Breaking News
Join This Site
గృహస్తు మహిమ. (బంగారు ముంగిస - నీతి కథలు)

గృహస్తు మహిమ. (బంగారు ముంగిస - నీతి కథలు)

ఒక ఊర్లో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది. ఆ బ్రాహ్మణుడికి ఒక భార్య, కొడుకుకోడలు ఉన్నారు. వీరు ఉంఛ వృత్తితో బ్రతుకుతున్నారు . ఈ వ్రతనియమాలు ఏంటంటే! ఎవరిని ఏమి అడగకూడదు.ముష్టి ఎత్తకూడదు. కష్టపడి సంపాదించకూడదు. వ్యామోహం లేకుండా ఉండాలి. వీరి పోషణకి ఉంఛ వృత్తి ఆధారం. ఉంఛ వృత్తి అంటే! పొలంలో పంట పండిన తరువాత ధాన్యంలో కొంత భాగాన్ని పొలంలో వదిలేస్తారు. ఆ ధాన్యాని ఏరుకు తెచ్చికొని దానితోనే బ్రతకాలి. ఇదే ఉంఛ వృత్తి.. 

ఇలా వ్రతం చేస్తూ దానికి సంబంధించిన నియమాలు పాటిస్తూ కాలం గడుపుతున్నారు.కాలంలో మార్పులు వస్తూ ఉంటాయి కనుక ఆ సంవత్సరం వర్షాలు సరిగ్గా పడక పంటలు పండలేదు. దీంతో వీరికి ఆహారం లభించలేదు. అయినా నియమాలు మాత్రం వదిలిపెట్టకుండా ఎవ్వరినీ ఏమి అడక్కుండా అలాగే ఉన్నారు. అయితే ధాన్యం కోసం వెళ్ళగా కొద్దో గొప్పో పండిన పొలాల్లో ఒక నాలుగు సేర్లు (ఇంచుమించుగా నాలుగు కిలోలు) యవల ధాన్యం దొరికింది. ఈ ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చి వండి (యవలు దంచి పొట్టు తీసి వాటిని పిండి చేసి నీటిలో కలిపి ముద్ద చేసి దానిని నాలుగు భాగాలు చేసి)  దేవుడికి నివేదించి (మనం అన్నం దొరికింది కదా అని ఎగబడి తినకూడదు, కొంత దైవానికి నివేదించి తింటే ఆ ఆహరం మనకి ఔషదంలా పనిచేస్తుంది. నిజానికి వరి ఔషదమే! కాకపోతే చాలామందికి ఈవిషయం తెలియదు. మనం చేసేది పనైనా, తీసుకునే ఆహారమైన దైవనామ స్మరణ చేసి చేస్తే దానికి వెయ్యింతలు బలం చేకూరడమే కాకుండా దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి) తినదానికి సిద్దమయ్యారు. వీరికి అప్పటికి నెలరోజుల నుండి తిండిలేదు. (నాలుగు కిలోలు నలుగురు తినేస్తార? అనే అనుమానం మనకి. ఈరోజుల్లో 100గ్రాములు అన్నం తింటే గొప్ప అయిపోతుంది. అడ్డమైన చెత్త మాత్రం ఎప్పుడు ఎంత తింటున్నామో మనకే తెలిదు. ఆ రోజుల్లో అలా తినేవారు. అందుకే మన బామ్మలు, తాతలు 90ఏళ్ళు వచ్చిన దుక్కల్లా ఉన్నారు) ఒక వృద్ధుడు పీక్కుపోయిన డొక్కలతో వీరి ఇంటికి వచ్చి బాబోయ్ ఆకలికి తట్టుకోలేక పోతున్నాను అంటూ నిలబడలేక గజగజ వణికిపోతున్నాడు. ఇతన్ని చూడగానే ఆ ఇంటి పెద్దాయన అయ్యయ్యో! అని ఇంట్లోకి తీసుకొచ్చి కాళ్ళు కడిగి ''ఇదిగో ఇదినా వాటా తిండి'' తినండి అని తాను తినే ఆహారాన్ని ఆ వృద్దుడికి పెట్టాడు. 

వృద్ధుడు ఆ ఆహారం తిని సరిపోలేదు బాగా ఆకలిగా ఉంది అనగానే బ్రాహ్మణుడి భార్య ''యావండి ఇదిగో నా ఆహారం కూడా పెట్టండి'' అని తన ఆహారం కూడా భర్తకి ఇవ్వబోతుంటే! భార్యామణి! దొంగతనం చేసైనా, పాపాలు చేసైనా భార్యని పోషించమని శాస్త్రం చెబుతున్నది. అసలే నెలరోజుల నుండి తిండిలేక చచ్చిపోవడానికి సిద్దంగా ఉన్నావు. నా తిండి అంటే నేను పెట్టొచ్చు. కాని భార్య సొమ్ము ఇతరులకి ఇచ్చే హక్కు నాకులేదు. అనగానే ''ఒక్కసారి పెళ్ళయ్యాక మీరే నేను. మీలో సగభాగాన్ని. మీకునాకు తేడాలేదు. మీ ప్రాణమే నాప్రాణం, మీ మర్యాదే నా మర్యాద. మీతిండి మీరు వదిలేసుకున్నారు. నా తిండి వదలలేనా? పర్వాలేదు పెట్టండి అనగానే భార్య ఆహారం కూడా పెట్టాడు. 


ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇది కూడా సరిపోలేదు అన్నాడు. అప్పుడు కొడుకు లేచి ''అత్మావై పుత్ర నామాసి'' తండ్రే కొడుకు రూపంలో పుడతాడు. ఒక అంగం నుండి ఇంకో అంగం పుట్టడమే కొడుకంటే. తండ్రి చేసిన పాపపుణ్యాల రూపమే కొడుకు. తండ్రి అనే శరీరం నుండి బయటికి వచ్చేవాడు కనుక తండ్రే కొడుకు. నీకు నాకు తేడా లేదు. నేను చచ్చిపోతానని భయపడకు. మీ మర్యాద నేను నిలబెడతాను. అని కొడుకు కూడా తన ఆహారాన్ని పెట్టేశాడు. 

అయినా సరిపోలేదన్నాడు బ్రాహ్మణుడు. ఇప్పుడు కోడలు లేచి ''అత్తగారు! మీ భర్తే మీ ప్రాణం అన్నారు. మీ భర్తని అనుసరించడం మీ ధర్మం. నా భర్తని అనుసరించడం నా  ధర్మం. నా ధర్మం ప్రకారం నా తిండిని నా భర్త ఇచ్చినట్లే ఇచ్చేస్తున్నాను. అని తన తిండిని కూడా ఇచ్చేసింది. అది చూసి కోడలా ''కోడలంటే కూతురితో సమానం. నీకేమైనా అవుతుందే అని అత్తమామలు విలపించారు. మీరేం భాదపదకండి అని కోడలు అత్తమామల్ని ఓదార్చింది. 

అది కూడా ఆ బ్రాహ్మణుడు తిని సంతోషంతో లేచి నిలబడి '' ఓ భూసురోత్తమా! నీలాంటి జ్ఞానిని ఎక్కడా చూడలేదు. నిన్ను పరీక్షించడానికి వచ్చిన ధర్మదేవతని. యమధర్మరాజుని నేనే. సాధారణంగా ఆకలితో ఉన్నవారిని ఎవరైనా వచ్చి ఆహారం అడిగితే పొమ్మంటారు! లేదా లోపల దాచుకుని తరువాత తింటారు. అందున నెలరోజుల నుండి ఆకలితో మాడిపోతున్న మీరు ఒకరు కాకపోతే ఒకరైన విసుక్కుంటారని అనుకున్నాను. కాని మీ కుటుంబం ఐకమత్యంతో అతిథిని ఆదరించారు. మీలాంటి కుటుంబాన్ని ఎక్కడా చూడలేదు. మీవ్రతం, మీ ధర్మం, మీ శీలం, మీ జ్ఞానం ఆశ్చర్యకరం. కొన్ని వేల యజ్ఞముల కంటే, కొన్నివేల తపస్సులకంటే, అనేక దానాల కంటే ధర్మాల కంటే మీరిచ్చిన ఈ కొంచం దానం చాలా గొప్పది.  భక్తీ, వినయం, శ్రద్ధతో కూడిన యుక్తి ఉంది. ఓర్పు ఉంది కరుణ ఉంది. అనీ ఉన్న ఏకైక మహా తపశ్శాలివి. నిజమైన కుటుంబం కలిగినవాడివి. గృహస్తాశ్రమం అంటే నీదే. నిన్ను నేను చూసి పొంగిపోతున్నాను.పులకించి పోతున్నాను. మీ గొప్పతనమేమిటో, సహనమేమితో పరిక్షించమని మీ దగ్గరికి నన్ను పంపింది బ్రహ్మదేవుడు. అందుకే వచ్చాను. ఇదిగో ఈ పైన చూడు. సప్తఋషులు నిన్ను చూడాలనుకుంటున్నారు. తరువాత బ్రహ్మలోకానికి వెళుదువు గాక! అః ఏమి నీ సహనం, నీ ఓపిక? ఎంతటి జ్ఞానాన్నైన, ఎంతటి తెలివినైనా, గోప్పతనాన్నైనా ఆకలి నాశనం చేస్తుంది. ఆకలితో ఉన్నవాడు అన్నిపాపాలు చేస్తాడు. దాహం వేస్తె దయలేకుండా పోతుంది. దాహం వేస్తె పక్కనే ఉన్నవాడి కడుపులో నీరైన త్రాగేస్తాడు. అంతటి బాధకలుగుతుంది దాహం వలన.

ఇవన్ని తెలుసుకొని కూడా నీ ధర్మం, నీ వ్రతం నిలబెట్టావు. ఇదిగో పైన చూడు అని ''అత్రి, భ్రుగు, అంగిరస, వశిష్ఠ, గౌతమ, కశ్యప, శాండిల్య వంటి ఋషులు నీ దర్శనం మాకు ఇవ్వు అని అడిగారు. (సాధారణంగా వీరి దర్శనం కోసం ఎదురుచుస్తారు దేవతలు, రాజులు, ప్రజలు, కాని ఈ ఋషులే నీ దర్శనం మాకు ఇవ్వు అని అడిగారు). ఇంతలో పైనుండి మణి, మాణిక్యాలు, సువర్ణాలు అలంకరించి ధగధగ లాడే రథం రాగా, ఈ నలుగురు దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉండగా ధర్మదేవత వచ్చి వీరిని రథంపై ఎక్కించాడు. సప్తఋషుల దీవెనలు అందుకొని, దేవతలను చూసి, శాశ్వతంగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. 

ఇదంతా ముంగిస ధర్మరాజు సభలో చెబుతూ ''ఇదంతా నీకెలా తెలుసు అని అడుగుతావేమో! ధర్మరాజా! నేను అక్కడ ఉన్నప్పుడు వీరింటికి యమధర్మరాజు అతిథి రూపంలో రావడంతో బ్రాహ్మణుడు అతిథి కాళ్ళు కడిగాడు. అప్పుడు ఆ నీళ్ళలో నేను ఒక ప్రక్కగా పొర్లాను. బంగారంలా మారిపోయింది నా ఒక వైపు భాగం. రెండో వైపు పోర్లుదామనుకుంటే నీళ్ళు అయిపోయాయి. ఆశ్చర్యపోయిన నేను ''ఇదంతా అతిథి గొప్పతనమా! ఆతిథ్యమిచ్చిన గృహస్థు గొప్పతనమా! అని అడిగాను. అతిథి ఎప్పుడూ గొప్పవాడే! ప్రాణం పోతున్నా సరే లేచి అతిథి కాళ్ళు కడిగి అతిథికి అన్నం పెట్టి ఆదరించిన ఆ యజమాని, ఆ కుటుంబం వలన ఈ నీటికి ఈ మహిమ వచ్చింది అని ఆకాశవాణి పలికింది.

ధర్మరాజా! ఒక గృహస్థుడు నెలరోజుల నుండి ఆకలితో ఉండికూడా అతిథి రాగానే తాము తినే ఆహారం, చచ్చిపోతారని తెలిసికూడా అతిథికి పెట్టారు,. ఆపుణ్యం వలన కళ్ళు కడిగిన నీరు నా శరీరాన్ని బంగారంగా చేశాయి.. అని చెప్పింది.. 

Post a Comment