Breaking News
Join This Site
ఎలాంటివాడు సుఖంతో, శుభంతో నిర్భయంగా జీవిస్తాడు? సద్గుణాలు!

ఎలాంటివాడు సుఖంతో, శుభంతో నిర్భయంగా జీవిస్తాడు? సద్గుణాలు!

లోకంలో అన్ని వర్ణాలవారికి (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు నాలుగు వర్ణముల వారు),  అన్ని ఆశ్రమాల వారికి (బ్రహ్మచర్య, గృహస్త, వానప్రస్త, సన్న్యాస ఆశ్రమాలకు) శాంతి, దాంతి కలిగి ఉండడం విశేషించి బ్రాహ్మణులకు దాంతితో (నిగ్రహంతో)కూడిన జీవన విధానం ఎక్కువగా కావలసి ఉంటుంది.నిగ్రహం సధ్గుణాలరాశి.

ఆ సద్గుణాలు?
నిగ్రహం అనే లక్షణం ఉంటె దానిలో ఎన్నో ఇమిడిపోతాయి. ఆ సద్గుణాలు ఇవి:
పరిశుబ్రత - బయటి, లోపలి మలినాలు తొలగించుకోవడం, కోపంలేకుండా, కపటం లేకుండా దైన్యానికి (ప్రతి సమస్యకి అకారణంగా కృంగిపోకుండా) దూరంగాజీవించడం, పరాకు పడకుండా (చదువు కాని, ఇంకేదైనా పని కాని ప్రారంభించి మధ్యలో ఏదో ధ్యాసలో ఉండటం, వేరే ఆలోచనలు చేయకుండా) ఉండటం  దురభిమానం (ఎదుటివాడు మంచోడని ఎవరైనా పొగిడితే వీడిని, వాడిని ఇద్దరినీ దూషించడం, చెడు పని చేసేవారి మీద అధికప్రేమ కనబరచడం), అధిక ప్రసంగం (అయినదానికీ,కానిదానికి అనవసరంగా మాట్లాడటం), వీటిని త్యజించడం, ఎల్ల ప్రాణుల యందు సమభావం కలిగి ఉండి, దయతో ఉండటం, పెద్దల యెడల గౌరవం కలిగి ఉండటం, ఇతరులను నిందించడం, పొగడటం వంటి పనులు చేయకపోవడం, కొండెములు(వీదిమీద వాడికి, వాడిమీద వీడికి, ఒకరిమీద మరొకరికి చాడీలు చెప్పడం) చెప్పకుండా ఉండటం, సజ్జనుల సాంగత్యం చేయడం, అబద్దాలు ఆడకుండా ఉండడం, ఆశలకు లోనుగాక పోవడం, హింసకు పాల్పడకపోవడం, మంచి శీలం కలిగి ఉండటం, ఇంద్రియాలను అదుపులో ఉంచడం. ఇవన్నీ వాస్తవానికి దమము రూపాంతరాలే. ఈ లక్షణాలు గల ధన్య జీవి ఇహలోక విషయాల వలనకాని,పరలోక విషయాలలో గాని ఎట్టి పరిస్థితులకు భయము ఉండదు. ఏర్పడదు. వీరు శాంతికి సుఖానికి నిలయమై ఉంటారు. జ్ఞానం వలన సౌమ్యమైన ఆకారంతో వెలుగొందుతారు.

ధమవంతుడు సధ్గుణరాశి.

వ్రాత నిర్వహణలో ఉన్నవారు అక్కడక్కడ అప్పుడప్పుడు భోజనాలు చేస్తూ ఉంటారు. వారికి వ్రతభంగం వాటిల్లదా?
విప్రుల కోరిక మీద చేసే భోజనాలు, ఇంకా వేదోక్తాలయిన భోజనాలూ వ్రతస్థులు చేసినా వారివలన వ్రతహాని కలుగదు అని శాస్త్రాలు చెపుతున్నాయి. మొక్షార్థి యైన సాధకుడు సదా ఉపవాసిగా బ్రహ్మచారిగా ఉండాలి. మాంసాహారం భుజించకూడదు. దేవతలా అతిథులకు పెట్టగా మిగిలినది మాత్రమే భుజించేవాడు అమృతాన్ని భుజించేవాడు. నిదురపోనివాడుగా కూడా ఉండాలి. పైన తేలిపిన వీరిస్వరూపాలు ఏవిధంగా ఉంటాయి?

రోజుకు రెండు పూటల భోజనం చేస్తూ మధ్యమధ్య ఏమీ తిననివాడు సదోపవాసి.
ఋతుకాల సమయాన మాత్రమే ధర్మపత్నితో సంగమించేవాడు సద్బ్రహ్మచారి
ఆహారాన్ని దేవతల,పితరుల, అతిథుల కొరకు వండి వడ్డించి ఆ పిదప మాత్రమే భుజించేవాడు అమాంసాహారి.
సేవకులందరూ భుజించిన తరువాతే భుజించే పుణ్యాత్ముడు అమృతాశి.
పగటిపూట నిద్రపోనివాడు అస్వప్నుడు. (నిద్రపోనివాడు)ఇటువంటి మహా వ్రతాలన్నీ శరీర భాధకాలే. 

Post a Comment