Breaking News
Join This Site
అర్జునుడి మనువడు, అభిమన్యుడి పుత్రుడు అయిన "పరిక్షిత్తు" వృత్తాంతం (మహాభారతంలో నీతి కథలు)

అర్జునుడి మనువడు, అభిమన్యుడి పుత్రుడు అయిన "పరిక్షిత్తు" వృత్తాంతం (మహాభారతంలో నీతి కథలు)

అచట జనమేజయుడు తక్షకుని విశమనే అగ్నిచెత తన తండ్రి యైన పరీక్షిత్తు మరణించడాన్న వృత్తాంతం ఉదంకుడి వలన తెలుసుకుని మంత్రులను చూచి ఇది ఎందువలనా జరిగింది? వివరంగా తెలుపండని మంత్రులను అడిగాడు. 

అభిమన్యుడికి, విరాటుని కూతురైన ఉత్తరకు జన్మించిన ధర్మస్వరూపుడు, కౌరవంశం వినాశ సమయంలో పుట్టి ప్రసిద్దిచే పరిక్షితుడు అని పేరుపొందాడు. ధర్మం అర్థం, కామం అనే పురుషార్థాలను అతిక్రమించక అనుసరిస్తూ, భూప్రజల ననదరిని పుణ్య చరితుడై కాపాడి అరవై సంవత్సరాలు రాజ్యం పాలించిన రాజశ్రేష్టుడు. అధిక ధర్మమార్గం కలవాడైన నీవంటి మంచి కుమారుడిని పొందిన పవిత్రమూర్తి,పుణ్యశీలి. ఇతర ఆజుల మకుట మణిగణ ప్రభారంజిత మణుల సముదాయం యొక్క కాంతిచే ప్రకాశింపబడిన పాదపద్మములు కలవాడు. భరతునితో సమానుడు. 

(అభిమన్యుడు కురుక్షేత్ర సంగ్రామంలో మరణించేనాటికి ఉత్తర గర్భవతి. యుద్ధం ముగిసిన తరువాత పాండవుల సైన్యం నిద్రిస్తుండగా అందరిని ఊచకోత కోసి హతమార్చాడు. ఆవిషయం తెలిసి తనని ఎక్కడ హతమారుస్తారో అని భయపడి వస్తున్న పాండవులని చూచి గర్భస్త శిశువుతో సహసంహరించడానికి ''బ్రహ్మశిరో నామకాస్త్రం'' ప్రయోగించాడు. కృష్ణుడు చక్రం చేత దానికి నివారించి శిశువు బొడ్డుమీద తన కుడికాలి బోటనవ్రేలితో రాసి బ్రతికించి కురువంశాన్ని నిలబెట్టాడు. శిశువు జన్మించిన తరువాత ''తనను శంఖు చక్ర గదా పద్మాలు ధరించి రక్షించిన వాడు ఎక్కడున్నాడు'' అన్నట్లు పరీక్షగా చూచాడు. ఇలా పరీక్షీణములైన కళ్ళతో జన్మించాడు గనుక పరిక్షితుడు (పరిక్షీత్) అనే నామధేయం కలిగింది.)

జనమేజయుడు తండ్రి పరిక్షిత్తు, అతని తండ్రి అభిమన్యుడు, అతని తండ్రి అర్జునుడు. అతని తండ్రి పాండురాజు. పాండురాజువలె వేటమీద ఆశక్తి గలవాడై ఒకనాడు పరిక్షిత్తు పెద్ద అడవులలో జంతువులను తరిమి చంపి, తనబాణపు దెబ్బతిని పరిగెత్తిన ఒక లేడిని అనుసరిస్తూ గొప్ప విల్లు ధరించి, యజ్ఞరూపమైన లేడివేనుక పరిగెత్తే శివుని వలె అమిత్త్ర మాధభేది ఒక్కడు ఒంటరిగా ఆ లేదివేనుక పరిగెత్తడం చేత కలతపడిన హృదయం కలవాడై వెంటనంటి పరిగెత్తుతూ, క్షమా, దమా, సమన్వితుడైన శామీకుడను ముని శ్రేష్ఠుణ్ణి చూచాడు.


ఓ మునిశ్రేష్ఠా! నాచేత బాణం దెబ్బతిని పరుగులు పెట్టిన లేడి ఒకటి ఇటుగా వచ్చింది మీరేమైనా చూచారా? నీ వెరిగిన చెప్పుము అనగా ఆ ముని మౌనవ్రతుడై తపస్సు చేస్తున్న కారణాన పలకకుండా ఉండగా, లేడి కోసం పరుగులు పెట్టి రావడం మూలాన దాహం వేసి దహర్తి తీర్చుకొనుటకోరకు జలమును అడుగగా కటినమైన తప్పసులో ఉండుట చేత ఆ మునిపలుకలేదు. కోపించిన పరిక్షిత్తు మహారాజు ఆముని సమీపంలో చచ్చి పడిఉన్న పాముని తన వింటికొనతో పైకితీసి ఆ శమీకుని మేడలో వేసి హస్తినాపురమునకు వచ్చాడు. ఈ తన తండ్రి మేడలో పాము కళేబరాన్ని వేసి రాజసమున పరిక్షిన్మహరాజు వెళ్ళడం కృశుడనే మునివలన తెలుసుకుని కోపించి శాపమివ్వడం కొరకు కమండలంలోని నీటిని తీసుకుని ''జనరహితమైన అడవి నడుమ ఇంద్రియములను నిగ్రహించి అవుచన్నులు దూడ కుడిచేటప్పుడు వచ్చే పాలనురగనే ఆహారంగా తీసుకుని తపస్సు చేస్తున్న మిక్కిలి ముసలివాడైన నాతండ్రిని అవమానించిన పరిక్షిన్మహరాజు ''నేటి మొదలుగా సప్త దివసములలొ తక్షక విషాగ్నిదగ్దుడై మరణించుగాక!'' అని శాపమిచ్చి తండ్రియైన శమీకుని చెంతకు వెళ్లి పాముయొక్క కళేబరం తండ్రియైన శమీకుడి మూపుల మీద ఉండటం చూడలేక పరధ్యాన వృత్తిలో (తపస్సు లేక ధ్యానంలో) ఇంద్రియములను అడుపుచేసిన శామీకమునిని చూచి ఆ పాముని తీసివేయగా అప్పుడే పరమాత్మ గురించి చేస్తున్న ధ్యానం నుండి కన్నులు తెరచిన తండ్రికి నమస్కరించి కన్నీటితో పరిక్షిత్తు గురించి తను ఇచ్చిన శాపం గురించి వివరించి చెప్పగా శమీక మహర్షి దుఃఖించి ఇలా అన్నాడు .. కోపమే తపస్సుని చెడగొడుతుంది. కోపమే అణిమ, లఘిమ మొదలైన అష్టసిద్ధులను పోగొడుతుంది. కోపమే ధర్మంతో కూడిన కార్యాలకు బాధకలిగిస్తుంది.తపస్సు చేసే మునికి కోపం తగునా? క్షమలేని తపసి తపస్సు, జగ్రత్తపడనివాడి సంపద, ధర్మభాహ్యమైన  ప్రభువు రాజ్యం, ఇవన్ని చిల్లుపడిన కుండలోని నీరువలె వ్యర్థం అవుతాయి. ఇదివరకు ఎప్పుడూ మునులకు చూడనట్టి ''ఓర్పువిడిచి పట్టరాని కోపాన్ని పొంది ఆలోచించక సకల క్షమా రక్షకుడైన పరిక్షిత్ మహారాజుకు శాపమిచ్చి చెడు చేశావు. సకల భూమండలాన్ని పరిక్షిన్మహరాజు రక్షించబట్టే కదా గొప్ప గొప్పమునులు తీవ్రమైన తపస్సులు చేస్తూ, వేదాలచే విధింపబడిన ధర్మకార్యాలను కొనసాగిస్తూ గొప్ప శక్తి గలవారయ్యారు. ఆ మహారాజు ఎంతటి ఉత్తముడు? ధర్మాన్ని నాలుగు పాదాల నిలబెట్టాడు,  ప్రజలందరినీ కన్నా బిడ్డల్లా పాలిస్తున్నాడు. అలంటి మహారాజుని నువ్వు శపించావు. అటువంటి రాజుకే కీడు తలపోయడం కంటే అధికమైన పాపం వేరొకటి ఉండదు. క్షత్రియ వంశులై ధరణిని రక్షించడానికి పుట్టినట్టి రాముడు, మాంధాత, రఘుమహారాజు మొదలైన రాజులు ఏ యుగంలో అయినా బ్రాహ్మణులు, క్షతియులు,కోమట్లు, శూద్రులు అనే నాలుగు వర్ణాలను తమతమ ధర్మాలను తప్పకుండా పరిక్షిన్మహరాజు రక్షించినట్లు రక్షించి ఉన్నారా? అతడికి వేటపై ఆసక్తి ఎక్కువై ఆకలిదప్పికలు చేత మిక్కిలి అలసి తెలియని స్థితిలో నాకు అవమానం చేశాడు. నేను కూడా దానిని సహించాను. ఆమహనీయుడికి నీవిచిన్న శాపం మరల్చి మేలుచేయ్యి అని శమీకుడు చెప్పగా శృంగి ఇలా అన్నాడు. 

కోపంతో ఇంతకుమునుపే పలికాను. నా పలుకు తీక్ ణమై ఈపాటికి మండే అగ్ని ఆకారంలో తక్షకుడిని ప్రేరేపించే ఉంటుంది. నా పలుకు వ్యర్థం కాదు. అనగా శమీకుడు దుఃఖించి తన శిష్యుడైన గౌరవముఖుడు అనే వాడిని పిలిచి దీనినంతయు పరిక్షిన్మహరాజుకు తెలిపి తక్షకుని వలన ప్రమాదం తొలగే ఉపాయాన్ని చేసుకొమ్మని చెప్పిరమ్మని పంపగా పరిక్షిన్మహారాజు  కడకువెళ్లి అడవిలో ఏకాంత మనస్సుతో ఘోరతపమున ఉన్న మా గురువుపై పాముశవమును వేయుట విని వారి తనూజుఁడు శృంగి అనువాడు కోపించి "నేటి మొదలు ఏడవ దినాన తక్షకుడి విషాగ్నిజ్వాలలో పడి దగ్ధమైపోవుగాక అని కార్చిచ్చు వంటి శాపం నీకిచ్చాడు. ఆ శాప వృత్తాంతం గురునకు తెలిసి దుఃఖించి ఓ రాజా!దానివలన కలిగే భయాన్ని తొలగించే మంత్రతంత్ర విధులను ఏర్పరచుకొని ఏమరకుండా ఉండాలని నీకు భోదించుట కొరకు నన్ను నీకడకు పంపారు.. 

అని పరీక్షిన్మహారాజుకు తెలిపి గౌరముఖుడు వెళ్ళగా, కలతచెందిన హృదయం కలవాడై తాను చేసిన ధర్మ విరుద్ధకార్యానికి చింతించి, శమీకుడు ఓర్పుకు మెచ్చుకుని, శృంగి ఇచ్చిన శాపానికి భయపడి, మంత్రుల వర్గముతో మంత్రాంగం నెరపి తనను రక్షించుకోవడంలో ఏమరపాటు లేనివాడై, సర్వభూమండలానికి ప్రభువైన పరిక్షిత్తు అతి ప్రయత్నపరుడై, సర్వక్రియా దక్షులైన తక్షకకోటులు (వడ్రంగి సమూహాలు) పనిచేయగా ఘనమైన స్తంభహార్మ్యమును నిర్మించడానికి ఆజ్ఞాపించి రాత్రింబవళ్ళు మేల్కొని ఉండి శ్రద్ధవహించే ఆప్తుల, సేవకుల, మంత్రుల సమూహంతో ద్రుడరక్షణతో ఒంటిస్తంబపు మేడ నిర్మింపజేసి ఆమేడలో నివాసమేర్పరచుకొని, విషాన్ని పోగొట్టే శక్తితో కూడిన మంత్రాలు, క్రియాకలపాలు కలిగి, వీర్యవంతులు  అజ్ఞాసిద్ధులైన విషవైద్యులను వద్దనుంచుకొని పరిక్షీత్తు ఉండగా, అచట తక్షకుడు విప్రవచన ప్రభోదితుడై (శృంగి యొక్క శాపంచేత ప్రేరేపితుడై) పరీక్షిత్తు కడకువెళ్ళడం ఎలా వీలౌతుందో యని ఆలోచిస్తుండగా!

పూర్వం సకల భూమండలం యందు జరాచరభూత సంఘములను(స్థావరజంగములు-కదిలేటి, కదలలేనివి అయినట్టి ప్రాణుల సముదాయాన్ని) తమ తీవ్రమైన తమ విషాగ్నిచేత పాములు కాల్చివేస్తుండటం వలన కోపించి బ్రహ్మదేవుడు సర్వలోక హితం కోరి పాముల విషంచేత ప్రాణములు కోల్పోయిన వారిని పునర్జీవింప జేసే మంత్రోపదేశాన్ని దయతో కశ్యపుడికి ఇచ్చాడు. అటువంటి కశ్యపుబ్రహ్మ ''శృంగి యొక్క శాపంచేత పరీక్షిత్తు తక్షకుడి విషాగ్ని జ్వాలలకు ఆహుతి కాబోతున్నాడు''. అతడు శాపమిచ్చి నేటికి సప్తదివసములు అయినదట. ప్రాణంపోయిన ఆ పరీక్షిత్తుని పునర్జీవింపజేసి నావిద్య కౌశల్యమును ప్రకాశింపజేస్తాను. అదియును గాక ధరణిఅంతయు రక్షించు ధర్మచరితుడైన ఆ పరీక్షిత్తుని రక్షించి అతనిచేత అపరిమిత ధనాన్ని పొందుతాను. కీర్తిని, ధనమును, ధర్మమును, పుణ్యమును పొందుట నాకు తగదా? అని ఆలోచించి పరీక్షిత్తు ఉండే హస్తినాపురమునకు ఒంటరిగా అడవిలో వెళుచుండగా మార్గమద్యంలో తక్షకుడు ముసలి బ్రాహ్మణరూపం ధరించి కశ్యపుడి ఎదురుగా వచ్చి, ఓ మునిశ్రేష్ఠా! తమరు ఎచటికి ఏ కార్యము మీద వెళుతున్నావు? అని అడుగగా తక్షకుడితో కశ్యపుడు ఇలా అన్నాడు.

తక్షకుడనే పాము నేడు పరీక్షిన్మహారాజును కరుస్తాడట; శత్రువులను అణిచేవాడు, సమర్థుడు, ధర్మబుద్ధి కలవాడు అయిన ఆమహారాజును నా మంత్రతంత్ర సామర్థ్యం చేత కాపాడటానికి వెళుతున్నాను అని కశ్యపుడు చెప్పగా తక్షకుడు మందహాసం చేసి ఇలా అన్నాడు. పాపరహితుడా! నన్ను ఎవరనుకున్నావు? నేనే ఆ తక్షకుడిని. ఇంద్రుడి చేతనున్న వజ్రాయుధం దెబ్బతిని బ్రతికినా బ్రతకవచ్చు గాక!నా విషం చేత చంపబడిన వారిని పునర్జీవింపజేయ సఖ్యం కాదు. నీకడనున్న ఆ మందులు , మంత్రతంత్రాలు నా విషయంలో పనిచేయక వ్యర్ధాలవుతాయి. కనుక తిరిగివెళ్లిపోమ్ము; అట్లాగాక నీశక్తి ఏపాటిదో పరీక్షించుకో దలచిన నీవు చూస్తుండగానే పదియోజనముల విస్తీర్ణములో వ్యాపించియున్న ఈ మర్రిచెట్టును కరిచి నావిశాగ్నితో భస్మం చేసెదను. నీవంతటి శక్తిగలవాడివైతే ఆ చెట్టును మరల తిరిగి జీవింప జేయుమని ఆ తక్షకుడు మహావృక్షాన్ని కరిచాడు.పాములరాజైన ఆ తక్షకుడి విషం వలన పుట్టిన అగ్ని చేతపుట్టిన మహానల జ్వాలల దగ్ధమై విశాలమైన ఆకులచేత, పొడుగాటి కొమ్మలచేత, గగనతలాన్ని ఆక్రమించిన ఆ మర్రిచెట్టు వెంటనే ఫేళాఫేళా ధ్వనులు  చేసుకుంటూ చెంతనున్న పక్షుల, మృగముల సమూహాన్ని భయపెడుతూ, నల్లని మేఘాలు దశదిశలా వ్యాపించగా క్షణంలో కాలి భూడిద అయింది. అంతట కశ్యపుడు పెద్దగా నవ్వి ఓహో ఇదేనా నీవిశాగ్ని మహత్యం? అయిన నాశక్తిని ప్రదర్శించేదను చూడమని ఆ భూడిదను పోగుచేసి తన మంత్రతంత్ర శక్తి చేత మునుపటి వృక్షముగా చేసి చూపగా తక్షకుడు భీతిల్లి విస్మయం చెంది ఓ మునీంద్రా! నీవిద్యా కౌశల్యం అమోఘం, నీమంత్రశక్తితో మరలా పునర్జీవింప చేశావు. అయినప్పటికీ మిక్కిలికోపించిన బ్రాహ్మణుడైన శృంగి యొక్క శాపం చేత పోయిన కలిగిన పరీక్షిత్తుబ్రతికినవాడు కాజాలడు. నీవు అతనిచ్చే సోమ్ముకోరకు కదా నీ విద్యని ప్రదర్శించబోవుచున్నావు. అతనిచ్చే సోమ్ముకంటే అంతకు నూరింతలు ఎక్కువ సొమ్మును నాద్వారా గ్రహించి మరలిపోమ్ము. అని పలుకగా, కశ్యపుడు తన దివ్యజ్ఞానంతో అంతా తెలుసుకుని ఇది దైవఘటన అని మనమున తలచి, తక్షకుడి వలన అధిక ధనం గ్రహించి మరలిపోయాడు.

జనంలేని అడవినడుమ జరిగిన ఆతక్షక, కశ్యపబ్రహ్మల వృత్తాంతం మీరెట్లా తెలుసుకున్నారని అడుగుతారేమో మహారాజా, చెబుతాము వినండి. ఈ హస్తినాపురంలో విప్రుడొకడు కట్టెల కోసం అడవికి వెళ్లి తక్షకుడు కాల్చడానికి ముందే ఆ వృక్షం మీదికి ఎక్కి దానితో బాటుగా దగ్ధుడై మరలా చెట్టుతో బాటే లబ్ధ జీవుడై (మరలా ప్రాణంపోసుకుని) నగరానికేతెంచి ఈ వృత్తాంతం జనులెల్లకు చెప్పగా ఆనోటా ఈనోటా బడి ఆపలుకులు మాకడకు రాగా మాకు తెలిసినది.

తక్షకుడు ఆవిధంగా కశ్యప మహర్షిని మరలించి, ఆ క్షణమందే నాగ కుమారులను పిలిచి; మీరు విప్రరూపం ధరించి సువాసన గల పువ్వులను, వన్య ఫలములను, మోదుగ ఆకులలో, బుట్టలలో పెట్టుకుని పరీక్షిత్తు చెంతకు వెళ్లి అతడికివ్వండని ఆజ్ఞాపించి తానూ అదృశ్య రూపుడై ఒంటిస్థంభ మేడ కడకు రాగా; ఋగ్యసుస్సామ వేదముల పదపాతాన్ని, క్రమపాతాన్ని అనుగుణమైన రీతిలో పలుకుచూ వస్తున్న బ్రాహ్మణ యువకులను హస్తినాపుర వల్లభుడు, పరిక్షిన్మహారాజు చూచి తనదగ్గరకు రమ్మనిపిలిచి, వారు వెంటతెచ్చిన పుష్పములను, వన్య ఫలములను ఇవ్వగా స్వీకరించాడు.ఇంద్రుని ఆకారం వంటి ఆకారం కలిగిన పరీక్షిత్తు; వచ్చిన బ్రాహ్మణ కుమారులకు సత్కారాలు గావించి, ప్రీతి కలిగేటట్లు సన్మానించి పంపి, కాలంచేత ప్రేరేపించ బడిన వాడై, వారు తెచ్చిన వన్యఫలములను తినాలనే కోరికతో దోషరహితుడు, శ్రేష్ఠమైన బలం కలిగినవాడు చెంతనున్న మంత్రులను, బంధువులను, ఆప్తులైన మిత్రులను చూచి బ్రాహ్మణ కుమారులిచ్చిన ఫలసముదాయలను వారందరికీ పెట్టి 'మునియైన శృంగి ఇచ్చిన శాపం సమయపు ఎడవరోజు గడచి సూర్యుడు అస్తమిస్తున్న సమయాన'' ఒక పండు వేగంగా గ్ర్రహించి చీల్చిన వెంటనే నల్లని పురుగై కనబడి, చూస్తుండగానే పారాణి వంటి ఎఱ్ఱని వర్ణంలో ఉవ్వెత్తున ఎగసి పామై, విశాగ్నిని క్రుమ్మరించగా అగ్నులు ప్రజ్వరిల్లి పరీక్షన్మహారాజు ధగ్ధమైపోయాడు. పరివారజనులందరు, పిడుగుపాటుకి భయపడి చెల్లచెదురై చెదరిపోయారు. ఆరాజున్న ఒంటి కంబపు మేడ తక్షకుడి విషాగ్ని చేత  మీతంద్రితో బాటుగా ధగ్ధమైపోయింది. 
ఆ విధంగా నీతండ్రి మరణించగా పురోహితులతో కూడిన భూసురులు శస్త్రవిధుల ననుసరించి ఉత్తమగతుల కలిగించే పరలోకక్రియలు (కర్మలు) చేశారు.Post a Comment