Breaking News
Join This Site
పెళ్లినాడే ఈ ప్రమాణం చేయండి. జీవితం నందనవనంగా తయారవుతుంది.

పెళ్లినాడే ఈ ప్రమాణం చేయండి. జీవితం నందనవనంగా తయారవుతుంది.


భర్త సమకూర్చడంలోను, భార్య చక్కబెట్టడంలోను తప్పనిసరిగా బాధ్యత వహించాలి.

తల్లిదండ్రులు కడుపులు మాడ్చుకొని. కోర్కెలు చంపుకొని, ఎన్నో తిప్పలు పడి అప్పులు చేసి ఎదిగిన పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే, అమ్మాయి కోసం డబ్బులు, నగలు అంటూ ఉన్నదంతా ఊడ్చి ఖర్చు చేసి చుక్కలు లెక్కపెట్టడం పెట్టడంకాదు...!! మీరు అంటే! తల్లిదండ్రులు తమతమ రోజువారీ సంపాదనలో కేవలం సగం మాత్రమె కర్చు పెట్టాలి మిగిలిన సగం ఖచ్చితంగా పిక్సిడ్ డిపాజిట్ చేసి తీరాలి. అప్పుడే కాపురం మరింత పటిష్టంగా ఉంటుంది .ఎంత గొప్పగా బట్టలు నగలు వేసుకొని తిరుగుతున్నాము కాదు ఎంత పొదుపు చేశాము అనే దానిమీదే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. పిల్లల కోసం ఖర్చు చేయడం సంపాదించడం తప్పనిసరే కావచ్చు. కాని రహస్య నిధి కూడా అంతే తప్పనిసరి.. రేపు మీ భవితవ్యాన్ని నిర్ణయించేది ఈ నిధే! కనుక పిల్లల కోసం బ్రతికాము. ఎంతో ఖర్చుచేశాము. కాని మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని ఏడవడం దండగ.. రెక్కలు వచ్చేవరకే పిల్లలు. తరువాత ఎవరెటు ఎగిరిపోతారో తెలీదు కనుక ఇటు కొత్త జంటలైనా, పాత దంపతులైనా ఈ విషయాన్నీ జాగ్రత్తగా పరిశీలించి జాగ్రత్త వహించండి.


వైవాహిక జీవితం సజావుగా సాగాలంటే?

• భార్యా భర్తలకు ఒకరి పట్ల ఒకరు ప్రేమ, నమ్మకం, బాధ్యత కలిగియుండాలి.
• భర్త సమకూర్చడంలోను, భార్య చక్కబెట్టడంలోను తప్పనిసరిగా బాధ్యత వహించాలి.
• ఇద్దరూ కష్టపడేది పిల్లలకోసమే అని గ్రహించాలి.
• భార్యా భర్తలు సాధ్యమైనంతవరకూ ఒకరిపై ఒకరు ఆధారపడాలి.
• మితిమీరిన వ్యక్తిగత స్వేచ్ఛ ప్రమాదకరం అని గ్రహించాలి.
• రోజులో ఎక్కవ సమయం భార్యభర్తలు కలిసి ఆనందంగా గడపాలి.
• జీవితభాగస్వామి గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మరాదు.
• వైవాహిక జీవితంలోని విషయాలు, భర్త/భార్య యొక్క వ్యక్తిగత విషయాలు తల్లిదండ్రులతో గాని, ఇతరులతోగాని పంచుకోరాదు.
• తప్పని పరిస్థితుల్లో దాంపత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను తెలివిగా పరిష్కరించగలవారితో మాత్రమే చర్చించాలి.
• వివాహం ఆనేది స్త్రీ పురుషుల మధ్య విడరాని శాశ్వత బంధం అని భార్యా భర్తలు గుర్తించాలి.
• సంసార జీవితంలో సంభోగం (సెక్స్) అనేది ముఖ్య భాగం. రోజుకి ఒక్కసారైనా శారీరకంగా కలవాలి.
భార్య-భర్తలు విడాకులు తీసుకోటానికి గల ముఖ్య కారణాలు ఏమిటి ?
• వివాహం అనేది స్వర్గంలో నిర్ణయించబడుతుందని” చాలా కాలం నుండి ప్రాచారం పొందిన వ్యాఖ్య అవునా! నిజమే, వివాహం అనేది జీవితంలో ఒకేసారి జరిగే మధుర ఘట్టం. జీవిత కాలం పాటూ ఒకరికొకరు తోడు-నీడగా ఉండే ఒక శుభకార్యం. నిబద్ధత, భాగస్వామ్యం, బాధ్యత, నిజాయితీ వంటి పైన మాత్రమే మీ సంబంధం కొనసాగుతూ ఉంటుంది. కానీ, అటూ పెద్దలు నిశ్చయించిన వివాహంలోనూ, ఇటూ ప్రేమ పెళ్ళిళ్ళలోనూ ఒకరి పైన మరొకరికి నమ్మకం లేకనో, పెద్దలు చెప్పేది వినకుండనో, అభిప్రాయ భేదాలు ఏర్పడి లేదా ఒకరి అభిరుచులు ఇంకొకరికి నచ్చక, వారి సంబంధాలు విడాకుల వరకు దారి తీస్తున్నాయి.
• కానీ కొంత మంది దంపతుల మధ్య ఒడిదుడుకులు ఎదురైన కలిసి జీవిస్తున్నారు, మరికొంత మంది విడాకుల ద్వారా విడిపోతున్నారు. దంపతులు మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడి, విడాకుల వరకు వెళ్లేందుకు గల ముఖ్య కారణాల పట్టిక ఇక్కడ తెలుపబడింది.
• మనదేశంలో ప్రతి 100 వివాహ బంధాల్లో కనీసం 30 విడాకులకు వెళుతున్నాయి.
• భార్యా భర్తల మధ్య అపనమ్మకం;
• ప్రేమ లేకపోవడం;
• లైంగిక సామర్ద్యం లోపించడం;
• వివాహేతర సంబంధాలు;
• డబ్బు మీద వ్యామోహం;
• పాశ్చాత్య సంస్కృతి ప్రభావం;
• అత్యధిక జీతాలు;
• అహం;
• వరకట్న వేధింపులు;
• స్త్రీ ఉద్యోగ -ఆర్ధిక స్వేచ్ఛ దుర్వినియోగం;
• ఒకరిమీద ఒకరు ఆధారపడకపోవడం;
• నైతిక విలువలు లోపించడం;
• ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం;
• మతపరమైన మరియు సాంస్కృతిక విధానాలలో తేడా
• వ్యసనం
• ప్రాధాన్యతలు మరియు అంచనాలలో తేడా
• 498 ఎ గృహహింస చట్టం దుర్వినియోగం;
మొదలగున్నవి కారణాలుగా చెప్పవచ్చు. జీవితంలో డబ్బు, హోదానే ప్రధానం కాదు. విలువలు, ప్రేమానుబంధాలు, విలువలు లేని జీవితం వ్యర్థం. కావున జీవిత భాగస్వామితో జాగ్రతగా వ్యవహరించి సుఖసంతాషలతో నూరేళ్ళ జీవితం కొనసాగించండి.
శ్రీశ్రీ..Post a Comment