Breaking News
Join This Site
బి.కొత్తపల్లె గ్రామంలోని అంకాలమ్మ గ్రామ దేవత

బి.కొత్తపల్లె గ్రామంలోని అంకాలమ్మ గ్రామ దేవతకడప జిల్లా, ఖాజీపేట మండలం, బి.కొత్తపల్లె గ్రామంలోని అంకాలమ్మ గ్రామ దేవత .... మహిమాన్విత కలిగిన అంకాలమ్మ గ్రామ దేవత ఊరిలోకి వచ్చే అరిష్టాలను, అంటువ్యాధులను, దుష్టశక్తులను పొలిమేరలోనే అడ్డుకుని, దూరంగా తరిమేసి తన పిల్లలను కాపాడుకోవాలన్నది ఆ తల్లి ఆకాంక్ష. మన అందరి రక్షణ కోసమే గ్రామదేవతగా అమ్మ పొలిమేరలో కాపలాకు కూర్చుంది. ఊరి మధ్యలో మరియు పొలిమేరలో కూర్చుంది. అందరిని కాపాడుతున్న ఆ దివ్యశక్తి స్వరూపిణిని మనం గ్రామదేవతగా కొలుస్తాం. దివ్యశక్తి స్వరూపిణి అయిన అమ్మకు యొక్క ప్రతిబింబాలే మన అంకాలమ్మ గ్రామ దేవత.
.
బోనాలు మహాకాళిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా జరుపుకోబడుతుంది. శ్రీరామనవమి తరావత వచ్చేఆదివారం నాడు కొత్తపల్లెలో అంగరంగా వైభవంగా పండుగ జరుపుకుంటారు. అంకాలమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.
.
భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు.
.
ఈమాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు.

బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము; మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు. తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబృందమూ ఒక తొట్టెలను (కాగితమూ, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల పరికరము) సమర్పించడం ఆచారంగా ఉంది. అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. అతను భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు. అతను పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడాతాడు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు.
.
పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది.
.
పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు.
.
అమ్మ వారికి మనం సరియైన పద్దతిలో భోనాలు సమర్పించుకుంటున్నామా..??
మన పూర్వీకులు అనుసరించుతున్న భారతీయ హిందూ సంస్కృతి సంప్రదాయాలు నేటి తరం వారు భోనాలు వండడంలో గాని అమ్మ వారికి నైవేద్యాన్ని సమర్పంచడం లోగాని సంప్రదాయాలు పాటించడంలేదు. తలకు ఎండ తగలకుండ, అరికాలికి వేడి తగలకుండ, చేతికి మసి అంటకుండ, శరీరానికి చెమట పట్టకుండా, భక్తితో కాకుండ ఇది ఒక ఫ్యాషన్ గా భావించి అమ్మ వారికి భోనాలు సమర్పించడం జరుగుతుంది. భారతీయ హిందూ సంస్కృతి సంప్రదాయాలు కాపాడ మని హిందూ పండితులు ఎంత మొత్తుకున్నా ఎవరు వినడం లేదు. ఇక నైన ప్రతి హిందూవు మన హిందూ సంస్కృతి సంప్రదాయాలు కాపాడ కొవలసిన భాధ్యత ప్రతి ఒక్కరిపైన వుంది.
.
బోనాలు అనగా:..
భోజనం ఫ్రకృతి. బోనం వికృతి. బోనం అంటే భోజనం. జానపదులు తమకు ఇష్టమైన గ్రామదేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం. దీన్ని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తిప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనంజ్యోతి వెలిగించి జాతర కన్నులపండువగా నిర్వహిస్తారు. వేటపోతు మెడలో వేపమండలుకట్టివ్యాధి నిరోధకశక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల విశ్వాసం.


Post a Comment