Breaking News
Join This Site
రావణ హనుమ యుద్ధం .. (సంపూర్ణ హనుమత్ వైభవం - పరాశర సంహిత)

రావణ హనుమ యుద్ధం .. (సంపూర్ణ హనుమత్ వైభవం - పరాశర సంహిత)


    రామాయణంలోయుద్ధం ప్రారంభం అయింది. ఒక ప్రక్క రాముడు లక్షణుడు యుద్ధం చేస్తూఉన్నారు. మరోప్రక్కన హనుమంతుడు యుద్దం చేస్తూ ఉన్నాడు. రాముడు సంహరించినమారీచుడు, సుబాహుడు లలో సుబాహుడి కొడుకు దూమ్రాక్షుడు. రావణుడికి అత్యంతప్రీతి పాత్రమైనవాడు. దూమ్రాక్షుడు అనేవాడు హనుమంతుడితో ముహూర్తకాలంఘోరయుద్ధం చేశాడు. వానరులని తెగ పీడించేస్తూ ఉంటె హనుమంతుడు వీడిని చూసివీడి రథం మీద పెద్ద బండరాయి వేశాడు. అది చూసిన ధూమ్రాక్షుడు ఈ రాయి నా రథంమీద పడితే గుండ పిండి అయిపోతుంది. ఇక్కడే ఉంటె నేను కూడా పిండి ముద్దఅయిపోతాను. అని తన గద తీసుకొని రథం మీద నుండి దూకేశాడు. రాయి వచ్చి రథం మీదపడటంతో రథం తుక్కుతుక్కు అయిపొయింది. రథంతోపాటు గుఱ్ఱాలు, సారధి, ఆయుధాలుఅన్ని నుగ్గునుగ్గు అయిపోయాయి. రథం అలా తుక్కు అయిపోయాక తన గదతీసుకొనిహనుమంతుడి వద్దకు వచ్చి హనుమంతుడి శిరస్సు మీద ఒక్కటి మోదాడు. ఆ దెబ్బ ఎలాఉందంటే! పూలదండతో మదించిన ఏనుగుని కొట్టినట్లు ఉంది అన్నాడు వాల్మీకి.హనుమంతుడు అంతటి దెబ్బ తగిలి కూడా మంచి బలమైన మదించిన ఏనుగుని పూలదండతోకొడితే ఏమాత్రం కంపిస్తుందో ఆమాత్రం కంపించాడు. అంతటి బలవంతుడు హనుమంతుడు.హనుమంతుడికి ఏమి కాలేదు. ధూమ్రాక్షుడు గనుక మనబోటి వారిని కొడితే మనంఎక్కడున్నామో కూడా ఎవడూ కనుక్కోలేడు. హనుమంతుడు నవ్వి ఒరేయ్! నీ గద నన్నేమిచేయలేదు. నీ సంగతి చూసుకోమని ఒక పెద్ద కొండ శిఖరం పీకి వాడి మీద వేశాడు.అంతే! తల లేదు. మోకాళ్ళు లేవు, చేతులు ఎక్కడున్నాయో తెలీదు. అసలు వాడుఏమయ్యాడో తెలీదు. బంధువులు అందరూ కలిసి ఆ కొండ శిఖరాన్ని అతి బలవంతం మీదతొలగించి చుస్తే నేలకి అతుక్కుపోయి ఉన్నాడు. అంతలా నలిగిపోయాడు. ఈవిధంగాదూమ్రాక్షుడిని సంహరించాడు.

ఆతరువాత అకంపనుడు అనేవాడు కూడావానరులని చీల్చి చెండాడాడు. అలా చెండాడుతూ ఉంటె హనుమంతుడు చూసి మిత్రులారామీరు విశ్రాంతి తీసుకోండి. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇప్పటివరకు వాడుఅనేక యుద్దాలు చేసి అందరినీ కంపింప జేశాడు. ఇప్పటివరకు వాడిని ఎవరూకంపింపజేయలేకపోయారు. అలా చేయలేకపోయారు కనుక అతడికి అకంపనుడు అని పేరువచ్చింది. ఎప్పుడైనా ఎలాంటి వీరుడైన ఒకసారి కాకపోతే మరొకసారి భయపడతాడు.కానీ అకంపనుడు తన జీవితంలో యుద్దాన్ని చూసి భయపడలేదు. అందుకని వాడినిఅకంపనుడు అన్నారు. దున్నపోతు మీద వర్షం కురిస్తే ఎలా ఉంటుందో వాడి మీదబాణాలు కురిస్తే అలా ఉండేదని వాల్మీకి చమత్కరించారు. అంత లెక్కలేదు వాడికిఎదుటివారంటే.. అటువంటి వాడిని హనుమంతుడు ఒక పెద్ద సాల(మద్ది) వృక్షాన్నిపీకి గిరగిరా తిప్పి నడినెత్తిమీద గట్టిగా కొట్టాడు. దాంతో తల చిత్తడిచిత్తడి అయిపొయింది. వెంటనే హనుమంతుడిని వానరులు పూజించారు.

అనంతరంఅప్పటివరకు యుద్దానికి రాని రావణుడు మొదటిసారి యుద్దరంగంలోకిఅడుగుపెట్టాడు. రావణుడు అద్భుతమైన రథమెక్కి వస్తు ఉంటె హనుమంతుడుదిక్కరించి! ఒరేయ్ రావణా! నువ్వు ఇన్నాళ్ళు ఎన్నెన్నో మహాపాతకాలు చేసావు.రాక్షసులను, యక్షులను, గంధర్వులని, దేవతలని భయపెట్టావు. మానవులనిభయపెట్టావు. నీకు ఎదురులేదు. నీ పరాక్రమం చూసి అందరు దడిచారు. నువ్వుఅవధ్యత్వం పొందావు. అయినా కాదని అనను. ఈరోజు నా దెబ్బతిని బ్రతుకుచూస్తాను. ముందు అవకాశం నీకే ఇస్తున్నాను.ముందుగా నువ్వు నన్ను ఒక దెబ్బకొట్టి చూడు. ఆ తరువాత నాదెబ్బ తిను. నువ్వు ఏమౌతావో చూస్తాను అంటూరావణుడిని గట్టిగ దిక్కరించాడు. ఆతరువాత తన కుడిచెయ్యి పిడికిలి బిగించిరావణుడికి చూపించి "నువ్వు రాముడితో యుద్ధం చేయాలనే ఉత్సాహంతో వచ్చావు.రాముడి వరకు నిన్ను వెళ్ళనివ్వను. ఈ కుడిచేతి పిడికిటి పోటుతో నీ శిరస్సుభిన్నం చేస్తాను. అనగానే రావణుడు "నన్ను కొట్టి చూడు. నీ పరాక్రమం లోకానికీతెలుస్తుంది. ఎదో కొంతమంది సామాన్యులైన పిల్ల రాక్షసులని చంపడం, లంకానగారాన్ని తోకతో తగులబెట్టడం, ఇవి కాదు ఘనకార్యాలు. అప్పుడు నీతోముఖాముఖి యుద్దానికి రాలేదు. ఇప్పడు వచ్చాను. నాశక్తి ఏమిటో చూపిస్తాను.అని తన కుడిచేతి పిడికిలి బాగా బిగించి హనుమంతుడి వక్షస్థలం మీద ఒక్కదెబ్బకొట్టాడు. రావణుడు సామాన్యుడు కాదు కదా! వరాలు పొంది గర్వించి మదించిఉన్నాడు. కైలాస పర్వతాన్ని పెకలించడానికి పూనుకున్నవాడు. మందర పర్వతాన్నిపీకాడు. అలాంటి రావణుడి దెబ్బకి హనుమంతుడు పదేపదే తలతిరిగి కంపించి పోయాడట.గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్లు అయిపొందట. తలని గిజగిజ లాడించాడు. నెత్తురుకక్కుకున్నాడు. ఒక్క క్షణం కాళ్ళు నేలమీద అదిమి తట్టుకున్నాడు. యుద్దనీతిప్రకారం కింద పడితే తాత్కాలికంగా ఓడిపోయినట్లు లెక్క. అందుకే కిందపడకుండాకాళ్ళు నేలమీద తొక్కిపట్టి నిలబడ్డాడు. ఒక ముహూర్తం తరువాత నిలదొక్కుకొనిఒరేయ్ రావణా! నిన్ను ఏమో అనుకున్నాను. నీవు గట్టివాడివే! బాగానే కొట్టావు.మాంసాలు బాగా తినితిని జియ్యబట్టినట్లున్నావు. ఇప్పుడు నాదెబ్బ చూడు. అనితన పిడికిలితో రావణుడిని ఒక్కపోటు పొడిచాడు. ఆ దెబ్బకి రావణుడు రథం లోనుండి కిందపడిపోయాడు. ముక్కుల్లో నుండి, నోట్లో నుండి, చివరికి చెవుల్లోనుండి కూడా నెత్తురు బయటికి వచ్చిందన్నారు. రథ చక్రానికి జారిగిల బడ్డాడు.కనుగుడ్లు గిర్రున తిరుగుతూ ఉండగా సంభాలించుకొని మళ్ళీ లేచి కూర్చున్నాడు.అతికష్టం మీద రెండు చేతులతో చక్రాన్ని పట్టుకొని ఆ విహ్వలతాన్నిపోగొట్టుకొని, తాను కొట్టిన దెబ్బకంటే వెయ్యి రెట్లు బలమైన దెబ్బ కొట్టినహనుమంతుడిని ప్రశంసించాడు.

ఓ వానరోత్తమా! హనుమా! నువ్వుమహావీరుడివని ఇంతకుపూర్వం చాలామంది చెప్పగా విన్నాను. నీతో యుద్ధంచేసేటప్పుడు అక్షకుమారుడు లాంటివారు కూడా గడగడలాడారట. అది విన్నాను కానిఇప్పుడు కళ్ళారా చూసాను.  నీ పరాక్రమం శ్లాఘనీయం. పొగడదగినది. నువ్వుశత్రువువి అయినా నిన్ను ప్రశంసిస్తున్నాను. ఆహ్! ఏమి కొట్టావు? అన్నాడు.అప్పడు హనుమంతుడు నవ్వి! ఏముంది నా పరాక్రమం పొగడడానికి? నేను ఇంత దెబ్బకొట్టినతరువాత కూడా తట్టుకొని నాతొ మాట్లాడుతున్నావంటే ఇంకా నాపరాక్రమంఏముంది? నాముఖం. పరాక్రమం దండగ, ఎందుకు పనికిరాదు. అని ఈవిధంగా పలికిఇంకోక్కసారి కొట్టి చూడు ఆ తరువాత నేను కొడతా అన్నాడు.

రావణాసురుడుహనుమంతుడిని మళ్ళీ వక్షస్థలం మీద కొట్టాడు. వక్షస్థలం మీద కొట్టడంతో బాగాగట్టిగానే దెబ్బ తగిలింది. ఆదెబ్బకి హనుమంతుడు కదిలిపోయాడు. కంపించిపోయాడు.ఈలోపు కంగారుపడిన రావణుడు "నేను ఇక్కడే ఉంటె హనుమంతుడు మళ్ళీ ఒక దెబ్బకొడతాడు. ఈసారి పడితే లేవలేను" అనుకోని చకచకా రథమెక్కి ముందుకివెళ్ళిపోయాడు.

ఆతరువాత లక్ష్మణుడి తో ఘోర యుద్ధం జరిగింది.బ్రహ్మదేవుడు పూర్వం ఈ రావణుడి మహాతపస్సుకి మెచ్చుకొని నాయనా! నీకొకశక్తిని ఇస్తున్నాను. ఈ శక్తిని ఎవరిమీదైన ప్రయోగించావంటే చాలా బాగాప్రయోజనం చూపిస్తుంది. ఇది ప్రయోగించినప్పుడు ఎదుటివారిని చంపడానికికుదరకపోతే/ ఎవరినైనా ఈ ఆయుధం చంపలేకపోతే వాడిని స్పృహ కోల్పోయేలాచేస్తుంది. అన్నాడు. లక్ష్మణుడితో అంత యుద్ధం చేసిన రావణుడు లక్ష్మణుడిమీదకి ఆశక్తిని ప్రయోగించాడు. ఒక్కసారి మాత్రమే పనిచేసే ఆశక్తి లక్షణుడిశరీరం లో నుండి దూరి బయటికి వచ్చేసింది. ఆక్షణమే లక్ష్మణుడు స్పృహ కోల్పోయికిందపడిపోయాడు. లక్ష్మణుడు కిందపడిపోవడంతో రావణుడు రథం నుండి క్రిందికిదిగి లక్ష్మణుడిని పైకి ఎత్తాలనుకున్నాడు. రావణుడు మందర పర్వతాన్ని పైకిఎత్తాడు. మేరు పర్వతాన్ని పెకలించడానికి ప్రయత్నించాడు. దేవతలతో సహాపర్వతాల్ని ఎత్తగల బలవంతుడు. అయినా ఇప్పుడు లక్ష్మణుడు స్పృహ కోల్పోయికిందపడిపోయి ఉంటె ఆయన్ని చేతులతో ఎత్తడానికి ఎంత గింజుకున్న వెంట్రుక వాసికూడా కదపలేకపోయాడు. ఎందుకంటే రావణుడు శక్తిని ప్రయోగించినప్పుడు దానినిచూసి లక్ష్మణుడు "అది బ్రహ్మ ఇచ్చిన శక్తి ఆయుధం. దాని దెబ్బ తిని కూడానేను రావణుడిని చంపవచ్చు. కాని శక్తి ఆయుధం దెబ్బ తిని కూడా నేను యుద్ధంచేస్తే అప్పుడు బ్రహ్మని అవమానించినట్లు అవుతుంది. ఇప్పుడు ఈశక్తి తగిలిస్పృహ కోల్పోకపోతే బ్రహ్మ ఇచ్చిన శక్తి వృథా అంటారు. ఆరోజు నుండిత్రిమూర్తులకి అప్రతిష్ట వస్తుంది. కాబట్టి బ్రహ్మ ఇచ్చిన శక్తినిగౌరవించాలి. అని విష్ణువు యొక్క నాల్గవ అంశా శక్తిని తలచుకున్నాడు.

విష్ణువుతన శరీరాన్ని నాలుగుగా విభజించుకున్నాడు. అందులో ఒకభాగం లక్ష్మణుడు, ఒకభాగం భరతుడు. మరొక భాగం శత్రుఘ్నుడు. నాల్గవ భాగం సాక్షాత్తురామచంద్రుడు. భగవంతుడిలో మొత్తం పదహారు కళలు ఉంటాయి. ఈ పదహారు కళలలో రాముడుపన్నెండు కళలు. మిగిలిన నాలుగు కళలలో రెండు\కళలు లక్ష్మణుడు. మిగిలినరెండుభాగాలు భరత శత్రుఘ్నులు. అందువల్ల యుద్దరంగంలో రాముడి తరువాతి భాగంలక్ష్మణుడు. తరువాతి కళలు భరత శత్రుఘ్నులు. వ్యూహ చతుష్టయంలో తానూ ఒక భాగంకనుక అందువల్ల తన వైష్ణవ శక్తిలో నాల్గవ భాగం అయిన వైష్ణవ శక్తినితలచుకున్నాడు. అందువల్ల తనని ఎవరూ కదల్చలేరు. అందుకే రావణుడు ఎంతప్రయత్నించినా లక్షణ స్వామిని కదల్చలేకపోయాడు. రావణుడు ఆశ్చర్యపోయాడు.ఇదేమి విచిత్రం కైలాస పర్వతాన్ని నా భుజాలతో కదిలించాను. ఎన్ని కొండల్నిఎత్తాను? ఎంతమంది మహావీరుల్ని ఎత్తాను? ఐరావతాన్ని విసిరి అవతల పడేశాను.ఇంద్రుడిని బంధించిన వాడిని. యమదండాన్ని కూడా తట్టుకున్న వాడిని. అటువంటినా పరాక్రమం ఏమైపోయింది? లేక ఈ లక్ష్మణుడి లో ఏదైనా అతీత శక్తి ఉన్నదా? మనిషి శరీరంలో ఇంత శక్తి ఉంటుందా? అని ఎంతో ప్రయత్నించాడు. ఎదో వైష్ణవశక్తి ఉందని రావణుడికి అనుమానం వచ్చింది. అందుకే ఎంత గింజుకున్నా కదలడంలేదని అర్థమైంది. రాముడు కూడా మహావిష్ణుడు అనే అనుమానం కూడా అప్పుడప్పుడువచ్చేది.ఇదంతా చుసిన హనుమంతుడు ఒక్క ఉదుటన అక్కడికి దూకాడు.

ఓరీనీచ్యుడా! మా లక్షణ స్వామిని ఎత్తుకొని నీ లంకకి పట్టుకుపోదామనుకున్నావా? నీ తరమౌతుందా అని అమాంతంగా వచ్చి లక్ష్మణుడిని పైకేత్తడానికిప్రయత్నిస్తున్న టువంటి రావణుడిని ఎదురురోమ్ముతో ఒక్కతోపు తోసి ఇందాక బాకిఉన్న పిడికిటి పోటుతో ఒక్కపోటు పొడిచాడు. ఆ పిడికిటి పోటుకి ఆ ముష్టిఘతానికి రావణుడు మోకాళ్ళ మీద కూలబడ్డాడు.  ఆ మోకాళ్ళతో నేల మీద పడగానే నేలఒక్కసారిగా కంపించిపోయింది. కదిలిపోయాడు. గిజగిజలాడిపోయాడు. తలతిరిగిపోయింది. తనకి ఉన్న పదితలల నోళ్ళ నుండి, కళ్ళ నుండి, చెవుల నుండిరక్తం కక్కుకున్నాడు. అంతే! బడబడా గొట్టాలలో నుండి నీళ్ళు వచ్చినట్లు ముక్కుచెవులు, నోళ్ళ నుండి రక్తం వరదలు కట్టింది. కొంచం కొంచం గా కాకుండా వచ్చిన రక్తాన్ని కక్కుకుంటూ పడిపోయాడు. దేవతలు పై నుండి హర్షద్వానాలు చేశారు. హమ్మయ్య అనుకున్నారు. ఆంజనేయా! నీకీర్తి వర్దిల్లు గాక అనుకున్నారు. పుష్పవర్షం కురిపించారు. అలా అందరూ హర్షద్వానాలు చేస్తూ ఉంటె లక్ష్మణుడి లోచైతన్యం వచ్చి కదులుతూ ఉండగా హనుమంతుడు లక్ష్మణుడిని అవలీలగా మల్లె చెందుఎత్తినట్లు లక్ష్మణుడిని ఎత్తుకొని రాముడి దగ్గరికి వెళ్ళాడు. భక్తితోఎత్తితే భగవంతుడు సులభుడు అవుతాడు అనడానికి ఇదొక నిదర్శనం.


Post a Comment