Breaking News
Join This Site
మహర్షి - శునకం "అనర్హుడిని అందలాలు ఎక్కిస్తే!" (నీతికథలు)

మహర్షి - శునకం "అనర్హుడిని అందలాలు ఎక్కిస్తే!" (నీతికథలు)


ధర్మరాజు : ఒకరికి ఉద్యోగం ఇచ్చేటప్పుడు కులాన్ని బట్టి ఇవ్వాలా? చాతుర్యాన్ని బట్టి ఇవ్వాలా? శక్తిని బట్టి ఇవ్వాలా? గుణాన్ని బట్టి ఇవ్వాలా?


భీష్ముడు : సందర్భాన్ని బట్టి ఇవ్వాలి. సామాన్య కులంలో నీచ్య కులంలో పుట్టాడు అనుకుందాం. అతడిలో మంచి గుణాలే ఉంటె ఆ గుణాలని బట్టి వాడికి ఉద్యోగం ఇవ్వవచ్చు. అలాగని అందరినీ నెత్తిన తెచ్చి పెట్టుకుంటే ప్రమాదం రావచ్చు. సామర్థ్యము, శక్తి, వాటితో పాటు పవిత్ర గుణములు, విశ్వాసము వీటన్నిటినీ అంచనా వేసి ఉద్యోగం ఇవ్వాలి. స్వకులంతో పాటుగా ఈ గుణములు కూడా చూసుకోవాలి.


పూర్వం ఒక ఆశ్రమంలో ఒక మహర్షి ఉండేవాడు. చాలామంచివాడు, కరుణా స్వరూపుడు చీకు చింత లేకుండా తపస్సు చేసుకుంటూ ఉండగా ఎక్కడి నుండో ఒక కుక్క వచ్చి ఆశ్రమంలో తిరుగుతూ ఉండేది. రోజు మహర్షి ఈ కుక్కని చూసి జాలిపడి తను తినే దాంట్లోనే రోజూ ఒక ముద్ద పెట్టేవాడు. ఇలా కొన్నాళ్ళు గడచింది. ఒకరోజు ఈ కుక్క మీదకి పులి దూకింది. అది భయంతో మహర్షి మహర్షి రక్షించు అంటూ పరిగెత్తుకురాగా కుక్కని తరుముతున్న పులిని చూసి కుక్కని దువ్వుగా మార్చాడు. దువ్వు అంటే పెద్దపులి..ఈ కుక్క కాస్తా పెద్దపులై పులిమీదకి దూకింది. దాంతో ఇప్పటివరకు తమురుకుంటూ వచ్చిన పులి హడలిపోయి పారిపోయింది. ఇంతవరకు కుక్కగా ఉన్న ఈకకుక్క మహర్షి దయవలన పెద్దపులి గా మారింది. ఇప్పుడు ఇది కుక్క పులి.. పులి పారిపోవడంతో కుక్కపులి వచ్చి మహర్షి పదాలు నాకి మీదయ వలన సుఖంగా ఉండండి అని నమస్కరించింది. ఆ మర్నాడు ఒక మదపుటేనుగు వచ్చి ఈ కుక్కపులిని తొండంతో చుట్టేసింది. కుక్కపులి బెదిరిపోయి మహర్షి"ఈ ఏనుగు నా నడుము విరిచేస్తుంది. రక్షించండి" అని వేడుకుంది. వెంటనే పులిగా ఉన్న కుక్కని ఏనుగుగా మార్చాడు. ఈ ఏనుగు ఆ మదపుటేనుగు ని నాలుగు తన్ని గెంటేసింది. ఇక ఆరోజు నుండి ఏజంతువు మీద కొస్తే ఆ జంతువుగా మార్చేస్తున్నాడు. తపస్సు మానేసి కుక్కని కాపాడడమే పనైపోయింది మహర్షికి.. చివరికి అన్నిటికంటే బలమైన సింహాలని, తోడేళ్ళని, గండభేరుండ పక్షులని సైతం తన్నుకుపోగల ఎనిమిది కాళ్ళు కలిగిన శరభసాళ్వ మృగంగా మార్చాడు. ఇక ఇప్పుడు ఇది ఆలోచించడం మొదలుపెట్టింది. 


ఈ మహర్షి కుక్కగా ఉన్న నన్ను పులిగా చేశాడు. పులిగా ఉన్న నన్ను ఏనుగుగా చేశాడు, సింహలా, తోడేలులా మార్చాడు. ఇప్పుడు అన్నిటికంటే బలమైన శరభ మృగంగా మార్చాడు. వీడికి దయ ఎక్కువ. రేపు వేరే కుక్కో నక్కో వస్తే దానిని నాకంటే బలమైన జంతువుగా మార్చడాని నమ్మకం ఏముంది. వీడు బ్రతికి ఉండగా ఇంతబలమైన మృగంగా ఉంటానని నమ్మకం లేదు. పిల్లో ఏలుకో వచ్చి మహర్షి అంటే నామీదకి ఉసి గొల్పుతాడేమో. కనుక ఈ మహర్షిని ఇప్పుడే చంపేస్తాను అంటూ మహర్షి మీదకి దూకింది. (దీనినే నీచత్వం అంటారు. "కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టిన" అని ఊరికే అన్నారా? పుట్టుకతో కొన్ని లక్షణాలు వస్తాయి. అవి ఇలా బయట పడతాయి.) ఈ మునిని చంపేస్తే ఇంకెప్పుడు నాకు ఎవరితో పోటీ ఉండదు. ఏ మృగాన్ని కూడా శరభమృగంగా మార్చడు. శాశ్వతంగా నేను శరభంగ ఉండవచ్చు అనుకోని మహర్షి మీదకి దూకబోయింది. మహర్షి చూసి ఓసి దుష్టురాలా! నీచ్యురాలా! నిన్ను కష్టపడి తపశ్శక్తి ధారపోసి ఇంత గొప్పవాడిని చేస్తే, ప్రాణం పోతుందని ఏడిస్తే ప్రాణం నిలబెట్టి పదవి ఇస్తే నామీదకి వస్తావా! ఈ అధమజాతి దుర్భుద్ది ఎక్కడికి పోతుంది. పుట్టుకతో వచ్చిన బుద్ది పుడలకతో కాని పోదు. పునః కుర్కురో భవ! అన్నాడు. తిరిగి కుక్కలా మారిపోదువు గాక! అనగానే మళ్ళి కక్క అయిపోయి నాలుక బయటికి పెట్టి విశ్వాసం చుపించాబోయింది. ఛీ పో అని తరిమేశాడు. కాబట్టి పుట్టుకతో కుక్కలాంటి దుర్భుద్ది కలిగిన కొన్ని కొన్ని జాతిలక్షణాలు ఉంటాయి. పదవులు ఇచ్చేటప్పుడు అటువంటి వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగని తన కులమే కదా అని తనవాడిని దుష్టుడిని అందలం ఎక్కించకూడదు. మనిషి పెరిగిన వాతావరణం చూడాలి, జాతి లక్షణం చూడాలి. జాతిలో మంచి ఉంటె నెత్తిన ఎక్కించుకోవాలి. మనవాడే కదా అని పనికిమలినవాడికి ఉద్యోగం ఇవ్వకూడదు. నీ కులము వాడు కదా అని సరైన మంచి లక్షణం లేనివాడిని, సామర్ధ్యం లేనివాడిని నెత్తిమీద పెట్టుకుంటే వీడు నిన్ను నాశనం చేస్తాడు. అవన్నీ జాగ్రత్తగా చూసుకోవడం యజమాని కర్తవ్యం. శౌర్యము, సత్కార్యము, జ్ఞానము, భక్తి, తత్పరత, గంభీరత అనే లక్షణాలు కలిగినవాడికి కులంతో పనిలేదు. వాడు సంపదలు పొందడానికి ఉద్యోగానికి అర్హుడు అవుతాడు. 


శౌర్యం, నిజాయితీ, మంచి చెడ్డల వివేకం, సేవ చేసే లక్షణం ఉండాలి, మంచి గంభీరత ఉండాలి, (గాంభీర్యం అంటే ఇక్కడివి అక్కడ అక్కడివి ఇక్కడ చెప్పే నీచ్యమైన అలవాటు ఉన్నవారు కొందరుంటారు. అది వాళ్ళకి సరదా! నీదగ్గర నీ విషయాలు తెలుసుకొని అక్కడికి వెళ్లి అన్నీ వెల్లడి చేస్తారు. అక్కడ ఇక్కడ ఉపయోగం పొందడానికి వాడి దగ్గర వీడి దగ్గర పబ్బం గడుపుకునేవారందరూ కూడా నిర్గాంభీర్యులు. అలా కాకుండా గంభీర్యులు ఎవరో తెలుసుకోవాలి. ఇటువంటి వారందరూ సంపదలకి యోగ్యులు అవుతారు. తరువాత ఒక్కొక్కరిని చుస్తే వారు అడుగుపెట్టిన వేలా విశేషం కూడా తెలుస్తుంది. ఒక్కొక్కడు అడుగుపెడితే దరిద్రం పట్టుకుంటుంది. ఇలాంటివారిని తెలిసి తెలిసి వారికి ఉద్యోగం ఇవ్వకూడదు. ఎందుకంటే అలాంటివారు అడుగుపెట్టగానే ప్రాంగణం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. నష్టాలూ మొదలౌతాయి. అలాంటివారిని కనిపెట్టి ఆశ్రయం ఇవ్వరాదు. అలాగని ఇదే సిద్దాంతం అనుకోకు. నీవు కూడా నీ బుర్రకి పదును పెట్టు. ఎందుకంటే ఇవి మంచి విశేషాలే, ఏవిధంగా చూసినా గుణవంతుడిని, సద్భుద్ది కలిగినవాడిని, సకల కార్య నైపుణ్యం కలిగినవాడిని, బాగా విశ్వాసం కలిగిన విశ్వాస పాత్రుడిని వెదికి పట్టుకోవడం కత్తిమీద సామే యజమానికి.. ఇది మాత్రం శ్రద్దగా విను.. మంచి సింహం ఉంది ఒక అడవిలో. మహా బలం కలిగి ఉంది. అది మృగరాజు. ఏనుగు కుంభస్థలం కూడా చీల్చగలదు. అయినా సరే తక్కినశక్తి సామర్ద్యములు కలిగిన సింహములన్నింటిని కలుపుకుంటేనే సింహం విజయం సాధిస్తుంది. నాబలం చాలు ఈ సింహాలతో పనేముంది అనుకోని కుక్కల్ని పక్కన పెట్టుకొని వాటికి పదవులను ఇస్తే చివరికి దిక్కుమాలినది అవుతుంది. కనుక సింహమైనా సాటి సింహాల అనుగ్రహం ఉంటేనే ఎక్కడైనా విజయం పొందుతుంది. ప్రతివాడు ఎంతమందిని నెత్తిన ఎక్కించుకున్నా తన సాటివారిని విడిచిపెట్టకుండా ఉంటేనే ఎక్కడైనా పైకి వస్తాడు. పైగా యజమానికి ఉండవలసిన లక్షణం మెత్తదనంతో కూడిన మాట. ఉత్సాహంతో కూడిన ప్రవర్తన, పలుకులో పవిత్రత ఉండాలి. ఎప్పుడైనా ఎవరితో అయినా యుద్దానికి వెళ్ళేటప్పుడు తన కూడా ఉన్నవారందరూ చురుకుగా పనిచేసేవారు అయి ఉండాలి. అలా కాకుండా చురుకుదనం లోపించి, బద్దకంతో ఉన్నట్లయితే వెంటనే ఉద్వాసన చెప్పాలి. లేదంటే వీడిని చూసి మరొకడు నేర్చుకుంటాడు. ఇలాంటివారిని తక్షణం ఉద్వాసన చెప్పి గెంటక పొతే తక్కినవారు కూడా సోమరితనం పొందుతారు. కనుక యజమాని ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సిందే. 


రంగురంగులతో ఉన్న నెమలి పురివిప్పగానే జనం ఆకర్షితులు అయినట్లు కష్టపడి పనిచేసే సేవకులు ఉన్న రాజు ఇతరులకు కూడా ఆకర్షితుడు అవుతాడు. ఫలానా చోటకి వెళితే తొందరగా పని పూర్తవుతుంది. పాలనా చోటకి వెళితే ఆహారానికి, విశ్రాంతికి, సేవకి లోటు ఉండదు, ఫలానా చోటకి వెళితే బాగా ఆదరిస్తారు అనుకుంటారు. అలా అనుకోవడమే యనమానికి మేలు జరుగుతుంది. ఎప్పుడు కూడా సేవకులు ఉత్తములై ఉండాలి....
Post a Comment