Breaking News
Join This Site
అమ్మాయా అమ్మాయే అమ్మాయంటూ నొక్కినొక్కి వివక్షలు కట్టబెట్టగ! (రాధాకుమారి కవితలు)

అమ్మాయా అమ్మాయే అమ్మాయంటూ నొక్కినొక్కి వివక్షలు కట్టబెట్టగ! (రాధాకుమారి కవితలు)


అమ్మాయా అమ్మాయే అమ్మాయంటూ
నొక్కినొక్కి వివక్షలు కట్టబెట్టగ
ఆంక్షల నడుమ ఆటలాడుతు
అలవోకగ పెరిగెనె అమ్మాయే

ఆటలందు కూడ కేటయింపు జేసి
చెమ్మచక్కలష్టచమ్మ కంకితం జేసిన
కట్టుదిట్టాల నడుమ చాకచక్యంగా
కుస్తిఆటలాడి పతకాలు దెచ్చె

నేవిమిలటరీల వైమానికం నందు
ధీటైన ప్రతిభ కనబరిచె ఈనాడు
అన్ని రంగముల నాధిపత్యము
కంటగింపే గాద కట్టుబాట్లకు

ఎంత ఎదిగినేని ఏమున్నది సంతసించ
గృహహింసల దాడులన్ని పెచ్చుమీరుతూనె ఉండె
దొంగపెళ్ళి దందాలోన కీలుబొమ్మగ మారె
ట్ర్రాఫ్కింగు వలలోన చేపలాగ చిక్కుతుండె
వ్యభిచారపు రాకెట్టుల ఇంధనంగ మారుతుండె

అమ్మాయిగ పుట్టెకన్న అడవి మానుగ పుట్టు మేలు
చట్టాలూ ఆర్డినెన్స్లు ఎన్నున్నా పై పేరుకే
ఛిధ్రమైన ఆడపిల్ల జీవితాన్ని దేలేవు
సంస్కరణలెన్నైనా జేయలేవు బాగేమి..!!
రాధాకుమారి..
కృష్ణా...!
మృదుమనోహరమైన నీ వేణుగానంతోనే నా హృదయ వీణను సుతారంగా మీటుతూ.....
శ్రావ్యమైన భావతరంగ సరాగాలను సంధిస్తూ.....
సున్నితమైన నీ మధురానంద స్పర్శతో పవిత్రబంధాన్ని పెనవేస్తూ.....

నీ చిలిపి చూపుల చినుకులతో నను నిలువెల్లా తడిపేస్తూ....

ఆనంద డోలికలలో ముంచేసి ఊపిరాడనీయవేం.. ప్రియా....!!

నా హృదయాంతరాలలోని ప్రేమ పుష్పం పరితపిస్తున్నది.... 

నీపై పరిమళాలు వెదజల్లి నీలో మమేకమైపోవాలని..... !


రాధాకుమారి.. ,,కుండంటే కుండగాదు
పోటీగనే కుమ్మరికి

గుండ్రంగా ఉండునండి

పొంతకుండ కన్న గూడ

చెమటోడ్చు కుమ్మరోడు
సక్కనైన కుండ కొరకు
చెమటోడ్చక ఈ కుండ
గుండ్రంగా వచ్చె జూడు
కుమ్మరోడి కష్టమంత
చేజారగ నేలపాలు
మరి నేలబడి దొర్లినా
పొర్లుదండాలిడినా
బహుభధ్రం ఈ కుండ
పచ్చికూరలు తినుట మేలు
కొవ్వుచేరెడి మటను కన్నా
పండ్లుఫలములు ఇంక మేలు
పాచిపోయిన పిజ్జా కన్న
నీ కన్న ముందు నడిచె
మోయలేని కుండలేల
రానివ్వకు రానివ్వకు
రన్నింగే ఇకనుంచి.....
రాధాకుమారి.. ,,

సంతకెళ్ళె దారిలోన
సందుచివర చందురూడు
సందెవేళ కాగానే
నక్కినక్కి కాపుగాసె
ఓరగంట సూడగానే
ఒళ్ళువిరుచుకుంటూనే
ఒంటిచేత్తో సైగజేసి
కంటి కవితలంపాడె
పంటినొక్కు నొక్కుకుంటు
వెళ్ళలేక ఆగలేక
నిలవలేక వదలలేక
నే నరకయాతననుభవించె
పూలబుట్ట చేతబట్టి
సంపంగి సీరగట్టి
మరిమోగని గజ్జలెట్టి
నే పోతా నా మామతోడ
ముద్దులన్ని మూటగట్టి
మురిపమంత గుమ్మరించి
ముచ్చటగా నా మామకు
సోకులన్ని దోచిస్తా...

రాధాకుమారి.. ,,ఓయ్.. తూనీగా... నేను గుర్తున్నానా...!!
ఎందుకు మర్చిపోతావ్లే.. మనం మంచి స్నేహితులం కదా....!
ఎన్ని దోబూచులాడుకున్నాం.... 
నే వెంట పడుతుంటే నాకు మస్కా ఇచ్చి ఎన్నిసార్లు పారిపోయావ్... 
మళ్ళీ కావాలనే నాకు దొరికిపోయి నా సరదా తీర్చావ్.. నాకు గుర్తుందిలే...
నీ తోకకు దారం కట్టి నీకు ఆకులు తినిపించా నీకు గుర్తుందా... 
అపుడొచ్చిన నీ చిరుకోపం కూడా నాకు గుర్తుంది....
మళ్ళీ నీతో ఆడుకోవాలి నేస్తం.. ఓ సారిటురావా.... ! 
భవబంధనాలన్నీ పక్కకు పెట్టి బాల్యంలో గడపాలని వుంది... సాధ్యం కాదేమో... 
కానీ మనమైతే దోబూచులాడుకోవచ్చు రా నేస్తం....!!!

Post a Comment