Breaking News
Join This Site
ఉత్తమ నారీ ధర్మాలు (పురాణాల ఆధారంగా) స్త్రీలలో ఈ కింది దోషాలు కుటుంబాన్నే నాశనం చేస్తాయి.. కాబట్టి ఆ దోషాలున్న స్త్రీలను చేరదీయరాదు..

ఉత్తమ నారీ ధర్మాలు (పురాణాల ఆధారంగా) స్త్రీలలో ఈ కింది దోషాలు కుటుంబాన్నే నాశనం చేస్తాయి.. కాబట్టి ఆ దోషాలున్న స్త్రీలను చేరదీయరాదు..
భవిష్య పురాణంలో స్త్రీ యొక్క ధర్మాలను ఈ విధంగా చెప్పడం జరిగింది..ముందు స్త్రీలలో ఉండే దోషాలు, వాటివలన ఏమి జరుగుతుంది అనేది వివరంగా చెప్పబడింది..

స్త్రీలలో ఈ కింది దోషాలు కుటుంబాన్నే నాశనం చేస్తాయి.. కాబట్టి ఆ దోషాలున్న స్త్రీలను చేరదీయరాదు.. ఆ దోషాలు ఏమిటంటే.. దార్ద్ర్యం, రెచ్చగొట్టే అందం, అంతగా మంచిపేరు లేనివారితో సావాసం, చిరుతిళ్ళు, అతిగా రసాలు తాగుట, కథలు, గోష్టులలో ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ పనివైపు మళ్ళకపోవడం, గారడీలు, కనికట్టు చేయడాం, అడుక్కునే అలవాటు, నటన, సరదా, నాట్యకత్తెలతో స్నేహం, దుష్ట స్త్రీలతో విహారాలకు, పిలుపులకు, యాత్రలకు పోవుట, అత్యధిక తీర్థయాత్రలు, అతిగా దైవదర్శనాల పిచ్చి, పతికి దూరంగా వెళ్ళి ఉండుట, కఠోర ప్రవర్తన, పరపురుషులతో అతిగా మాట్లాడుట, అతి క్రూరము, అతి సౌమ్యము, మరొక స్త్రీని ఆరాధించి, ఏమాత్రమూ ఆలోచన లేక, ఆమె మార్గాన్ని అవలంబించుట..

ఈ దోషాల వలన ముందు ఇల్లాలు, పిమ్మట ఆమేను కట్టుకున్నవాడు నిందలు, కష్టాలపాలవుతారు. ముఖ్యంగా ఇది ఇంటి యజమాని, అనగా పురుషుని చేతగానితనంగానే పరిగణించబడుతుంది. పనివారు కూడా, యజమాని వారిపై అతిగా కరుణ చూపిస్తే నిత్తికెక్కడమే కాక, ఊళ్ళో అతడి పరువు తీస్తారు. స్త్రీ కూడా అంతే... కాబట్టి మొత్తం గృహాన్నంతటినీ తన అదుపులోనుంచుకొనడం గృహస్థుకి చాలా అవసరం. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి.. భార్య అనేది భర్తకు సర్వస్వము. అతనిలో సగం. ఆమే లేకుంటే అతనికి ధర్మక్రియ సాధనే ఉండదు. కాబట్టి స్త్రీని అనుకూలవతిగా మలచుకొని ఆదర గౌరవాలతో, ప్రేమతో సంభావించి ఆమె సహకారంతోనే సంసారాన్ని నడపడం గృహస్థు ప్రథమ కర్తవ్యం. ఆమేకు ప్రతికూలంగా అతడు పోరాదు.

ఉత్తమ స్త్రీ లేదా పతివ్రతకి సాధారణంగా మూడు లక్షణాలుంటాయి. అవి పరపురుషుని పట్ల విరక్తి, తన పతిపై ప్రీతి, తనను తాను రక్షించుకొనే సామర్థ్యము. పురుషుని పట్ల అనగా భర్త పట్ల స్త్రీ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో ఆదేశిస్తూ బ్రహ్మ చెప్పిన విషయాలు ఇవి:

సంతానమైనా, స్వర్గప్రాప్తి అయినా స్త్రీకి, భర్తకు తనపై గల ప్రేమ ఆధారంగా సంక్రమిస్తాయి కాబట్టి ప్రతి స్త్రీ తన పతి ఆరాధన ఫలితంగా నిరంతర సేవా ఫలితంగా పతి ప్రేమను పొందాలి. విధి, నిషేధ పూర్వకంగా పతి చెప్పే ధర్మాచరణను అవలంబించాలి. భర్త అనంతరం కొడుకే ఆమేకు ధర్మశాస్త్ర గురువు కాగలడు. స్త్రీకి అధికారాలు పరిమితమే అయినా, స్త్రీ యొక్క సాన్నిహిత్య, సామీప్య అవసరాలు సమాజ కళ్యాణానికి అపరిమితం. గృహస్థు యొక్క అన్ని ధర్మాలకూ మూలం పతివ్రత అయిన స్త్రీయే.. గృహధర్మానికి మూలం, పతివ్రతయగు గృహిణి... ఆమే పతిని ఈ విధంగా ఆరాధిస్తుంది. పతి చిత్తవృత్తిని కూలంకషంగా తెలుసుకుంటుంది. అతడు ఎప్పుడేది అడుగుతాడో, దానిని అతడు అడగడానికి ముందే సమకూర్చిపెడుతుంది... సర్వకాల సర్వావస్థలలోనూ, అతని మేలునే కోరుతూ తన ప్రతిపనీ అటువైపే మళ్ళేటట్టు చేస్తుంది..

ఇంకా ఉంది..
Source : Hindu-Hindu

Post a Comment