Breaking News
Join This Site
మొదట నేను నీ కళ్ళలోని  వెన్నెల వెలుగుతో మాట్లాడాను (వసుంధర కవితలు)

మొదట నేను నీ కళ్ళలోని వెన్నెల వెలుగుతో మాట్లాడాను (వసుంధర కవితలు)






మొదట నేను నీ కళ్ళలోని 

వెన్నెల వెలుగుతో మాట్లాడాను

నీ పెదాలపై విరిసిన 
హరివిల్లుతో మాట్లాడాను 
చివరిగా నీ హృదయంతో మాట్లాడాను 
నా ఆశలన్నీ ఊహగా మారి 
నీ జ్ఞాపకాలు గతంలా చేరి 
నీ గొంతు సవ్వడితో 
నా హృదయనాదాలు ప్రతిద్వనించెను 
నీ మాటలే సంజీవినిలా
నాలో జీవం పోసెను
ఇది మరో లోకంలా వుంది 
పువ్వు తేనెటీగ రాకకోసం 
ఎదురు చూసినట్టుగా 
నేను నీకోసం ఏడురంగుల 
ఇంద్రధనుస్సునై ఎదురుచూస్తున్నాను
......నీ వసుంధరసిరి




గాలిలో పరిమళం చెబుతుంది 
ఇప్పుడే నువ్విలా వచ్చి వెళ్ళావని 
ఎవరినీ చూసిన నీ నవ్వులే
కనిపిస్తున్నాయి 
గుండెలో ఊసులు నీకు చెప్పాలని 

ఆశగా ఉన్నది 
నా ఊహలకు రెక్కలు తొడిగి 
ఆశలకు దిక్కులు తెలిపి
గుండె లయకు పరుగులు నేర్పి 
గిలిగింతలతో అల్లరి చేస్తున్న బావా......
ఆకాశం అంచుల్ని తడుతూ 
గాలిలో తేలిపోదామా.......

.................నీ వసుంధరసిరి

వసుంధరసిరి

Post a Comment