Breaking News
Join This Site
కిటికీలో నుండి వెన్నెల మరీ రారమ్మని పిలుస్తుంటే! (తెలుగు కవితలు)

కిటికీలో నుండి వెన్నెల మరీ రారమ్మని పిలుస్తుంటే! (తెలుగు కవితలు)





మళ్ళీ గుర్తొచ్చావ్
ఎందుకని అడగవేం

కిటికీలో నుండి వెన్నెల
మరీ రారమ్మని పిలుస్తుంటే
నువ్వేమో అనుకున్నా

అచ్చు నీలానే తనుకూడా
మనసును మురిపిస్తూ
మది లో మంటలు రేపుతూ

ఎన్నో కాలాలు
వెన్నెల రాగాలై
అనురాగ యోగాలై
తడిసి మురిసినా
మళ్ళీ కొత్తగా

ప్రపంచాన్ని మొదటిసారిగా కళ్ళు విప్పి
చూస్తున్న పుట్టిన పాపాయి లాంటి ఉద్విగ్దత

నిన్నుచూస్తున్నంత ఆనందం
వెన్నెలని చూస్తుంటే

ముద్దలుగా కురుస్తూ
వెన్నెల చేస్తున్న అల్లరిలో
నాలో నేను నీలోకూడా తడుస్తూ తల్లడిల్లడం
అద్భుతంగా ఉంది.

అపూర్వ లోకపు సుందర సృష్టి లా
అపూర్వoగా జాబిల్లిని కొత్తగా చూస్తూ
నీవే గుర్తొస్తూ...

చుక్కలెన్ని ఉన్న చందురుడు పైనే మనసు
వెళుతుంది

తడి తడి గుర్తులే కదా
గుండె గదులలో
బలీయమైన శాశ్వతాలు

జ్ఞాపకాల మనోవీధిలో
యవ్వన మంత పచ్చగా ఉండే స్మృతి నీవే
నులివెచ్చని భావమై నను బతికిస్తూ..


సంధ్య......