Breaking News
Join This Site
ఎన్నని చెప్పను ఏమని చెప్పను ఎన్ని చూసినా తనివి తీరదే (రచయిత్రి : రాధాకుమారి)

ఎన్నని చెప్పను ఏమని చెప్పను ఎన్ని చూసినా తనివి తీరదే (రచయిత్రి : రాధాకుమారి)
గాజుల ఫొటో చూశాక నా మనసు కుదురుగుండక... రాసుకున్న" గాజులపై నా మక్కువ"
ఎన్నని చెప్పను ఏమని చెప్పను
ఎన్ని చూసినా తనివి తీరదే
ఎన్ని వేసినా మనసు ఆగదే...!!!.
ఎరుపు, పచ్చ, నీలం, పసుపు
ముత్యాల, రత్నాల, మువ్వల, రవ్వల
ఎన్నెన్ని వన్నెలు
ఎన్నెన్ని చిన్నెలు
ఎన్నని చెప్పను ఏమని చెప్పను
ఎన్ని చూసినా తనివి తీరదే
ఎన్ని వేసినా మనసు ఆగదే...!!!
ముత్యాల గాజులు మురిపిస్తుంటే
రవ్వల గాజులు రవళిస్తుంటే
కెంపుల గాజులు కవ్విస్తుంటే
పచ్చల గాజులు పులకిస్తుంటే
ఎన్నని చెప్పను ఏమని చెప్పను
ఎన్ని చూసినా తనివి తీరదే
ఎన్ని వేసినా మనసు ఆగదే...!!!
గాజుల గలగల సవ్వడి చేస్తూ
చేతులు సైతం చిందులు వేస్తూ
తకథిమి తకథిమి తాళాలేస్తూ
మనసే మయూర నాట్యం చేస్తూ
ఎన్నని చెప్పను ఏమని చెప్పను
ఎన్ని చూసినా తనివి తీరదే
ఎన్ని వేసినా మనసు ఆగదే....!!!

(రచయిత్రి : రాధాకుమారి)పండుగొచ్చెనంటె చాలు
నావేగా సరికొత్త గాజులన్ని
గాజులబ్బి మూటలోన
మరికొత్త గాజులన్ని..!!


అమ్మమ్మ అడిగె నన్ను 
ఏరంగు మక్కువని
ఆ రంగు ఈ రంగు 
కాదు కాదు మరోరంగు
అన్నీ కావలంటు ఆగడాలు నే చేసె..!!


రంగులగాజులు..రవ్వలగాజులు
పూలగాజులు.. పుత్తడిగాజులు
సన్ననిగాజులు..సాదాగాజులు
ఎన్నని చెప్పను ఏమని చెప్పను..!!


అందంగా లెక్కబెట్టి
మరి మెత్తగ నొక్కిపట్టి
వేసిందే దెలియకుండా
గాజులేసె గాజులబ్బి..!!


చేతినిండ గాజులేసి
పట్టుపావడ పైట వేసి
సంపంగి జడనుతురిమి
గల్లుగల్లు గజ్జె కట్టి
చెంగు చెంగు నే వెళ్తే
పండుగంత నాతోనే
పబ్బమంత నాలోనే..!!


ఓ బావా...!! 
కళ్ళల్లో కలలన్నీ రాయాలని కవితలుగా...
చెప్పలేని ఆశలన్నీ పంపాలని పదములుగా...
తట్టిలేపు తలపులన్నీ తేల్చాలని కావ్యంగా.....
మరపురాని మధురాలే కూర్చాలని లేఖలుగా.....
జామురేతిరేల నుంచి కూచున్నా కలముపట్టి.....
నీ పేరుతప్ప మరియేమి రాయలేక.....
అక్షరాలు కరువయినయ్ అరుదైన భావాలకు....
నీ "పేరే" సరికాదా వేనవేల కవితలకు...!!
నీ "పేరే" సరికాదా కానరాని కావ్యాలకు...!!

(రచయిత్రి : రాధాకుమారి)

Post a Comment