Breaking News
Join This Site
 సంస్కృతంలో పుష్పాల పేర్లు.

సంస్కృతంలో పుష్పాల పేర్లు.



మనం పూజలు చేసేటప్పుడు కాని ఏవైనా కథలు, పురాణాలూ చదివేటప్పుడు కాని కొన్ని పుష్పాల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా భాగవతంలో గజేంద్ర మోక్షంలో అడవి వర్ణన అద్భుతంగ ఉంటుంది. అందులో దాదాపు 100 కి పైగా వృక్షాల పేర్లు వినిపిస్తాయి. వాటిని విని ఊరుకోవడం తప్ప మనకి వాటి గురించి తెలీదు. అందుకే మాకు దొరికిన సమాచారం ప్రకారం కొన్ని చెట్లపెర్లు ఇక్కడ మీకోసం అందిస్తున్నాను.

కొన్ని పుష్పాల పేర్లు ఇస్తున్నాను.
1.సేవంతికా = చామంతి
2.సూర్యకాంతి: = పొద్దుతిరుగుడు
3.మాలతీ = మాలతీ
4.వకులం = పొగడ
5.కమలం = తామర
6.జపా = మందార
7.జాతీ = జాజి
8.నవమల్లికా = విరజాజి
9.పాటలం = గులాబీ
10.నక్షత్ర సేవంతికా = నక్షత్ర చేమంతి
11.కురవకం = గోరింట
12.ప్రతాపన: = తెల్లమందారం
13.శిరీషం = దిరిశెన పువ్వు.
14.ఉత్పలం = కలువపువ్వు
15.అంభోజం = తామర
16.సితాంభోజం = తెల్ల తామర
17.కుశేశయం = నూరు వరహాలు
18.కరవీరం = గన్నేరు
19.నలినం = లిల్లీ
20.శేఫాలికా = వావిలి
21.పున్నగం = పొన్న పువ్వు
22.అంబష్టం = అడివి మల్లె
23.జాతీ సుమం = సన్న జాజి
24.గుచ్చ పుష్పం = బంతి
25.కేతకీ = మొగలి
26.కర్ణికారం = కొండ గోగు
27.కోవిదారం = దేవకాంచనము
28.స్థలపద్మం = మెట్ట తామర
29.బంధూకం = మంకెన
30.కురంటకం = పచ్చ గోరింట
31.పీత కరవీరం = పచ్చ గన్నేరు
32.గుచ్చ మందారం = ముద్ద మందారం
33.చంపకం = సంపెంగ
34.కుందం = మల్లె
35.పుష్ప మంజరీ = పూలవెన్ను.

Post a Comment