Breaking News
Join This Site
నీకు నాకు మధ్య దూరం గాలి చేరని దూరం ఖాళీ లేని దూరం (తెలుగు కవితలు)

నీకు నాకు మధ్య దూరం గాలి చేరని దూరం ఖాళీ లేని దూరం (తెలుగు కవితలు)






దూరం
మనిషికి మనిషికి మధ్య దూరం
మనసుకి మనసుకి మధ్య దూరం

మనసున్న మానవత్వానికి
దయలేని దానవత్వానికి మధ్య దూరం

కలిమి లేముల మధ్య దూరం
కలవలేని దూరం
కలిసిపోని దూరం

కాలం కూడా మార్చలేని దూరం
పేద జీవికాలే కడుపుకి
గొప్ప వాడి అరగని పొట్టకి దూరం


అంతరాల దూరం
ఆంతర్యాల దూరం
అందుకోలేని దూరం

మమతల మధ్య దూరం
మాయచేసే దూరo

విలువ తెలియని దూరాలు కొన్ని
విలువ ఇవ్వని దూరాలు కొన్ని

(సo) బoధాల లో దూరం
బాధించే దూరం
అమ్మ నాన్నని చూడని తనయులు దూరం
పిల్లల మనసుని చేరని కొన్ని
కన్న కడుపులు దూరం

స్నేహం లో దూరం
స్వార్థం తో దూరం
అవసరాల్లో ఆదుకోని దూరం
ఆనందాలలో పాలు పంచుకోలేని దూరం


అహoకారంతో చేసుకునే దూరాలు కొన్ని
అపార్థాలతో చేసుకునే దూరాలు కొన్ని
అంతులేని దూరాలు కొన్ని

భావాల్లో కలవని దూరాలు కొన్ని
బంధాలు కూడా మార్చలేని
దూరాలు కొన్ని

కలిసిఉన్న కలవలేని దూరాలు
కలకాలం కలిసి ఉన్న కళ్ళు

దూరాన ఉన్నా ప్రాణమైనవి కొన్ని
కనిపించని గాలిలా
అదృశ్య మై సుమించేవి కొన్ని

కొన్ని దూరాలు సముద్రము నీటిలా దాహం తీర్చనివి
మరి  కొన్ని నింగి నేలలా కలుసుకోలేనివి

నీకు నాకు మధ్య దూరం
గాలి చేరని దూరం
ఖాళీ లేని దూరం





మీ సంధ్య.....

Post a Comment