Breaking News
Join This Site
బంగారాన్నేమరి ఎప్పుడు గొడవైనా నేనే ముందు మాట్లాడుతా.(తెలుగు కవితలు)

బంగారాన్నేమరి ఎప్పుడు గొడవైనా నేనే ముందు మాట్లాడుతా.(తెలుగు కవితలు)

ఎప్పుడు గొడవైనా నేనే ముందు మాట్లాడుతా.
ఎన్నిరోజులు ఐనా తనగురించి ఎదురుచూస్తా.
తరువాత తను మాట్లాడినా ఏదీ నిలదీయను.
చెప్పకుండానే అన్నీ తెలుసుకుంటాను.
తను చెప్పేవన్నీ వింటూ ఉంటా.
అలుగుతాను కానీ.... సర్దుకుంటా.
తిట్టినా... ఊరుకుంటా.
అరిచినా.. అర్థం చేసుకుంటా.
అన్నిటిలో తనని ప్రోత్సహిస్తూ
వెన్నంటే ఉంటా.
ఏదీ అడగను,ఏమీ ఆశించను.
అన్నీతెలుసు తనకి.
మన FBభాషలో చెప్పాలంటే
200 LIKES 150 COMMENTS వచ్చినా
తన కళ్ళు నా స్పందన కోసం ఎదురు చూస్తుంటాయి.
ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా...
అందుకే నేనయ్యా తన..
బంగారాన్నే మరి
తృష్ణఎక్కడో నీవు...
ఇక్కడనేను....
ఎప్పుడు మాట్లాడతావు అని నేను ఎదురు చూస్తున్న..

ఎప్పుడెప్పుడు నేను మాట్లాడాతానా అని నువ్వు చూస్తూ ఉన్నావు

మౌనాలలోనే ప్రశ్నలు...

అడగలేని మౌనాలు
చెప్పలేని మౌనాలు
ఎప్పటికి తరగని ఈ దూరాలు 

🌿తృష్ణ🌿


Post a Comment