ఆవులు, మరికొన్ని ప్రాణులను) చంపి తినడం, చిత్రహింసలు పెట్టడం, చంపడం, మనస్తాపం కలిగించడం, ఇలాంటి అనేక నేరాలు చేస్తూ ఉంటారు.) అటువంటి హింసకులచే హింస పొందినవారు నరకంలో రురులై వారిని హింసపెట్టుదురు. అందువలన రౌరవ నరకమునకు ఆపేరు ఏర్పడినది అని పండితులు వచింతురు. ఈ రురువనే జంతువు సర్పము కన్నా క్రూరమైనది. ఇతరులను బాధించి పీడించువాడు ఈ మహారౌరవమున కూలతాడు. అందున అతడు మాంసము తిను రురు జంతువలచే తినబడతాడు.

అతి క్రూరముగా కోపముతో పశు పక్షులను బాధించు మూఢుని యమదూతలు పట్టి కొట్టుతారు. నారదా! వాడు హింసించు పశుపక్షులకు ఎన్ని రోమములు ఉండునో అన్ని వేల సంవత్సరములు కుంభీపాక నరకమునందు ఉందును. వాడిపై సలసల నూనె పోయుదురు.

తన తల్లిదండ్రులకును, విప్రులకును, బ్రాహ్మణులకు ద్రోహము చేయువాడు కాలసూత్ర నరకమున పడవేయబడి సూర్యాగ్నుల మంటల చేత తపింప చేయబడును. వాని శరీరము లోన బయట ఆకలిదప్పుల పెనుమంటలు చెలరేగును. వాడా నరకము నందే కూర్చోనుచూ, నడచుచూ, పరిగెత్తుచూ, నిడురించుచూ ఉండును.

మహర్షీ! ఎవడు వైదిక మార్గము వదిలి పాషండ మతమును నిరాటంకముగా చేపట్టునో వారిని యమభటులు అసిపత్రవన నరకమున త్రోయుదురు,. వాడిని కొరడాలతో కొట్టుదురు. రెండువైపులా పదును ఉండే కట్టులచే చీల్చబడుచూ అటు ఇటు పరుగులు పెట్టును. అటుల వారి అంగములన్ని చేధించబడుతూ ఉండగా "అయ్యో! చచ్చితి చచ్చితి" నని మహావేదన పడి మూర్చిల్లి అడుగడుగునా క్రిందపడుతూ ఉండును. అల్పబుద్ది గలవాడు తన ధర్మానుసారముగ పాషండ మతము పాషండ మత ఫలము అనుభవించును.

ఒక రాజు గాని, రాజ పురుషుడు గాని (మనబాషలో చెప్పాలంటే మంత్రిగాని, మంత్రి కొడుకు గాని) అధర్మముగా ఇతరులను దండించినా, బ్రాహ్మణులను పీడించినా, వేదిన్చినా, దండించినా, సూకముఖ నరకమున పడవేయుదురు. ఇతడచట తాతిలోని పిండి వలె నుగ్గునుగ్గయిన అవయవముల బాధతో ఆర్తితో కేకలు పెట్టుచూ మూర్చిల్లును.

ఎవడు ఇతరుల బాధను గుర్తించక నీచ్యకర్మలు చేయునో ఎవడీశ్వర కల్పితములు అయిన నల్లులు మున్నగువానిని బాధించునో ఆద్రోహి అంధకూప నరకమున కూలును. అతడచట పశు పక్షుల మృగముల పాముల చేత, తేళ్ళచే, పాములచే, నల్లులచేత పీడించబడును. అతడు ఆ పెంజీకటిలో దోమలు, అందశూకములు మున్నగు వానిచేత భాదించబడును.
ఎవ్వడు తన అన్నమును, ధనమును మంత్రసహితముగా పంచయజ్ఞములలో దేవతలకు ఈయక కాకివలె తాను ఒక్కడే అనుభావించునో ఆ పాపి క్రిమిభోజన నరకములో క్రూర యమభటుల చేకూల్చబడును. వాడు అచ్చోట లక్షయోజనమున వైశాల్యం కలిగిన కృమి కుండనమున పడి తానొక పురుగై ఇతర పురుగుల చేత తినబడును. అతిథులకు పెట్టక తానె కుడుచువాడు ఇదే నరకమున కూలును. 

బంగారము గాని రత్నములు గాని దొంగిలించినచో అట్టి దొంగ భగభగ మండే నయః పిండముల వంటి రోకళ్ళతో యమకింకరులు కసబిస త్రొక్కుదురు 

మదమెక్కి పొందరాని యువతిని పొందునో, ఏ రేగిన మదవతి యైన మగువ పొందరానివాడిని తమకము తీర్చుకొనునో వారిరువురిని యమభటులు వాడి కొరడాలతో కొట్టుదురు. మఱియు భగ్గున మండే యువతిని చేసి ఆ యువకునితో దానిని కౌగలింపజేతురు. యువతిని కూడా భగభగ మండే యువకునిని కౌగలింపజేతురు.

ఒక్కొక్క పాపాత్ముడు ఎక్కువ స్త్రీలను పొందును. యమభటులు ఇనుము వంటి వజ్రకంటకములు గల శాల్మిలీ నరకమున పడవేసి బాధింతురు. 

తమ క్షాత్రము విడనాడి పాషండ మతము చేపట్టిన పురుషులను (పురుషుడు అంటే కేవలం మగవాడు కాదు. మానవ జన్మెత్తిన స్త్రీ పురుష, నపుంసకలు. ప్రతి ఒక్కరు పురుష శబ్దమే.) స్వధర్మములు విడనాడిన నరులు చచ్చి దుఃఖములు అనుభవింతురు.అట్టి పాపులు మర్యాదలు లేనివారు. వారు పాపదుర్గముల ప్రక్కనే అగడ్తల నదులను బోలు లోతైన వైతరణీ తప్త జలముల యందు ఉక్కిరిబిక్కిరి అగుచుందురు. నారదా! అచ్చట పెక్కు జంతువులు వానిని తినుచున్నను ప్రాణములు వాని శరీరమును వదిలిపెట్టవు. అటుఇటు తిరుగుచుండును. 

పాపులు తాము చేసుకున్న పాపములు పండుట వలన మలమూత్రములు నెత్తురు మాంసములు, గోళ్ళు, వెంట్రుకలు, ఎముకలు, మేదస్సు, మజ్జతో నిండిన నదిలో మునుగుదురు. వృషలీ పతులు, భ్రష్ఠవాదులు, సిగ్గుమాలిన వారును, సదాచారనియమములు పాటించని పశువర్తనులును మలమూత్రములు, శ్లేష్మ రక్తములును, శ్లేష్మ మలములును, నిండిన నదిలో కూలుడురు. ఆ దురాగ్రహులకు యమభటులు ఆ పురుషుల నోళ్ళలో మలమూత్రములు నెట్టుదురు. 

ఏ ద్విజాతులవారు గాడిద, కుక్కలను పెంచుదురో, వేట తమకమున జంతువులను వేటాడుదురో, ఆ దుర్మార్గులు చచ్చిన మీదట యమభటులు వాడిని ఇడుములకు గురిచేయుదురు.

ఏ నరాధములు డామ్భికులగు వారు అంభ యాగముతో పశువులను హింసించురో వారు చచ్చిన పిమ్మట యమభటుల చేత విశసన నరకమున కూల్చుదురు. అక్కడ యమభటులు బెట్టిదంపు కొరడాలతో కొట్టుదురు. 

ఏ ద్విజుడు మొహాతిరేకము ఆపుకోలేక తనజాతి స్త్రీ నోటిలో రేతస్సు త్రాగిస్తాడో ఆ మూఢని యమభటులు రేతః కుండములో పడవేసి వాని చేత రేతస్సు త్రాపుదురు. 

దొంగలు, నిప్పంటించువారు, విషము పెట్టువారు, గ్రామాలను, వ్యాపారులను దోచువారగు రాజులను, రాజపురుషులను చచ్చిన పిదప శ్వానకదన నరకమున కూల్చుదురు. ఆ నరకమునందు ఏడువందల ఇరువదికి పైగా చిత్రవిచిత్రములు అగు కుక్కలు గబగబా ప్రాణులను పీకి పాకమున పెట్టును. నారదా! ఈ సారమేయాదన నరకము అతి భయంకరమైనది. దారుణమైనది. 


ఇక మీదట "అవీచి " నరకములు గూర్చి చెప్పుదును వినుము.

ఏ పాపులు లేచిన మొదలు అబద్దములు ఆడుదురో, డబ్బిచ్చి పుచ్చుకోనుటలో అబద్దములు ఆడుదురో వారు చచ్చిన పిదప అవీచి" నరకమున కూలుదురు.అచట యమదూతలు నూరు యోజనముల ఎత్తైన పర్వతముల నుండి క్రిందికి పడవేయుదురు. వారు ఆకాశము నుండి క్రిందపడు సమయమున అలలులేని నేలపై నీటి కెరటములు ఉన్నట్లు దోచును. అందు పడినవారు చిత్తుచిత్తుగా క్షీణించిననూ చావరు. మరలా క్రొత్త తనువులు దాల్చుదురు. 

బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో ఎవడైననూ సోమపానము చేసిన పిదప సురాపానము చేసినచో అతడునూ నరకమున కూలును. వారికి యమభటులు వేడివేడి లోహద్రవము త్రాపుదురు. ఈ లోహద్రవము ఎల్లప్పుడూ నిప్పు మంటలలో సలసలా క్రాగును. 

ఏ నరాధముడు గౌరవపాత్రుడు అయినవానిని గౌరవింపడో, తనకంటే విద్య, జన్మ, తపస్సు, వర్ణము, ఆశ్రమము, ఆచారము లందు శ్రేష్ఠులైన వారిని గౌరవింపడో వాడు క్షరాకర్థం నరకమునందు యమభటులు త్రోయుదురు. వాడు అచట తలక్రిందులుగా ఉండి నరకయాతనలు అనుభవించును. 

ఏ నరుడు గాని, నారి గాని నరమేధముతో ఏ దేని దేవతను గోల్చునో,  ఏ నరుడు/నారి నర, పశువు మాంసము తినునో వారు చచ్చిన పిదప ఆ నర పశువులు వానిని నరకము నందు వాడియైన కత్తులతో కోసి తినును. వాని నెత్తురు గ్రోలి పెక్కురీతులుగా నటించును. భూమిపై మాంసము తినువారి రీతిగా యమలోకము నందు వర్తించును.

ఏ నేరము చేయక, మోసములు చేయక వనములందు, గ్రామములందు సాధు జీవనము గడుపు పుణ్యాత్ములని  ఎవరు మోసగింతురో శూల కంటక సూత్రముల చేత బాధింతురో అటువంటివారు చచ్చిన పిదప శూల పాత నరకమునందు పడవేయుదురు. వాడి శూలముల చేత గ్రుచ్చబడుదురు. ఆరాటం తీరని దప్పిక చేత అలమటింతురు. వాడి ముక్కులు గల కొంగలు కంకములు మున్నగు పక్షుల చేత చీల్చబడుదురు. అప్పుడు ఆ పాపులు చేసిన పాపములు తలచుకొందురు. 

మరికొందరు పాపులు తీవ్ర ప్రవర్తనతో ఇతరులను ఉద్రేక పరుతురు. కొందరు భయపెట్టుదురు. అటువంటివారు దండశూక నరకమున పడవేయబడుదురు. అచట పెక్కు దండశూకములు ఉండును. వానికి ఐదు కాని ఏడు గాని కొనలు ఉండును. 

పాము కన్నములోని ఎలుకను పట్టి మ్రింగును అదేవిధముగా కటిక చీకటి బావులలో గాని గాదెలలో గాని, గుహలలో గాని మనుజులను పట్టి బంధింతురు. అటువంటి పాపులను దట్టమైన పోగమంటలు, విషపు మంటలు నిండిన చోట యమబటులు వారిని ఉక్కిరిబిక్కిరి అయ్యేటట్లు అడ్డగింతురు. 

ఏ బ్రాహ్మణుడు తన ఇంటికి అతిథిగా వచ్చినవానిని కంటి మంటలు కాల్చు నంతగా చూచినచో అట్టి పాప దృష్టి గలవానిని యమభటులు నరకమునకి ఈడ్తురు. అందు వాని కనుగ్రుడ్లను వజ్రతున్దములు గల కాకులు కంక వటాది పక్షులు, క్రూరమైన గ్రద్దలు బలంగా పొడిచి పీకివేయును. 

ధనమదాంధుడు, పాపగర్వితుడు అగు పాపవర్తనుడును, కన్నులు అడ్డముగా త్రిపుచు ఒక పాపి గురువులను, పెద్దలను అవమానించునో, పరిహసించునో, విసుగన్నది లేక రాబడి వ్యయము గూర్చియే ఎప్పుడునూ తలపోయుచుండునో, తనముఖము గుండె అలసిపోగా సుఖమను మాటయే మరచిపోవునో, బ్రహ్మరాక్షసి వలె, పిశాచము వలె, ధనమును కాపడుచుండునో, అటువంటివారు చచ్చి యమభటుల చేత బాధలు పొందును. వాడు తనకర్మకు తగినట్లుగా సూచీముఖ నరకమున గూలును. ఆ డబ్బు పిశాచి పట్టినవానిని యమభటులు పట్టి కట్టివేయుదురు. భటులు సాలివారి వలె పాపుల శరీరముల నిండా గట్టి దారముతో నేత వేయుదురు. 


ఈ ప్రకారముగా పాపులకు ఎన్నెన్నో రీతుల నరకయాతనలు గలవు.పాపులకు ఈ యాతనా స్థానములు వందలు, వేలకు వేలుగా లెక్కలేనన్ని గలవు. ఈ నరకములన్నియూ అనేక యమ యాతనలతో నిండి యుండును. ఇక ధర్మపరులైన పుణ్య పురుషులకు అనేక సుఖ లోకములు గలవు. స్వధర్మము అనుష్టించుట వలన ధన్యభాగుడగు జీవుడు నరకము వంకనైనా చూడడు. పరధర్మము ముఖ్యముగా దేవ్యారధన లక్షణములతో కూడి యుండును.


హరిః ఓం.. తత్సత్..Post a Comment