Breaking News
Join This Site
కలి ప్రభావం మన మీద లేకుండా ఉండాలంటే! ఇంట్లో సుఖశాంతులు విలసిల్లాలంటే ఈ శ్లోకం తప్పని సరిగా చదవండి..

కలి ప్రభావం మన మీద లేకుండా ఉండాలంటే! ఇంట్లో సుఖశాంతులు విలసిల్లాలంటే ఈ శ్లోకం తప్పని సరిగా చదవండి..
       ఈ కలికాలంలో ప్రతి మనిషిలో స్వార్థం పెనవేసుకుపోయింది. దేనివల్ల అంటే కలిప్రభావం వలన అని అనేక శాస్త్రాలు తెలుపుతున్నాయి. కలికాలంలో కలిదోషం మనదరి చేరకూడదు అంటే ఏమిచేయాలి? నలదమయంతుల కథ కనీసం ఒక్కసారైనా చదవాలి. ఇది కలికాలం కాబట్టి అందరికీ చదివే అవకాశం రాకపోవచ్చు. లేదా చదవాలని ఉన్నా పుస్తకం పట్టుకోగానే మైకం కమ్మి నిద్ర పట్టేయవచ్చు. ఇలా అనుకుంటూ కాలం గడిపేస్తే కలిపురుషుడి ప్రభావం ఎలా తగ్గుతుంది? తగ్గకపోగా ఇంకా ఇంకా పెరుగుతుంది. కలిప్రభావం వలన మనం నిత్యం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కున్తున్నమో, ఎన్ని కష్టాలు పడుతున్నమో చూస్తూనే ఉన్నాం కదా! మరెలా కలిప్రభావం తగ్గుతుంది.

       ధర్మపాలుడు అయిన నలుడిని ఎలాగైనా నాశనం చేయాలని 15 సంవత్సరాలు ఓపికతో ఎక్కడ దొరుకుతాడా అని చూశాడు. ఒకనాడు మూత్ర విసర్జన చేసి కళ్ళు కడుక్కోకుండా సూర్య నమస్కారం చేశాడు. అంతే! ఆ చిన్న పొరబాటు వలన నలుడిలోకి సులువుగా ప్రవేశించాడు కలి. అది కూడా కలియుగం కాదు. కృతయుగంలో.. కృతయుగం అంటే ధర్మానికి నిలయం. ఆయుగంలో అధర్మం పొరబాటున ప్రవేశించలేదు. అలాంటి యుగంలోనే మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోలేదని నలుడిని పట్టుకున్నాడంటే ఈయుగంలో  మనం ఎంత ధర్మబద్దంగా బ్రతుకుతున్నామో ఒక్కసారి అలోచించి చూసుకోండి..

      కలి ప్రవేశించడంతో జూదం ఆడాలని అనిపించింది. అప్పటి వరకు జూదంలో విజేతగా ఉన్న నలుడు తనకంటే అల్పుడైన వాడి చేతిలో రాజ్యంతో సహా సర్వాన్ని కోల్పోయాడు. అడవుల పాలయ్యాడు. అయినా తన ధర్మనిష్ఠకి బద్ధుడై జీవించాడు. ఆపదలో ఉన్న కర్కోటకుడు అనే సర్పాన్ని రక్షించాడు. అప్పటి వరకు సుదరమైన రూపంతో ఉన్న నలుడి క్షేమం కోసం కర్కోటకుడు కురూపిగా మార్చి ఋతుపర్ణుడి రాజ్యానికి వెళ్ళేలా చేశాడు.

     ఇక్కడ తనని అడవిలో తన భర్త తనని ఒంటరిగా ఒదిలి వెళ్ళిన పిదప ఋషుల దర్శనం జరిగిన అనంతరం తన పిన్ని రాజ్యానికి చేరిన దమయంతి భర్త అన్వేషణలో భాగంగా రెండో వివాహం అని ప్రతి రాజ్యానికి వర్తమానం పంపింది. ఋతుపర్ణుడి రాజ్యంలో తన భర్త అయిన నలుడు ఉన్నాడని ఐతే కురూపిగా ఉన్నాడని సందేహించిన దమయంతి ప్రత్యేకించి ఋతుపర్ణుడి రాజ్యానికి రెండుసార్లు వర్తమానం పంపడం, తెల్లారితే స్వయంవరం కావడంతో ఋతుపర్ణుడు నలుడికి రథం తోలడంలో ఉన్న చాకచక్యం తెలిసి సారధ్యం కోరతాడు. అప్పటికే తన భార్య దమయంతి ఇలా ఎందుకు చేస్తుంది? అంత పతివ్రత అయిన దమయంతి నన్ను కాదని మళ్ళి వివాహం ఎందుకు చేసుకుంటుంది? ఇది ఎలాగైనా తెలుసుకోవాలని ఋతుపర్ణుడి విన్నపాన్ని అంగీకరించి రథసారధ్యం వహిస్తాడు.        ఆ రథం వెళ్ళే వేగానికి (నిమిషానికి "నిమిషం అంటే కంటి రెప్పపాటు" అంటే కనురెప్పపాటు కాలంలో 8 యోజనాల దూరం వెళ్ళే వేగానికి) ఋతుపర్ణుడు ఆశ్చర్యపోతాడు. మహాత్మా! నీవు సామాన్యుడిలా లేవు. ఇంత వేగంతో రథాన్ని నడపగల సామర్ధ్యం ఈ భూమండలం మీద ఒక్కరికే ఉంది. ఆయనే నలుడు. అది మీరే అని నా సందేహం. నిజం చెప్పండి అంటూ ఉండగా ఆవేగానికి తన భుజం పై ఉన్న ఉత్తరీయం గాలికి ఎగిరి పడుతుంది. మహాత్మా ఒక్కసారి రథం ఆపండి. ఉత్తరీయం తీసుకురావాలి అనగా! నలుడు మహారాజా! ఉత్తరీయం పడి మీరు నాకు ఆ విషయం చెప్పేలోపు మనం 8యోజనాల దూరం వచ్చేసాం. ఇప్పడు వెనక్కి వెళ్ళడం అంటే సమయానికి మనం చేరుకోలేము. అనగానే ఆశ్చర్యపోయిన ఋతుపర్ణుడు.. మహాత్మా! ఒక్కసారి ఆ దూరంగా కనిపిస్తున్న చెట్టు వద్ద రథాన్ని నిలపండి. అంటాడు. రథాన్ని ఆపుతాడు నలుడు.ఋతుపర్ణుడు నలుడిని వివరం అడుగుతాడు. అప్పుడు జరిగింది చెప్పగా ఋతుపర్ణుడుఆనందాశ్చర్యలకు గురై మహాత్మా! నీకు అక్ష హృదయ విద్య ఉపదేశిస్తాను. నాకు అశ్వహృదయ విద్య ఉపదేశించు అనగానే మహరాజా!ప్రస్తుతం నేను కురూపిని ముందు నాకు అక్షహృదయ విద్య ఉపదేశించండి. ఈ రూపం నేను కోరుకున్న వెంటనే పోతుంది. ప్రస్తుతం ఈరూపం వదలకూడదు. అందుచేత రూపం మారిన వెంటనే మీకు అశ్వహృదయ విద్య బోధిస్తాను. అన్నాడు నలుడు. వెంటనే అక్కడే ఉన్న చెట్టు వద్దకి తీసుకెళ్ళి అక్షహృదయ విద్య బోధిస్తాడు. ఆ మంత్ర ప్రభావం చేత, నిత్యం తాను చేస్తున్న సంధ్యవందం చేత, ఆచరిస్తున్న ధర్మ నిష్ఠ చేత తనలో ప్రవేశించిన కలిపురుషుడు తట్టుకోలేక నల్లటి రూపంలో బయటికి వచ్చాడు.

 "మహానుభావా!నీకు నమస్కారం. నన్ను శపించకు. నేను కలిపురుషుడిని. నిన్ను ఎలాగైనా పరీక్షించి నాశనం చేయాలనీ నీలో ప్రవేశించాను. ప్రవేశించాను అనే పేరే కాని నీలో ప్రవేశించిన క్షణం నుండి నువ్వు ఆచరించే ధర్మనిష్ఠ, నియమ నిష్టలకి నిరంతరం దాహించుకుపోయాను. నిన్ను పరిక్షించడం మాట అటుంచి మొండిగా నీలో ఉన్నాను తప్ప క్షణకాలం సుఖం లేదు. దీనికి తోడు ఇప్పుడు నువ్వు పొందిన అక్ష హృదయ విద్య మరింతగా దహించింది. ఇక నావల్ల కాక ఇలా బయటికి వచ్చేశాను. నన్ను క్షమించు. నన్ను శపించకు. ఈనాటి నుండి నీకో వరం ఇస్తున్నాను. నిన్ను నీభార్యని, కర్కోటకుడిని, ఈ ఋతుపర్ణుడిని ఎవరైతే తలచుకుంటారో వారిని నేను పట్టుకోను. నీకు వరం ఇస్తున్నాను అని అక్కడే ఉన్న చేట్టులోకి ప్రవేశించాడు. ఆ శ్లోకమే ఈ క్రింద ఇచ్చిన శ్లోకం. 

ప్రతి ఒక్కరు నిత్యం ఒక్కసారైనా దీనిని స్మరిస్తే కలి భయం ఉండదు.కర్కోటకస్య నాగస్య దమయంత్యాహ నలస్యచ!
ఋతుపర్ణస్య రాజర్షేహే కీర్తనం కలి నాశనం!
దమయంతి నలాబ్యాంచ ప్రణమామి పునః పునహా!

మీ 
..శ్రీశ్రీ..


Post a Comment