Breaking News
Join This Site
 మనిషి సంతోషంగా ఎప్పుడు ఉంటాడు? శాశ్వత ఆనందం సాధించాలంటే ఎం చేయాలి? ఒక లోట్టిపిట్ట (ఒంటె) బ్రహ్మకోసం తపస్సు చేసింది.

మనిషి సంతోషంగా ఎప్పుడు ఉంటాడు? శాశ్వత ఆనందం సాధించాలంటే ఎం చేయాలి? ఒక లోట్టిపిట్ట (ఒంటె) బ్రహ్మకోసం తపస్సు చేసింది.


     సంపద ఉన్నప్పుడే ఇది శాశ్వతం కాదు అని గ్రహించినపుడు సంతోషంగా జీవించగాలుగుతాడు. ఒక్కొక్కపుడు కొందరికి సంపద అయాచితంగా వస్తుంది. ఒక్కోకపుడు వస్తుంది అనుకున్నది కూడా అందకుండా పోతుంది. పని అయినట్టే ఉంటుంది కానీ అవ్వదు. ఇంకోసారి అవ్వదు అనుకున్న పని అయిపోతుంది. తల్లి తండ్రులు, బంధువులు మన కళ్ళముందే మృత్యువు ఒడిలోకి వెళ్లిపోతుంటే ఎలా చూస్తూ ఉంటున్నామో. సంపద కూడా అంతే. ఒక మత్తేభం(ఏనుగు) నీటిలోకి దిగిందనుకోండి నీరు బురద మయం అవుతుంది. ఆ మత్తేభం వెళ్ళిపోయిన కొద్ది సేపటికి తేట నీరు పైకి వస్తుంది. మనకున్న కష్టాలు, సుఖాలు కూడా మత్తేభంలా(ఏనుగులా) వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. వీటన్నిటిని సమదృష్టితో చూసినప్పుడు ఎలాంటి కష్టాలు నీ దరికి చేరవు
సంపద ఉందికదా అని విర్రవీగ కూడదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ!

      ఒక లోట్టిపిట్ట బ్రహ్మకోసం తప్పస్సు చేసింది. దాని తపస్సుకి మెచ్చి ఏదన్న వరం కోరుకోమన్నాడు. ఆ ఒంటె నోరు యోజనాల దూరం సాగే మెడ కావాలి అని కోరుకుంది. దాని కోరిక విన్న బ్రహ్మ ఒసేయ్! అంత మెడ ఉంటె ప్రమాదమే. కదలకుండా అన్ని అందుతుంటే శరీరంలో నిస్సత్తువ ఆవహించి బద్ధకం వస్తుంది. ఏపని చేయలేవు. ఆకోరిక ప్రమాదం అని ఎంత వద్దు అని వారించిన వినలేదు. మొండికేసింది. బ్రహ్మ చేసేది లేక సరే అని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. తోటి జంతువుల కన్నా తనకి అంత పొడుగు మెడ ఉండేసరికి అహంకారం పెరిగింది.


      సాటి జంతువులు ఏదైనా పెడదామని అని ఏదన్న తీసుకొస్తే! మీరు నాకు పెట్టేది ఏంటి? నా మెడ నూరు యోజనాల దూరం సాగుతుంది. దేన్నైనా నేనే సంపాదించుకుంటా అని పొగరుగా చెప్పేది. ఈ మెడ సాగటం వల్ల ఎక్కడికి కదిలేది కాదు. దాంతో కొన్నాళ్ళకి బాగా బద్ధకం పెరిగింది. అలసత్వం ఎక్కువైంది. దీని అహం వల్ల చుట్టూ ఉన్నవారంతా శత్రువులు అయ్యారు. ఒకరోజు బారి తుఫాన్ వచ్చింది. అందరు వెళ్లి ఎక్కడెక్కడ పొద ఉంటె అక్కడ దాక్కున్నారు. ఇదిమాత్రం కదలకుండా తన మెడని సాగదీసి ఒక గుహలో పెట్టి ఆహా భాగ్యం అంటే నాదే! అన్ని వర్షానికి తడవకుండా తల దాచుకోవడం కోసం పొదల్లో, గుహల్లో దూరాయి. నేను మాత్రం నా తలకి వర్షంలో తడిసి రొంప పట్టకుండా ఉన్న చోట నుండి కదలకుండా గుహలో దాచుకున్నాను. అని గర్వించి ఆదమరచి నిద్రపోయింది. 

     హోరున కురుస్తున్న వర్షానికి ఒక నక్కల గుంపు తలదాచుకోవడం కోసం ఈ లోట్టిపిట్ట తల దాచుకున్న గుహ దగ్గరికే వచ్చాయి. పైగా వర్షం వలన ఆహారం దొరకకపోవడంతో మంచి ఆకలిమీద ఉన్న నక్కల గుంపు అక్కడివచ్చాయి. అసలే ఆకలి మీదున్నాయి. ఎదురుగా ఈ ఒంటె మెడ కనిపించేసరికి నక్కల గుంపు అంతా ఒకేసారి మీద పడి పీక్కు తినడం మొదలు పెట్టాయి. ఇదంతా చూస్తున్న స్నేహితులు తమతో శత్రుత్వం పెంచుకున్న ఒంటెని ఒక్కరు కూడా దాన్ని లేపడానికి కూడా ప్రయత్నం చేయలేదు. బద్దకంతో ఉన్న ఒంటెకి ఇవి పీక్కుతింటున్నా బద్ధకం వలన స్పృహ కూడా రాలేదు. కొంతసేపటికి మెడ దగ్గర ఏవో పీకుతున్నట్లు అనిపించి మెలుకువ వచ్చి మెడ తీయాలి అనుకునేలోపు మెడలో ఉన్న నరాలు పటపట తెంచెశాయి. దాంతో ఒంటె కాస్తా చచ్చిపోయింది. 

      కాబట్టి సంపద ఉంది కదా అని ఎవరిని చులకన చేసి చూడకూడదు. అహంకారం తలకి ఎక్కించుకొని శత్రుత్వం పెంచుకుంటే ఆపద సమయంలో ఎవరు తోడు ఉండరు. ఒంటె పరిస్థితి ఎలా అయ్యిందో అహంకరించే వారి పరిస్థితి కూడా అలానే అవుతుంది. నీ దగ్గర సంపద ఉన్నపుడు చుట్టూ ఉన్నవారంతా మంచివారు అనుకోవడం పొరబాటు. కొందరు అధికారం కోసం, కొందరు స్వార్థంతో, కొందరు డబ్బు మీద వ్యామోహంతో, మరికొందరు విలాసాల కోసం, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో నీదగ్గరికి చేరతారు. ఇది నువ్వు కనిపెట్టి అప్రమత్తతతో ఉంటే, ఎవరి మంచివారు ఎవరు స్నేహితులో తెలుసుకుంటే అంతా మంచే జరుగుతుంది. అలాకాదని అహంకరిస్తే పతనం అవుతారు.

మహాభారతం శాంతిపర్వం నుండి...

Post a Comment