Breaking News
Join This Site
శ్రీరామ నవమి   పూజా విధానము

శ్రీరామ నవమి పూజా విధానము







శ్రీరామ చంద్రమూర్తి జన్మించిన రోజుగా మనము శ్రీరామ నవమి పండుగ జరుపుకుంటున్నాము. సీతారాముల కల్యాణం శ్రీరాముడు రావణుని వధించి దిగ్విజయంగా అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుకూడ ఈ రోజే మరునాడు అనగా నవమి తరువాత దశమి రోజున శ్రీరామపట్టాభిషేకము జరిగినది ..

శ్రీరామనవమి రోజున ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి, తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. పూజామందిరము, గడపకు పసుపు, కుంకుమ ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి. పూజకు ఉపయోగించే పటములకు గంధము, కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి. 

  ప్రతి హిందువుకు మరువరాని సంతోషమైన రోజు ఈరోజున తనశక్తి కొలది ప్రతివారు సీతారామ భరత శతృఘ్నుల. విగ్రహాలను కానీ శ్రీరామ పట్టాభిషేకపఠమును గాని పెట్టి పూజచేయాలి.

పూజా విధానము

పూజా మందిరంలో గాని పీఠంపైన. గాని కడిగి పసుపురాసిన. పీట వేసి దానిపై కుంకుమతో అలంకరించాలి , పీట మధ్యన. చందనంతో అష్టదళ పద్మమును వ్రాయాలి. దానిపై నూతన వస్త్రమును పరచాలి నూతన వస్త్రముపై బియ్యం పోసి అర అంగుళం మందంతో నలు చదరంగ ఏర్పాటు చేయాలి. పీట మధ్యలో కలశం ఏర్పాటు చేయాలి . కలశము గంధ పుష్పాక్షతలతో పూజించి దాని చుట్టూ అష్టదిక్పాలకులనూ నవగ్రహములనూ అధిదేవతా ప్రత్యధిదేవతా సహితముముగా అవాహనచేసిమండపారాధన చేయవలెను.

పూజా మండపమునకు నాలుగు ప్రక్కలా అరటిపిలకలు లేత చెరకుగడలూ కట్టి పూలతోనూ మామిడాకులతోనూ అలంకరించాలి పూజా జరిగేపందిరికి స్తంభాలు కొబ్బరిఆకులు అరటిబోదెలు కట్టి మామిడి తోరణాలతో అలంకరించవలెను. తర్వాత. పురుష సూక్త సహితంగా శ్రీరామచంద్రమూర్తిని పరివారసమేతముగా పూజచేయాలి. రామ అష్టోత్తరము సీతాష్ఠోత్తరము ఆంజనేయాష్టోత్తరము చదువుతూ తులసీ మారేడు తమలపాకులతో పూజించాలి. తులసితో రామచంద్రుని మారేడు దళములతో సీతాదేవిని తమలపాకులతో ఆంజనేయుని పూజించి శ్రీసూక్త. పురుష సూక్తములూ విష్ణుసాహస్రనామము పఠించవలెను.

నైవేద్యం ••••
చెక్కరపొంగలి మామిడిపండ్లు, చెరకు ముక్కలూ, పానకము వడపప్పుతో నైవేద్యమిచ్చి, కర్పూరహారతి నీయవలెను ఈ. విధంగా అతివైభవంగా శ్రీరామనవమి జరుపుకనవలెను ...




ఇక శ్రీరామ దేవాలయం, భద్రాచలం, ఒంటిమిట్ట, గొల్లల మామిడాడ వంటి ఆలయాలను దర్శించుకోవడం మంచిది. అలాగే దేవాలయాల్లో పంచామృతముతో అభిషేకం, శ్రీరామ ధ్యానశ్లోకములు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామకళ్యాణము వంటి పూజాకార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడంతో పాటు సకలసంపదలు చేకూరుతాయి. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథ వ్రతమును ఆచరించడం మంచిది.

నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజకు కంచుదీపము, రెండు దీపారాధనలు, ఐదు వత్తులు ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు తులసి మాలను ధరించడం చేయాలి. పూజ పూర్తయిన తర్వాత శ్రీ రామరక్షా స్తోత్రము, శ్రీరామ నిత్యపూజ వంటి పుస్తకాలను తాంబూలముతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి.

Post a Comment