Breaking News
Join This Site
ఉత్తమ స్త్రీ ధర్మాలు : 2వ భాగం

ఉత్తమ స్త్రీ ధర్మాలు : 2వ భాగం
     భర్త యొక్క తల్లితండ్రులనూ..అక్కచెల్లెళ్ళనూ.. అన్ననూ, పినతండ్రినీ, గురువునూ, అతని తరఫు వృధ్ధస్త్రీలను గౌరవించడం, ఆదరించడం, పత్ని యొక్క ధర్మం. తన కంటే చిన్నవారైన బర్తృవర్గీయులతో స్నేహంగా ఉంటూనే పనులు చేయించుకోవాలి. లేదంటే వారు సోమరులౌతారు. పతి యొక్క బంధువుల మధ్యలో అతడు కూర్చుని ఉన్నప్పుడు, పత్ని యొక్క మాటలు, చతలు అన్నీ అతనికి అనుకూలంగానే సాగాలి. ఈ సంగతి అందరికీ తెలియాలి. ఈ శీలమే ప్రశాస్తమని జనశృతి. వరసైన వారితో ముఖ్యంగా పురుషులతో ఏకాంతంలో హాస్యాలాడకూడదు.. పరపురుషునితో అసలు ఏకాంతంగా ఉండకూడదు. ప్రపురుషుల చేతిలో ఏ వస్తువునూ ఉంచరాదు.. వారి చేతి నుండి ఏ వస్తువునూ అందుకొనరాదు..

తలుపులు తెరచి వాకిట నిలబడుట కాని, రాజమార్గం వైపు తదేకంగా చూచుట కాని నిషిధ్ధములు.. అపరిచితుల ఇళ్ళలోనికి కాని, ఉద్యానవనములలోకి గాని వెళ్ళరాదు. భర్త అక్కడే ఉన్నా కూడా పరపురుషుల మధ్యన కూర్చొనరాదు. గట్టిగా మాట్లాడుట, నవ్వుట చేయరాదు. దుష్టస్త్రీ, భిక్షుకి, మంత్రగత్తె, తంత్రగత్తె -- ఇలాంటివారితో మాట్లాడాలనే కోరిక, వారి సంగతి లో ఉండాలనే కోరికను పూర్తిగా త్యజించాలి. తన సుఖం కన్నా, భర్త యొక్క వంశ గౌరవము, అత్తగారింటి ప్రతిష్ట పతివ్రతకు ముఖ్యము. అందుకే ఆమె చాలా త్యాగాలు చేయవలసి ఉంటుంది. తన కులమర్యాద కోసం, అవసరమైతే, చిన్ననాటి స్నేహాలను కూడా వదులుకోవలసి ఉంటుంది.. 

ఉత్తమ స్త్రీ తన భర్తను దైవంతో సమానంగా చూసుకోవాలి.. పతివ్రత అయిన స్త్రీ, తన భర్త చేసే పితృ , దైవ కార్యాలలోనూ, అతిథి, అభ్యాగత స్వాగత సత్కారాలలోనూ వేరెవరినీ నియోగించకుండా తానే స్వయంగా చేయాలి..ఆమెకు పతి మిత్రులే మిత్రులు. పతి యొక్క శత్రువులే శత్రువులు... అయితే మిరులలో అధర్మపరులు, అనర్ధ కారకులు ఉంటే ముళ్ళ పొద మీద నుంచి చీరను లాగినట్టు జాగ్రత్తగా పతిని వారి బారి నుండి కాపాడుకోవాలి. తానున్న ఇల్లు, పరిసరాలు, తన శరీరం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం ఉత్తమ స్త్రీ యొక్క లక్షణం..

రోజుకు మూడు కాలాల్లోనూ, పూజకు కావలసిన సామగ్రిని, సిధ్ధంగా, శుభ్రంగా ఉంచాలి. ఇంటిని మూడు పూటలా తుడిపించాలి. తోటలో మొక్కలకీ, పెరట్లో కూరలకీ, పొలంలో పంటకీ అవసరమైన విత్తనాలనీ ఎరువునీ చెక్క వస్తువులనూ పనిముట్లనూ తన ఆధినంలో ఉంచుకొని అవసరం మేరకు పనివారికిస్తుండాలి. ఇంటికి అవసరమైన వస్తునులను తెప్పించి గురుతుగా ఒక చోట సర్ది ఉంచాలి. సంసారానికి కావలసిన వస్తువులన్ని ఇంట్లో ఉండేలా చూసుకోవాలి కాని, ఏదీ కుళ్ళుట, పాడగుట, బూజు పట్టుట జరుగరాదు. ఏ వస్తువు, వంటసరుకు, ఎక్కడుందో చిటికె వేసే లోగా గుర్తు రావాలి.. అంతే కాని, వెతుకులాట సరికాదు.. (ఇంకా ఉంది )
source : hindu - హిందూ.. 

Post a Comment