Breaking News
Join This Site
తెలుగు కవితలు (సుహాని రాజ్)

తెలుగు కవితలు (సుహాని రాజ్)

నా హృదయమా..
అడిస్తావో,, అలరిస్తావో,,
భాదిస్తావో,,బంధిస్తావో,,
వలపిస్తావో,, వధిస్తావో,,,
ప్రేమిస్తావో,,ద్వేషిస్తావో,,
నీ జ్ఞాపకాల తుమ్మెదలు,,
నా తనువును తాకుతున్నవి...
నీ ఊహల గాలులు,,
మదిని ఊయల ఊపుచున్నవి...
నీ శ్వాసల వెచ్చదనం...
నిశ్వాసనే ఆపుచున్నది...
నీ తలపు తలచిన చాలు...
ఉప్పొంగే కదా నాలో భావకవితలెన్నో...
నీ పేరు నే పిలిచిన చాలు...
సుధామధురములే నా ఆధరములలో...
నీ చూపు నన్ను తాకిన చాలు..
కోటీవీణల రాగసరాగలు హృదిలో మెదిలే...
మరుపైనా రాని మనసైన వాడివి నువ్వు..
సరసములే సోయగములైన చెలికాడివి నువ్వు..
నిన్నలా,, మొన్నలా,,,వెన్నంటిన నీడలా,,
నా నీలాల కన్నుల్లో,,నీ నవ్వే కాంతిలా,,,
నా చిన్ని గుండెల్లో,,నీ రూపు చెరగని బొమ్మలా,,,
పాల చెక్కిళ్ళలో,,, నీ అధరాల ముద్రలా,,,
నా హృదయంలో,,ఓ దీపపు వెలుగులా,,
వుండినీవా నీ తోడులా... నీ నీడలా..
నాకు నేనే ఏమి కానీ నీ దానిలా....
సుహాని రాజ్ 
భూమిని నేను

 భూమాతను నేను...
ఒక్కసారి వినుమా,, నా ఆవేదన...
ఇది నా మరణ వేదన...
 కాలుష్య కోరల్లో చిక్కుకుని,,,
అపరిశుభ్రతను చీరగా చూట్టికొని,,
అబలల రక్త అభిషేకాలతో,,
రైతుల కన్నీటి ఘోషలతో,,,
ప్లాస్టిక్ పెను భూతాలతో,,,
భూకబ్జా దారుల వేధింపులతో,,,
నా బిడ్డల నరికి వేతతో...(చెట్లు) ఏమి చెయ్యలేక,,
నిస్సహాయంగా,, కదలిక,,మెదలక,,, కన్నీటిని కార్చుచున్నాను...
 పచ్చని ప్రకృతిని చీరగా చుట్టమని,,,
పుష్కల జలములతో అభిషేకించమని,,,
రైతన్నల కన్నీటిని తుడిచే వరం ఇవ్వమని,, ఓ తల్లిగా అభ్యర్ధిస్తున్నాను...
 ఏలయనగా... మీరే నా పతనానికి కారణం...
మీ మూర్ఖత్వమే నా నాశనం...
నన్ను రక్షించమని,,, నన్ను శిక్షించిన వారినే కోరుతున్నాను...
 ఎందుకనగా...
నా నాశనం..మీకు వినాశనం...
నా మరణం..మీకు మరణశాసనం..
ప్రాణకోటికే తప్పదు ప్రళయం...
 SAVE EARTH.. Earth day సందర్భంగా....
భూమాతకు ఈ కవిత అంకితం.....
సుహానిరాజ్..


చూసినవన్నీ నిజాలు కావు..
వినినవన్నీ అబద్ధాలు కావు...
నిజాన్ని నిజంగా తెలుసుకోలేని ఈ లోకం,,,
అభద్దాన్ని మాత్రం సులభంగా నమ్మేస్తుందేందుకో....
మనం చెప్తే వినని ప్రపంచం,,,
లోకులు చెప్తే వింటుందేందుకో...
ఏదైనా సరే...
ఒకటి మాత్రమే నిజం....
మనమంటే ఏంటో మనకి తెలిస్తే చాలని....
సుహానిరాజ్నేస్తమా..అనుకోని వరమా...
నాది అని నే అనుకుంటే,,
శాపమా నీకు నేను భారమా..

ఏకాంతంలో ఆనందమే నా విషాదమా...
ఆత్మీయతే కానరాని అనురాగమా...

ఎందువలన నాకీ హృదయ వేదన...
నాకే ఎందుకు ఈ శ్రమల శోధన...

నిన్నే నాలో దాచేసుకున్నందుకా....
నాలో నిన్నే నింపేసుకున్నందుకా...

వెంటాడి వేదిస్తావు...
హృదినే రగిలించేస్తూ,,,

మురిపించి మరిపిస్తావు...
మనసునే మెలిపెట్టేస్తూ,,,

భాదిస్తావు భందిస్తావు....
బ్రతుకునే నువ్ శాసిస్తూ,,,

స్నేహమా,,అనుకోని వరమా,,,,
అని అనుకోవడమే పాపమా,,
ఓ నా ప్రియతమా...

కాలమే కరుణించని కన్నీటి కావ్యమా...
నీరే లేని వర్షపు మేఘమా...

ఇకనైనా కరుణించుమా....
తొలకరి జల్లు జల్లుమా...

అదే ఈ జన్మకు చాలుమా...
మరుపే రాని ఓ నా ప్రేమా....
సుహానిరాజ్


 ప్రేమ గుడిలో,,
అనురాగ జ్యోతిని వెలిగించి,,
ఆత్మీయఆరాధన చేస్తే,,
అహం అడ్డుపడి,,,
అందనంత దూరం వెళ్లిదంట...
సుహానిరాజ్
ఓ....దేవుడా,,, అందరూ దేనికో ఒకదానికి ఏడుస్తారు,,,,
కొందరు మాత్రం,,,
ఎదుటివాళ్ళు బాగుంటే,,,
కడుపునొప్పితో ఏడుస్తారు..
ఇదెక్కడిన్యాయం ఓ...మంచిదేవుడా.....
★సుహానిరాజ్★
చెప్తున్నా నీకు..
మనసేంత నీకై తపించెనే అని...
వాస్తవం కానీ ఊహే నాదేమో వినుమా..
నిన్ను చూసిన ప్రతిక్షణం,,,,
గుండెల్లో పరవశం పరుగెడుతుంది...
నీతో మాట్లాడిన అనుక్షణo,,
మదిలో మౌనంగా వున్న మూగ భాషేదో,,
భావమై ఉప్పెనలా ఉప్పొంగుతుంది...
నీతో నడిచిన ప్రతిక్షణం,,,
నా ప్రతి అడుగు నీ అడుగును,,,
చేరాలని తడబడుతుంది...
నిన్ను ఊహించిన ప్రతిక్షణం...
బాహ్యంలో వున్నాననే మది మర్చిపోతుంది...
ఎందుకిలా..ప్రేమనా?
నింగిలో చంద్రుడు నాకై నెలమీదకు వచ్చేనా...
ఇది నా అపోహే కదా...నువ్వు నిజం కాదు కదా..
కలలలో నీ రూపం కనుమరుగయ్యే కదా...
బరువెక్కిన గుండెను తడిమి చూసాను...
ఎక్కడ నువ్వవెక్కడ అని.......
వలచి వలచి అలిసిపోయాను...
వేచి వేచి నిశీధిలో కలిసిపోయాను....
కలత చెందనీయకు నేస్తం...
నీ కలగా అయినా మిగిలిపోతాను...
ఎందుకిలా మదిలో చేరి...
నిత్యం కడలాడుతూ భాదిస్తున్నావు...
బాధించే బాధ నువ్వు ఐతే....
ఆకాశం నేలను తాకేవరకు భారాన్ని భరించేస్తా.
నింగినో,,నేలనో,,తెగిన గాలిపటాన్నో..
లేక నీ ప్రేమకు నే బానిసనో....
నువ్వే చెప్పాలి నేస్తం....

సుహానిరాజ్కళ్ళు మూసుకుని కలల్లో విహరించేబదులు..
కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడు..
ఎన్ని అద్భుతాలు కనిపిస్తాయో...
వాటితో పాటు చేదు నిజాలు కూడా....
సుహానిరాజ్.
కాలాన్ని కన్నీటితో ఆపగలమా...అలాగే
కన్నీటిని కంటిలో బంధించగలమా...
కాలం అయినా,,కన్నీరు అయినా,,
దేనికి అదే సాటి...వాటి కర్తవ్యం వాటిదే....
సుహానిరాజ్.

మౌనమే సమాధానం..
నవ్వే ఆయుధం...
మితిమీరిన పోకడలకు....
సుహానిరాజ్....

ఎదురుచూస్తూ వున్నా...
నల్లరంగు పులుముకున్న నిశీధిలోకి....
నీ నవ్వే ఓ కాంతిపుంజమై దారిచూపకపోతుందా?????
అనే చిరు ఆశతో.....
- సుహానిరాజ్....

చిట్టి తండ్రీ....
నువ్వు కడుపులో పడ్డవేళ తెలిసింది...
మూడునెలల రక్తపు ముద్దని....
ఒక్కసారిగా గుండెల్లో,,,,
ఎన్నాళ్ల నుంచో దాచుకున్న దుఃఖపు పొరల చాటున.....
దాగిన కన్నీళ్లు కట్టలు తెంచుకున్న క్షణం....
ఎన్నో ఎన్నెన్నో కోరికలు....
నువ్వు పెరిగే కొద్ది నీతోపాటు పెరిగిన ఆశలు.....
నెలలు నిండిన క్షణం....
ఏదో తెలియని ఆనందం....
రక్తపు ముద్దలా మారితున్న ఈ దేహం....
భరించలేని బాధను పంటికింద ఆదిమిపట్టి,,,,
పిడికిలి బిగించిన వైనం.....
దేహాన్ని చీల్చుకుంటూ నువ్వు బయటపడిన క్షణం.....
కంటిముందు నీ రూపం....
నా కంటిలో కన్నీటి ప్రవాహం....
కోటి కాంతులు కోలాహలం....
రక్తాన్ని క్షీరంగా మార్చి నీకందించిన స్థన్యం...
పాలు తాగేవేళ నాలో పరవశం....
మరుపురాని మధుర జ్ఞాపకం.....
(ప్రతి తల్లికి ఈ కవిత అంకితం).....
-స్మైలీ రాజ్.....

గుర్తుకొస్తున్నాయి....
చిన్ననాటి చిలిపి చేష్టలు....
కాదవి బ్రతుకు ఆశలు....
పరువంలో ఉప్పొంగే కోరికలు....
మదిలో మిగిల్చేను ఎన్నో గాయాలు....
ముచ్చటగా ని మోము....
మదిని ఉక్కిరిబిక్కిరి చేసెనే.....
తొలిచూపు బాహువుని....
నిలువెల్లా తడిపేనే.......
కంటిలో కోటి కాంతులు నిన్ను చూస్తే....
మదిలో మెదిలే తుంటరి ఆశలు నువ్వు పక్కనుంటే....
పెరిగే గుండెచప్పుడు నీ అడుగులు కంటే....
యెదలో లయలు పెరిగే నీ పలుకులు వింటే.....
నీ ఊసులు హృదిలో మెదిలితే చాలు....
తనువంత నిలువెళ్లా పులకరించెను.....
నీ రూపు కనబడితే చాలు.....
కన్నీరు కరిగి ధారగా ప్రవహించెను.....
ఇప్పుడేంటిలా అనే గుండె గుబులు....
ఐనా తప్పదు నాకు గుండె వ్యదలు....
గుర్తుండే నీ మధుర జ్ఞాపకాలు.....
ఏనాడైనా నిన్ను చేరకపోతాన అనే ఆశలు.....
స్మైలీరాజ్......సుహాని రాజ్