Breaking News
Join This Site
సీమంతం ఎందుకు చేస్తారు?చేయకుంటే వచ్చే నష్టం ఏమిటి?ఎవరికి సీమంత క్రియ జరుపబడదు!

సీమంతం ఎందుకు చేస్తారు?చేయకుంటే వచ్చే నష్టం ఏమిటి?ఎవరికి సీమంత క్రియ జరుపబడదు!


సీమంతం ఎందుకు చేస్తారు?చేయకుంటే వచ్చే నష్టం ఏమిటి?ఎవరికి సీమంత క్రియ జరుపబడదు? సీమంతం ఉత్సవానికి జ్యోతిర్శాస్త్రానికి కల లింకు ఏమిటి?సీమంతం జరుపడం వలన ఎవరికి ప్రయోజనం?ఈ క్రియను మొదటి గర్భానికి మాత్రమే ఎందుకు చేస్తారు ?ద్వితీయా గర్భానికి ఎందుకు చేయరు?అనే ప్రధాన విషయాలను నేడు మీతో పంచుకోదలిచాను...ఇవన్నే కూడా నా సొంత పరిజ్ఞానం అనుకునేరు బృహస్పతి స్మృతి అనే గొప్ప జ్యోతిర్ గ్రంధంలో ఈ విషయాలు చెప్పబడిఉన్నాయి..
దేవనాగరిలో-“ సీ”- అంటే ప్రక్షాళన లేదా శుభ్రపరచడం అని అర్ధం.అంటే శుభ్ర పరచడంవలన గర్భస్థ ఆశ్రయ పిందమును ప్లస్ గర్భాశయాన్ని పరిపుష్టం చేయడం లేదా బాగ్యవంతం చేయడం.అందుకే దీనిని సీమంతం అన్నారు విబుధులు. అసలు వీటిని ఎందుకు శుభ్ర లేదా ప్రక్షాళన చేయాలి?గర్భాశయం దేహం లోపల ఉంటుంది కనుక మాలిన పడదానికీ,కాలుష్యం చేరడానికి అవకాశమే లేదు కదా?ఇక గర్భ సంచీలో ఉండే శిశువు మరింత పదిలంగా ఉంటాడు కదా?మరీ సీమంతం పేరుతో జరిగే ఆర్భాటం ఏమిటి?డబ్బూ-సమయమూ వ్రుధాకాకపోతేనూ అని పొరపాటునకూడా భావించకండి.అసలు సీమంతం గురుంచి వైదిక కర్మ గ్రంధాలు చెప్పినది చాలా స్వల్పం.జ్యోతిర్శాస్త్రం లో సీమంతం గురించిన అనేక రహస్యాలను ఇప్పుడు ,ఇక్కడ మీకు చెప్పబోతున్నాను...
వాస్తవానికి సీమంతం అనేది జననీ-జనకులూ –పుట్టబోయే బిడ్డ క్షేమం కోసం చేసే త్రి-ప్రాణ గ్రహ శాంతి .సీమంతం జరపకుంటే ఈ ముగ్గురికీ ప్రమాదమే.అసలు ఈ ముగ్గురికి ప్రమాదం అని ఏ కోణంలో చెబుతున్నానో చదవండి.
శాస్త్రంలో తండ్రిని నవమం [9]నుంచి ,తల్లిని చతుర్ధం[4]నుంచి ,పుట్టబోయే బిడ్డ అదృష్టాన్ని దశమం[10]నుంచి పరిశీలనం చేస్తుంటారు.అంటే తల్లి-తండ్రి- పుట్టబోయే శిశువు జన్మపరంపరగా ,పలు జన్మ కర్మల ఫలితంగా చేసుకున్న పాప కార్యాల ఫలం ,జనించబోయే శిశువు జాతకంలో గ్రహ-స్థాన రూపాలలో పైన పేర్కొన్న చెప్పిన ముగ్గురిని బాధించకుండా ఉండటానికి చేసే ప్రక్రియే ఈ మన సీమంతం.శిశువు పుట్టిన తరువాత కదా జాతకం-అందులోని గ్రహ లోపాలూ తెలిసేది ?మరి బిడ్డ పుట్టకుండానే ఈ కర్మను ఎందుకు జరపాలి? అనేది మీ సందేహం
.దపంతుల తొలి రాత్రి సంగమానికి[శోభనం-అప్పటివరకూ భార్య-భర్త అనే ఏక గౌరవంలో ఉన్న స్త్రీ-పురుషుని సంగమ క్రియ ద్వారా ద్వితీయ గౌరవాన్ని కలిగించే అమ్మ-నాన్న అనే కోత్హ వరసతో దంపతులకు శోభను-తేజస్సునూ ఇచ్చేది కనుక దీనిని శోభనం అని అన్నారు

.మీరు బాగా గమనిoచారో లేదో కోత్హగా పెళ్ళైన దంపతులను శోభనం మరునాడు చూడండి.వారి ముఖంలో కోత్హ కాంతీ-తేజస్సూ కనిపిస్తాయి.దంపతులలో పురుషునికి ఈ కాంతి-తేజస్సు బిడ్డ పుట్టిన మొదటి నెలవరకూ కనిపిస్తుంది.తల్లికి మాత్రం పురిటి నొప్పులు మొదలు అవగానే ఈ తేజసు ఉపసంహరిచబడుతుంది.]ఏర్పాటు చేస్తారు.ఇందుకోసం ముహూర్తం స్వయంగా పెట్టడం రాని విప్రుని ఎంచుకుంటూ ఉంటారు.వీరు పంచాంగంలో ఉన్న రెడీమేడ్ ముహూర్తాలను చూసి సదరు గర్భాదాన లేదా శోభన లేదా ఆదాన లేదా నిషేక లగ్న ముహూర్తాలు పెట్టేశి చేతులు దులుపుకున్టారు..విప్రులు అన్యమనస్కంగా క్రతు-ముహుర్తాదులు పెట్టడానికి కారణం వారు చెప్పే శాస్త్రాలకి పెట్టుబడా-పాడా అనే భావన ఎదుటి వారిలో ఉండటమే ప్రధాన కారణం..ఇలా నిర్నయించే రెడీమేడ్ ముహుర్తాలలోని పొరపాట్లే తల్లి-తండ్రి-పుట్టబోయే బిడ్డ పాలిటి ప్రమాద హేతువులుగాపరిణమిస్తాయి.దేశ-కాల-పాత్ర-గణన అనే నాలుగు ప్రదానాశాoలు ఆదాన లగ్న ముహూర్త గ్రహ దోషాలకు కారణం అవుతున్నాయి.ఈ దోషాలకు చేసే పరిహార,ప్రక్షాళన క్రియయే సీమంతం.

సీమంతం వలన పైన పేర్కొన్న ముగ్గురికీ క్షేమం కలుగుతుంది.ఈ క్షేమం ముగ్గురికీ భిన్నంగా సంప్రాప్తం అవుతుంది.ప్రసవానతరం తల్లికి మంచి ఆరోగ్యం ,తండ్రికి ఆర్ధిక ఉన్నతి ,బిడ్డకు బాల పీడలూ ఉండవు.ఇక దీనిని తొలి గర్భానికి మాత్రమే చేస్థారు కారణం తొలి శిశువు వంశాంకురం కనుక.తొలి శిశువు గ్రహబలం అతడి తరువాత పుట్టే సంతతికి రక్ష అవుతుంది. అదీకాక తొలిసారి ప్రక్షాళనకు గురైన గర్భ సంచీ రెండో సారి సులువుగా కన్సెప్షన్ [గర్భధారణ] చేయడానికి సిద్హం అయిపోతుంది.ఈ కారణంగానే తొలి చూలు కి అత్యంత ప్రాద్న్యతను ఇచ్చారు.
Source : Hindu-Hindu

Post a Comment