Breaking News
Join This Site
దేవాసురులమృతం బడయఁగోరి పాలసముద్రమును మథించుట (మహాభారతంలో నీతి కథలు)

దేవాసురులమృతం బడయఁగోరి పాలసముద్రమును మథించుట (మహాభారతంలో నీతి కథలు)

పూర్వం దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని మథించి అమృతాన్ని పొందడానికి పూనుకొని ఇంద్రుని ముందుంచుకొని విష్ణు శంకర బ్రహ్మలతో దేవాసురులందరూ కలిసి మేరుపర్వతం మీదికి పోయి,"ఏ విధంగా సముద్రాన్ని మిథిద్దామా? మథించడానికి స్థిరమైన కవ్వం ఏది? ఆ కవ్వానికి క్రింద ఆధారం ఏది? అని మిక్కిలి చింతించి వెనకాడుతూ ఉండగా బ్రహ్మవిష్ణువు లిద్దరూ ఆ మథనకార్యాన్ని సాధించడానికి సమకట్టారు.

అపూర్వంగా అన్ని పర్వతాలు కూడితే ఎంత పొడవుంటుందో అంత పొడవూ, వంకరలేని ఎత్తూ, మిక్కిలి స్థిరాన్ని కలిగి, మూలికల యొక్క అతిశయత్వంతో కూడి శ్రేష్ఠమైనది అయిన మంథపర్వతం, క్షీరసాగర మథనానికి కవ్వ మవుతుందని నిర్ణయించి ఆ బ్రహ్మవిష్ణువు లిద్దరూ ఆజ్ఞాపించగా, శేషుడు పర్వతాన్ని పెళ్ళగించి పైకెత్తాడు. ఆ విధంగా పదకొండు వేల యోజనంబుల పొడవూ, పదకొండు వేల యోజనాల భూమిలో భాగాన్ని కలిగిన మంథపర్వతాన్ని అనంతుడు(ఆదిశేషుడు)అధికమైన తన శక్తితో పెళ్ళగించి ఎత్తగా దేవాసురులందరూ ఆ పర్వతాన్ని తెచ్చి పాల సముద్రంలో వేసి, పర్వతం దిగిపోకుండా దానిక్రింద ఆధారంగా నారాయణుడు కూర్మ రూపం ధరించి ఉండగా కవ్వపు త్రాడుగా వాసుకి అనే పేరుగలిగిన సర్పరాజుని ఏర్పాటుచేసి రాక్షసులు సర్పరాజైన వాసుకి తలలవైపు, దేవతలు దాని తోకను అధికమైన బలంతో పట్టుకుని వీడని పట్టుదలతో మథించసాగారు. గుండ్రని భూమి అంతయూ కదలగ, దిశలు, దిక్కులు మరుమ్రోగగా, కేకలువేస్తూ అధికమైన ఉత్సాహంతో కూడినవారై వేగంతో దేవతలు, అసురులు సముద్రాన్ని మథించేటప్పుడు వారిచే లగాబడిన వాసుకి యొక్క ముఖ వరుసల నుండి బయల్పడే విషమనే అగ్ని పోగల పొంగులు మేఘపంక్తిని కల్పించాయి. ఈ విధంగా దేవతలు అసురులు మథించి మథించి శక్తి సన్నగిల్లగా, విష్ణువు దేవరాక్షసులకు తగ్గిన శక్తిని గమనించి, శక్తిని స్థిరంగా ఉండేలా అనుగ్రహించాడు. విష్ణువు అనుగ్రహం చేత వారు పొందిన అధికమైన శక్తిచేత పూర్వంకంటే మేరలేని ప్రయత్నం కలవారయ్యారు. 

దేవాసురులు వచ్చిన ఉత్సాహం చేత ఒకరినొకరు చేతులతో చరుచుకుంటూ మరింత వేగంతో సముద్రాన్ని మథించగా విశంపుట్టి నాలుగు దిక్కులా బడభాగ్ని జ్వాలలు రేగి నిప్పుకణాలు ఆవరించి వ్యాపించగా, లోకాలు ఆ విషాగ్ని ధాటికి అల్లకల్లోల మవుతుండగా దానిని అత్యంత వేగంతో శివుడు పట్టుకుని మ్రింగి పొందికగా ఉండేటట్లు తన కంఠంలో నిలిపాడు. అదీకాక జేష్ఠదేవి, చంద్రుడు,లక్ష్మీదేవి, ఉచ్చైశ్రవముఅనే పేరుగలిగిన గుఱ్ఱము,  కౌస్తుభం అనే మణి, ఐరావణమనే తెల్లని గజము(ఐరావతం), అమృతంతో కూడిన తెల్లని కమండలం ధరించిన ధన్వంతరి అనే పేరుగల దేవా వైద్యుడు, మొదలుగా గల పెక్కు వ్యక్తులు, వస్తువులు, జంతువులు పుట్టగా, వాటిలో ముల్లోకాలకూ నమస్కరింప దగిన లక్స్మిదేవి,తన కాంతి సముదాయం చేత తిరస్కరింపబడిన సూర్యుని కిరణముల సముదాయం గల కౌస్తుభం అనేమని విష్ణువు యొక్క వక్షస్థలాన్ని అలంకరించాయి. {వాటిని విష్ణువు గ్రహించాడు), ఉచ్చైశ్రవం అనే గుర్రం, ఐరావతం అనే ఏనుగుని దేవేంద్రుడు స్వీకరించాడు. అప్పుడు అమృతాన్ని రాక్షసులు గ్రహించగా, నేర్పుతో రాక్షసుల నుండి అమృతాన్ని గ్రహించి విష్ణువు దానిని దేవతలకు ఇచ్చాడు. దానిని దేవతలు త్రాగేటప్పుడు, దేవతారూపు ధరించి రాహువు దేవతల పంక్తిలో కుర్చుని అమృతాన్ని త్రాగాబోవగా, అతని చెంత ఉన్న సూర్య చంద్రులు వాడిని గుర్తించి విష్ణువుకి చెప్పారు. ఆ అమృతం రాహువు కంఠ రంద్రం ప్రవేశించడానికి ముందే రాక్షసాంతకుడైన విష్ణువు తన చక్రాన్ని ప్రయోగించగా రాహువు యొక్క కంఠం తెగడం చేత శరీరం భూమిపై పడింది. అతడి ముఖం మాత్రం అమృతం తాకడం చేత నాశనం లేనిదై ఉండిపోయింది. ఆనాటి నుండి రాహువుకు, సూర్యచంద్రులతో విరోధం శాశ్వతమై నేటికీ కొనసాగుతుంది. అప్పుడు రాక్షసులు కోపించి తన రాజైన బలిచక్రవర్తిని కలుసుకొని జరిగిన విషయాన్ని తెలియజేసి ''దేవతలతో పొందు ఇకచాలు, ఇంకెందుకు'' అంటూ గుమిగూడి ఉత్సాహంతో కూడినవారై అమితములైన రాతలను, గుర్రాలను, ఏనుగులను అధికసంఖ్యలో గల కాల్బలాన్ని సమకూర్చుకొని భయంకరమైన ఆకారాలు కలవారై కేకలు వేస్తూ ఇంద్రుడి హృదయం భయపడే టట్లు, దేవతా సముదాయం పరితపించేటట్లు దేవతా శ్రేష్టులను ఎదిరించి బాణాదులైన ఆయుధాలు ప్రయోగించారు. 

రాక్షసులు ఈవిధంగా యుద్ధరంగంలో కధం తొక్కి యుద్దరంగంలో వాడి వాడి బాణాలు ప్రయోగించగా వాటి సమూహం భయంకరమై దేవతల దేమ్సేనమీద కారుమబ్బు వాలే దట్టంగా  కప్పుకొనడం చూచి, గాండీవ ధనస్సుతో, చక్రంతో కూడినవారు, భయంకరులు, శౌర్యలక్ష్మికి ప్రియులు అయిన నరుడు-నారాయణుడు అనేవారు వారింపశఖ్యం కాని పెనుగాలి యొక్క వేగం వంటి వేగంతో రాక్షసులను ముట్టడించారు. నరుని ధనుస్సు నుండి విడువడిన భయంకరాలైన బాణ పరంపరలు దిక్కులు నిండగా అందమైన పర్వతాల యొక్క ఎత్తైన శిఖరాల అంచుల సముదాయం పై కప్పే మేఘాల సముదాయం నుండి విడువడిన దట్టమైన నీటి ధారల సముదాయాన్ని పోలుతూ రాక్షసుల శరీరాన్ని కప్పివేశాయి. వాటి ధాటికి శరీరముల నుండి ఏకధాటిగా రక్తధారల ప్రవాహం ఎడతెగకుండా కారుతుండగా, నారాయణుని యొక్క పొడవైన దండాల వంటి భుజాల నుండి విడువడిన చక్రం యొక్క దెబ్బ చేత రాక్షసుల తలలు తెగి భూతలం చలించేటట్లుగా 
భయంకరమైన యుద్ధరంగంలో పడ్డాయి. 
ఈ విధంగా సముద్రపు ఒడ్డున దేవతలకుం రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆయుద్ధంలో నర నారాయణులు అధికమైన పరాక్రమం కలవారై వీరులైన రాక్షసులని పలువురిని చంపగా, గర్వం తగ్గి దిక్కులేక రాక్షసులు సముద్రంలో ప్రవేశించారు. దేవతలు యుద్దంలో విజయం సాధించి, తమకు రాజైన ఇంద్రుడిని అమృతం రక్షించడం కొరకు ప్రార్థించి, మంథపర్వతాన్ని పూర్వముండే చోటే మళ్ళి నిలిపి తమతమ గృహములకు వెళ్ళిపోయారు.

1. ఉదంకుడి గురుభక్తి, 2. గరుడోపాఖ్యానం, 3.పాలసముద్ర మథనం

Post a Comment