Breaking News
Join This Site
నీ కోసం నేనీడ - సీతలా ఉన్నాను బ్రతుకుకై నేనీడ - శకుంతలై ఉన్నాను (రచయిత : రాధకుమారి)

నీ కోసం నేనీడ - సీతలా ఉన్నాను బ్రతుకుకై నేనీడ - శకుంతలై ఉన్నాను (రచయిత : రాధకుమారి)ఎంత చక్కని వాడె 
నా మదికి చిక్కినాడె....!
మురిపాల ముద్దులరేడు
ఈ జవరాలి సుద్దులవాడు

నల్లని వాడు
మొలక నవ్వులవాడు
కలువ నయనాలవాడు
చూపుల చురకత్తులవాడు

కూడె నా జతగాడు
వాడె నా సరిజోడు
మధుర మైన వాడు
మానస చోరుడు

ఎంత చక్కని వాడె
నా మదికే చిక్కినాడే....!
(రచయిత : రాధకుమారి)
ఎంత చక్కని వాడె 
నా మదికి చిక్కినాడె....!
మురిపాల ముద్దులరేడు
ఈ జవరాలి సుద్దులవాడు

నల్లని వాడు
మొలక నవ్వులవాడు
కలువ నయనాలవాడు
చూపుల చురకత్తులవాడు

కూడె నా జతగాడు
వాడె నా సరిజోడు
మధుర మైన వాడు
మానస చోరుడు

ఎంత చక్కని వాడె
నా మదికే చిక్కినాడే....!
(రచయిత : రాధకుమారి)

నీ కోసం నేనీడ - సీతలా ఉన్నాను
బ్రతుకుకై నేనీడ - శకుంతలై ఉన్నాను
దూరమైన వాడ - మల్లెప్పుడొస్తావో
మరపురాని వాడ - ఎదురెప్పుడొస్తావో

మనసు గెలిచిన చెలికాడ
మమకారాలు చిలికినోడ
వలచి మురిసిన వాడ
దూరమైన గారాల వాడ

మనసు నీపై నిలిపుకొన్న
మమత నీకై పెంచుకొన్న
నీవు లేనిదె నిలువలేను
నీవె దైవమని నమ్మినాను

నిన్ను నమ్మిన చిన్నదానను
అన్నెపున్నెమెరుగని దానను
ఎన్నాళ్ళగానో...............
ఎన్నేళ్ళగానో................

నీకోసం నేనీడ సీతలా ఉన్నాను
బ్రతుకుకై నేనీడ శకుంతలై ఉన్నాను
దూరమైన వాడ మల్లెప్పుడొస్తావో
మరపురాని వాడ ఎదురెప్పుడొస్తావో.....!!!
(రచయిత : రాధకుమారి)

Post a Comment